సాధారణంగా వర్షాకాలంలో జలుబు, దగ్గు, ఫ్లూతోపాటు ఇతర ఇన్ఫెక్షన్లు చుట్టుముట్టే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అందులో ముఖ్యంగా.. ఇంటిని శుభ్రపరచడం నుంచి వర్షంలో తడిసిన తరువాత స్నానం చేయడం వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
తడిసిన తరువాత స్నానం చేయాలి
మనమందరం వర్షంలో తడిసి ఆనందిస్తుంటాం.. అందులోనూ చిన్నారులు మరింత ఉత్సాహం చూపిస్తుంటారు. వర్షంలో తడిసిన తరువాత తప్పకుండా స్నానం చేయాలి. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్, దగ్గు, జలుబును నివారించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి.
నీరు తాగాలి
ఈ సమయంలో తగినంత నీరు తాగటం చాలా ముఖ్యం. ఇటువంటి పరిస్థితిలో ప్యాక్డ్ వాటర్, కియోస్క్‌లు, ధాబాస్ లేదా షాపుల నుంచి వడకట్టని నీటిని తాగరాదు. వాటర్ ప్యూరిఫైయర్ నుంచి మాత్రమే నీరు తాగండి. ఇది మిమ్మల్ని అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.
వెంటిలేషన్ ఉండాలి
మనం ఎక్కువ సమయం గడిపే స్థలం కూడా వర్షాకాలంలో ప్రభావితం చేస్తుంది. ఇరుకైన ప్రదేశంలో ఉంటే అంటు వ్యాధులు త్వరగా వ్యాప్తి చెందుతుంటాయి. వీలైనప్పుడల్లా ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచండి.
తప్పకుండా చేతులు కడుక్కోవాలి
వాష్‌రూమ్ డోర్, ట్యాప్, ఫ్లష్ మొదలైన వాటి ద్వారా సూక్ష్మక్రిములు మన చేతుల్లోకి వస్తాయి. మీరు భోజనానికి ముందు ఆ తరువాత తప్పనిసరిగా సార్లు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఇది అంటువ్యాధులను నివారించడానికి మీకు సహాయపడుతుంది.
ఇంటిని శుభ్రంగా ఉంచండి
వర్షాకాలంలో ఇంట్లో చాలా దుమ్ము వచ్చి చేరుతుంది. వర్షంతో వచ్చే తడితో ఇంట్లోకి ఈగలు వస్తుంటాయి. అవి అంటువ్యాధులను, ఇన్ఫెక్షన్లను మోసుకొస్తుంటాయి. సూక్ష్మజీవులు వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం చాలా ముఖ్యం. ఇంటి శుభ్రతతో దోమలు, ఇతర కీటకాల పెంపకాన్ని నివారించవచ్చు. ఇది వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని చాలా తగ్గిస్తుంది.
►చర్మ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు వేడినీటితో రోజు రెండు పూటలా స్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల చర్మంపై పేరుకున్న మురికి, క్రిములు తొలగిపోతాయి. అలర్జీలు దరి చేరకుండా చూసుకోవచ్చు.
చదవండి: Rainy Season Healthy Diet: వర్షాకాలం.. పచ్చి ఆకు కూరలు, సీ ఫుడ్ వద్దు.. ఇవి తినండి!
Health Tips: ఖాళీ కడుపుతో ఇవి తింటే చాలా డేంజర్..! అవి కూడా అతిగా వద్దు!
5 Fruits For Monsoon Diet: జలుబు, దగ్గు.. వర్షాకాలంలో ఈ ఐదు రకాల పండ్లు తిన్నారంటే..!
Comments
Please login to add a commentAdd a comment