
Lavanya Tripathi: కొండ ప్రాంతం.. చుట్టూ పచ్చని చెట్లు.. మధ్యలో ఇల్లు... అక్కడ బస చేస్తే దక్కే అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టం. ఆ అనుభూతిని ఆస్వాదించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు లావణ్యా త్రిపాఠీ. ఈ అందాల రాక్షసి ప్రకృతి ప్రేమికురాలు. పచ్చని చెట్లన్నా, పంట పొలాలన్నా ఆమెకు చాలా ఇష్టం. అందుకే ముస్సోరీకి దగ్గర్లో కొండ మీద ఉన్న చమసారి అనే గ్రామంలో ఒక వ్యవసాయ భూమిని కొన్నారు. అక్కడొక బస ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు.
అయితే రెగ్యులర్ ఇల్లులా కాకుండా ఒక కేఫ్‌ని తలపించేలా కట్టించాలనుకుంటున్నారు. ఈ కేఫ్ పూర్తిగా తన కుటుంబ సభ్యుల కోసమేనని, వ్యాపారం కాదని లావణ్య పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడే రీతిలో సహజమైన వస్తువులతో నిర్మాణాన్ని ప్లాన్ చేస్తున్నామన్నారు. అక్కడ కొన్ని రోజులు ఉంటే రీఛార్జ్ అయిపోతాం అని కూడా అంటున్నారు లావణ్య. ఇప్పటికే అక్కడ దాదాపు 25 మొక్కలు నాటించారు.
చదవండి:
గ్లామర్ సీక్రెట్ చెప్పిన హన్సిక