ఋతువులు మారే కొద్దీ మన శరీరంలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. వర్షాకాలంలో ఐతే ఇక చెప్పక్కరలేదు. షరా మామూలే! అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఏ కొంచెం ఏమరుపాటుగా ఉన్నా సీజనల్ వ్యాధులు దాడిచేస్తాయి. మరెలాగని అనుకుంటున్నారా? వెరీ సింపుల్!! మన రక్షణా వ్యవస్థ పటిష్టంగా ఉంటేచాలు. ప్రముఖ నూట్రీషనిస్ట్ రాధికా కార్లే సూచించిన ఈ టిప్స్ పాటించండి.. ఆరోగ్యంగా ఉండండి..
విటమన్ ‘సి’ అధికంగా ఉండే ఆహారం
రెడ్ బెల్ పెప్పర్ లేదా ఎరుపు రంగులో ఉండే క్యాప్సికమ్, బొప్పాయి, నిమ్మ, టమాటాలలో విటమన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. వీటిని మీ ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే మీ రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది.
బయట తినకపోవడం మంచిది
ఇంటి వంటలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. సాధ్యమైనంత వరకు హోటళ్లు, రోడ్డు పక్క దొరికే చిరుతిండ్లు తినకపోవడం మంచిది. జొన్న లేదా అమరంత్ వంటి చిరు ధాన్యాల్లో కూడా ప్రొటీన్లు నిండుగా ఉంటాయి. కూరగాయల ముక్కలు వేసి కిచిడీలా తయారు చేసుకుని తింటే రుచితోపాటు ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
సుగంధ ద్రవ్యాలు
పసుపు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి వంటి మసాలా దినుసులు కూడా మీ ఇమ్యునిటీ పుంజుకునేలా చేస్తాయి. వంటకాల్లో ఈ మసాలా దినుసుల వాడకం ఉండేలా చూసుకోంది. అలాగే సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన టీ లేదా నిమ్మ రసంలో కొన్ని అల్లం ముక్కలు చేర్చి ఉదయాన్నే తాగితే రోజంతా ఫ్రెష్‌గా అనిపిస్తుంది.
తగు మోతాదులో నీరు త్రాగాలి
కాలాలతో సంబంధం లేకుండా అన్ని ఋతువుల్లో తప్పనిసరిగా సరిపడినంత నీరు త్రాగాలి. నీళ్లతోపాటు జ్యూస్‌లు, ఔషధ మూలికలతో తయారుచేసిన కషాయాలు తరచూ తాగుతూ ఉండాలి.
ఆహారాన్ని సరిగ్గా ఉడికించాలి
మార్కెట్ నుంచి కొని తెచ్చుకునే తాజా ఉత్పత్తుల్లో బ్యాక్టీరియా కూడా వెన్నంటే ఉంటుంది. కాబట్టి తగినంత వేడి మీద ఆహారాన్ని ఉడికించాలి. అలాగే తొక్క ఒలిచి తినే పండ్లు అంటే.. అరటి, మామిడి, పుచ్చకాయ, ఆరెంజ్, లీచీ.. వంటి ఇతర ఫలాలు మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆహారపు అలవాట్లతో మీ ఇమ్యునిటీ పుంజుకుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
చదవండి: మేకప్‌తో దాచేసినా ఇబ్బంది తప్పదు.. ఈ చిట్కాలు పాటిస్తే బెటర్!
Comments
Please login to add a commentAdd a comment