Narmada District
-
ఐక్యతా విగ్రహం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం!
అహ్మదాబాద్: గుజరాత్‌లోని నర్మదా జిల్లాలో ఉన్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. స్టాచ్యు ఆఫ్ యూనిటీ పరిసరాల్లో టూరిస్టులను తిప్పే 15 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల్లో మంటలు చెలరేగాయి. అయితే, ఛార్జింగ్ చేస్తుండగానే మంటలు అంటుకున్నట్లు వస్తున్న వార్తలను స్టాచ్యు ఆఫ్ యూనిటీ ఏరియా డెవలప్మెంట్, టూరిజం గవర్నెన్స్ అథారిటీ తిరస్కరించింది. ఛార్జింగ్ పాయింట్‌కు 35 అడుగుల దూరంలో ఉన్నాయని స్పష్టం చేసింది. ఐక్యతా విగ్రహం వద్దకు వచ్చే టూరిస్టుల కోసం 90 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను ఓ ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోంది. వాటికి స్థానిక ట్రైబల్ మహిళలు డ్రైవర్లుగా వ్యవహరిస్తున్నారు. ‘గురువారం తెల్లవారుజామున కెవాడియా గ్రామం సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్ వద్ద నిలిపి ఉంచిన 15 ఆటో రిక్షాలల్లో మంటలు చెలరేగాయి. అందుకు గల కారణాలు తెలియరాలేదు. ఛార్జింగ్ స్టేషన్‌కు 35 అడుగుల దూరంలో వాటిని నిలిపి ఉంచారు. దాంతో ఛార్జింగ్ చేస్తుండగా మంటలు వచ్చాయనేందుకు సరైన ఆధారాలు లేవు.’ అని ఓ ప్రకటన జారీ చేసింది ఎస్ఓయూఏడీటీజీఏ. మంటలపై సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక విభాగం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఇతర వాహనాలకు వ్యాపించకముందే మంటలను ఆర్పివేసింది. ఈ సంఘటనపై ఆటో రిక్షాలను నిర్వహిస్తోన్న ప్రైవేటు సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదీ చదవండి: కోవిడ్ కొత్త వేరియంట్ల పుట్టుకకు కేంద్రంగా చైనా.. నిపుణుల ఆందోళన -
ఐక్యతా శిల్పం సందర్శన ఐదు రోజులపాటు నిలిపివేత
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని కేవాడియాలో సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ ఐక్యతా శిల్పం సందర్శనను అక్టోబర్ 28 నుంచి నవంబర్ 1వ తేదీ దాకా నిలిపివేస్తున్నట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. పటేల్ 147వ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవాలను(రాష్ట్రీయ ఏక్తా దివస్) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐక్యతా శిల్పంతోపాటు సమీపంలోని ఇతర పర్యాటక ప్రాంతాల్లోనూ సందర్శకులకు ఐదు రోజులపాటు అనుమతి ఉండదని వెల్లడించారు. రాష్ట్రీయ ఏక్తా దివస్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుగా సందర్శకుల రాకను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. (చదవండి: హమ్మయ్య.. ముంబై నగరం కాస్త ఊపిరి పీల్చుకుంది) -
6 లక్షల మంది ఒకేసారి చేతులు కడుక్కున్నారు!
వడోదర: మనకు సంక్రమించే అనేకరకాల వ్యాధులకు బ్యాక్టీరియాలు, వైరస్‌లే కారణమనే విషయం తెలిసిందే. చేతులు కడుక్కోకుండా తినడం వల్లే ఇవి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే తినేటప్పుడు చేతులు కడుక్కోవాలనే విషయమై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గుజరాత్లో ఓ పే..ద్ద కార్యక్రమం జరిగింది. నర్మదా జిల్లాలో ఒకేసారి 6 లక్షల మంది చేతులు కడుక్కున్నారు. నర్మదా జిల్లాలోని 561 గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయినందున గుజరాత్లో 100 శాతం మరుగుదొడ్లు నిర్మించి, బహిరంగ మల, మూత్ర విసర్జనలేని మొదటి జిల్లాగా అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. తిలకోడా నియోజకవర్గంలోని కలగోడా గ్రామంలో ప్రధాన కార్యక్రమం జరగగా, మిగతా 560 గ్రామాల్లో కూడా ఒకేసారి చేతులు కడుక్కునే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ ప్రతినిధి లక్ష్మీబెన్ భావని కూడా పాల్గొన్నారు. పారిశుద్ధ్యాన్ని పాటిస్తే ఎటువంటి లాభాలుంటాయో ప్రజలకు వివరించారు.