రైలు కింద పడి చేతిని కోల్పోయాడు
రాజమహేంద్రవరం క్రైం : ప్రమాదవశాత్తు రైలు కిందపడి ఒక వ్యక్తి చేతిని కోల్పోయాడు. కాకినాడకు చెందిన విస్సాకోటి శ్రీనివాస్ కొంతకాలంగా రాజమహేంద్రవరంలోని అన్నపూర్ణమ్మ పేటలో ఉంటూ వడ్రంగి పని చేస్తుంటాడు. బుధవారం తునిలోని బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో కలసి రైలులో వెళ్లేందుకు స్థానిక గోదావరి రైల్వే స్టేషన్‌లో ప్యాసింజర్ రైలు ఎక్కుతుండగా రైలుకు, ఫ్లాట్‌ఫాంకు మధ్య పడి చేతిని కోల్పోయాడు. తీవ్ర గాయాల పాలైన శ్రీనివాస్‌ను హుటాహుటిన రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్‌కు ఒక బాబు, పాప ఉన్నారు. వడ్రంగి పనికి ప్రధానమైన చేతిని కోల్పోవడంతో కుటుంబ పోషణ అగమ్యగోచరంగా మారింది. కళ్ల ముందు జరిగిన దుర్ఘటనను కుటుంబీకులు జీర్ణించుకోలేపోతున్నారు.