Faridabad Mother Hangs Son Balcony Shocking Video Goes Viral - Sakshi
Sakshi News home page

Shocking Video: పట్టుతప్పితే ఏంటి సంగతి? వైరల్​ వీడియోపై ఆ తల్లీకొడుకులు ఏమన్నారంటే..

Published Fri, Feb 11 2022 11:09 AM | Last Updated on Fri, Feb 11 2022 12:28 PM

Faridabad Mother Son Balcony Shocking Video Viral - Sakshi

బిడ్డ ఎలాంటోడైనా, ఎంతటోడైనా ఆ తల్లికి పసివాడే. అలాంటిది పసివాడినే ఆ తల్లి అలా చేసేసరికి.. చూసేవాళ్లకి చిర్రెత్తుకొచ్చింది. చీర, బెడ్​షీట్లకు కొడుకును వేలాడదీసి పైకి లాగిన ఆ తల్లిని చూసి.. ‘ఇదేం తల్లీ? అనుకునేవాళ్లంతా’.. అందుకు కారణం తెలిసేసరికి తిట్టిన తిట్టు తిట్టడమే కనిపిస్తోంది సోషల్​ మీడియా అంతా..


ఫరిదాబాద్​లో చోటు చేసుకున్న ఘటనగా ఈ వీడియో సర్క్యులేట్​ అవుతోంది. పోయినవారం సెక్టార్​ 82లోని ఓ సొసైటీలో ఇది జరిగింది. బాల్కనీలో ఆరేసిన చీర కింద ఫ్లోర్​లో పడిపోవడం, ఆ ఇంటికి తాళం వేసి ఉండడంతో.. వేరేవాళ్ల సాయం కోరకుండా ఇదిగో ఈ తల్లి ఇలా కొడుకును కిందకు వేలాడదీసి పంపి.. చీరను పైకి తెప్పించుకుంది. అదీ తొమ్మిదవ ఫ్లోర్​ నుంచి..

ఆ సమయంలో దూరంగా ఎదురుగా ఎక్కడో ఉన్న అపార్ట్​మెంట్​లో ఓ వ్యక్తి ఈ వీడియో తీసి సోషల్​ మీడియాలో అప్​లోడ్ చేశాడు. అలా వైరల్​ అయ్యింది ఆ వీడియో. ఏ మాత్రం జంకు లేకుండా ఆ పిలగాడు పైకి వెళ్తుండగా.. ఆ తల్లి నిమ్మలంగా పైకి లాగుతూ కనిపించింది. ఆ పక్కనే మరికొందరు ఉన్నారు. గ్రిల్​ మీద కాళ్లు పెట్టే క్రమంలో పట్టుతప్పి ఉంటే గనుక ఆ బిడ్డ సంగతి ఏంటని తిట్టి పోస్తున్నారు.

Daily News Haryana సౌజన్యంతో వీడియో


ఇక వైరల్​ అయిన వీడియోపై ఆ తల్లీకొడుకులు సైతం స్పందించారు. అయితే వాళ్ల మాటలు గనుక వింటే.. అప్పటిదాకా పిల్లోడి మీద జాలి చూపించిన వాళ్లకు మరింత కోపం రావడం ఖాయం. పడితే ఏమవుతుంది? ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రోజు పోవాల్సిందేగా అని ఆ బుడ్డోడు చెప్తుంటే.. వీడియో తీస్తున్నారని తెలియదని, ఈ ఘటనకు తనను క్షమించాలని ఆ తల్లి అంటోంది.  ఈ ఘటన పోలీసుల దృష్టికి సైతం వెళ్లింది. మరి వాళ్లు ఏం చేస్తారో చూడాలి మరి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement