పాములతో సరదాగా ....
టీవీ చూస్తూనో, స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్తూనో, టీ, కాఫీ తాగేస్తాం. మనిషన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలన్నట్లు... వెరైటీగా ...పాముల మధ్య కూర్చొని పానీయాలు సేవించాలనుకుంటే ఈ కేఫ్‌కు వెళ్లాల్సిందే. ఈ కేఫ్‌లో ఉండే ప్రతీ టేబుల్‌పై ఉండేవి విష సర్పాలు కావు. కేవలం కోరలు లేని పాములు మాత్రమే.
అయితే ఈ కేఫ్‌కు వెళ్లాలంటే మాత్రం మీరు జపాన్‌లోని టోక్యో సమీపంలోని హిరాజుకు జిల్లాకు వెళ్లాల్సిందే. రూ.523 చెల్లించి కేఫ్‌లో టేబుల్‌ను వాడుకోవచ్చు. కాటు వేయని ఈ పాములను పట్టుకోవాలన్నా, వాటికి ఏమైనా ఆహారం అందించాలన్నా అదనంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ కేఫ్‌లో 20 వేర్వేరు జాతులకు చెందిన మొత్తం 35 పాములను పెంచుతున్నారు.