పాములతో సరదాగా .... | Snake cafe opens in Tokyo's fashion district | Sakshi
Sakshi News home page

పాములతో సరదాగా ....

Published Sat, Aug 15 2015 1:07 PM | Last Updated on Mon, Oct 22 2018 2:22 PM

పాములతో సరదాగా .... - Sakshi

పాములతో సరదాగా ....

టీవీ చూస్తూనో, స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్తూనో, టీ, కాఫీ తాగేస్తాం. మనిషన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలన్నట్లు... వెరైటీగా ...పాముల మధ్య కూర్చొని పానీయాలు సేవించాలనుకుంటే ఈ కేఫ్కు వెళ్లాల్సిందే. ఈ కేఫ్లో ఉండే ప్రతీ టేబుల్పై ఉండేవి విష సర్పాలు కావు. కేవలం కోరలు లేని పాములు మాత్రమే.

అయితే ఈ కేఫ్కు వెళ్లాలంటే మాత్రం మీరు జపాన్లోని టోక్యో సమీపంలోని హిరాజుకు జిల్లాకు వెళ్లాల్సిందే. రూ.523 చెల్లించి కేఫ్లో టేబుల్ను వాడుకోవచ్చు. కాటు వేయని ఈ పాములను పట్టుకోవాలన్నా, వాటికి ఏమైనా ఆహారం అందించాలన్నా అదనంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కాగా  ఈ కేఫ్లో 20 వేర్వేరు జాతులకు చెందిన మొత్తం 35 పాములను పెంచుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement