చండీగఢ్: సోమవారం మధ్యాహ్నం ఫరిదాబాద్‌లో బల్లాగఢ్‌లో 21 ఏళ్ల నికితా తోమర్‌ని రోడ్డుపై అతి దారుణంగా కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు తౌసీఫ్ నేరాన్ని అంగీకరించాడు. నికిత మరో వ్యక్తితో వివాహానికి సిద్ధపడటంతోనే ఆమెను హత్య చేశానని వెల్లడించాడు. నికిత (21) పరీక్ష రాసి వస్తుండగా, మాటు వేసిన ఇద్దరు దుర్మార్గులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపి అక్కడినుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఇక పోలీసుల దర్యాప్తులో ఈ నెల 24, 25 తేదీలలో నికిత, తౌసీఫ్‌లు దాదాపు 16 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కెరీర్‌ని నాశనం చేసింది.. అందుకే
నికితా తోమర్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తౌసీఫ్ తమ కుమార్తెని వివాహం చేసుకోవాల్సిందిగా చాలా కాలం నుంచి వేధిస్తున్నాడని తెలిపారు. ఒకసారి నికితను కిడ్నాప్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని.. వారు అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆ మరుసటి రోజు ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదరడంతో తౌసీఫ్ మీద పెట్టిన కేసును వాపస్ తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక పోలీసుల విచారణలో తౌసీఫ్.. తన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో మెడిసిన్ చదవలేకపోయానని.. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలిన భావించి.. నికితను హత్య చేశానని తెలిపాడు. (నడిరోడ్డుపై యువతి దారుణ హత్య : షాకింగ్ వీడియో)
Comments
Please login to add a commentAdd a comment