మెట్రో స్టేషన్‌లో కలకలం, పైనుంచి దూకేస్తానన్న యువతి.. అంతలో | Viral: Faridabad Cops Save Lady When She Tried Jumping Off Metro Station | Sakshi
Sakshi News home page

మెట్రో స్టేషన్‌లో కలకలం, పైనుంచి దూకేస్తానన్న యువతి.. అంతలో

Published Sun, Jul 25 2021 9:17 PM | Last Updated on Sun, Jul 25 2021 9:37 PM

Viral: Faridabad Cops Save Lady When She Tried Jumping Off Metro Station - Sakshi

చండిగఢ్‌: అంతవరకు ప్రశాంతంగా ఉన్న మెట్రో ఆవరణమంతా ఒక్కసారిగా అలజడి నెలకొంది. ఏం జరిగిందో తెలీదు గానీ ఓ యువతి మెట్రో స్టేషన్‌ పై నుంచి దూకేందుకు ప్రయత్నించింది. చివరకు పోలీసుల ఎంట్రీతో కథ సుఖాంతంగా ముగిసింది. ఈ ఘటన హర్యానాలో జూలై 24 న సాయంత్రం 6:30 గంటలకు చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళితే.. ఫరిదాబాద్‌ మెట్రో స్టేషన్ బాల్కని పైకి అకస్మాత్తుగా ఓ యువతి ఎక్కి అక్కడి నుంచి దూకాలని ప్రయత్నించింది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అంచనా వేసిన పోలీసు అధికారి, సిఐఎస్ఎఫ్‌ సిబ్బంది, మెట్రో సిబ్బందితో కలిసి.. ఆ యువతి దృష్టిని మళ్లించేందుకు ముందుగా ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. అలా మాటల్లో పెట్టిన పోలీసు అధికారి ఆ యువతి వద్దకు మెల్లగా చేరుకున్నాడు. ఇంతలో, మరో వ్యక్తి కూడా ఆమె వద్దకు చేరడంతో తనని కాపాడగలిగారు. 

విచారణలో.. ఆ యువతి, ఫరీదాబాద్ సెక్టార్ 28 లో ఉన్న ఓ ప్రవేట్‌ ఎక్స్‌పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిపింది. తాను చేస్తున్న పని కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పేర్కొంది. అనంతరం పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపారు. కాగా ఫరీదాబాద్ పోలీసు శాఖ ఆ యవతిని కాపాడిన వారిని అభినందిస్తూ ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది . యువతిని కాపాడటంలో అధికారులు చూపిన సమయస్ఫూర్తికి , ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement