
ఛండీగఢ్: హర్యానాలోని ఫరీదాబాద్ డిప్యూటీ కమిషనర్ (డీసీపీ) ఆత్మహత్యకు పాల్పడారు. ఫిరీదాబాద్ డీసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విక్రమ్ కపూర్ బుధవారం తెల్లవారజామున తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం దీనిపై విచారణ చేపడతామని తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే పని ఒత్తిడి కారణంగా విక్రమ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన విక్రమ్ గత ఏడాదే ఐపీఎస్‌గా పదోన్నతి పొందారు.
Comments
Please login to add a commentAdd a comment