
ఉత్తరప్రదేశ్‌కు వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయాగ్‌రాజ్ మరో కొత్తదనాన్ని సింగారించుకుంది. ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ కొత్త సొబగును సిద్ధం చేసింది. రాష్ట్రంలోని మొట్టమొదటి ఫ్లోటింగ్ రెస్టారెంట్, బోట్ క్లబ్, మొదటి ట్రాఫిక్ పార్క్ ప్రయాగ్‌రాజ్‌లో ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. తాజాగా ఈ జాబితాలో ఇప్పుడు డిజిటల్ కేఫ్ అందరికీ అందుబాటులోకి వచ్చింది.
ప్రయాగ్‌రాజ్‌లోని ట్రాఫిక్ పార్క్ లో ప్రారంభించిన ఈ డిజిటల్ కేఫ్‌కు అత్యధిక సంఖ్యలో యువత తరలివస్తున్నారు. ఈ కేఫ్‌లో అల్పాహారానికి బదులుగా డిజిటల్ గేమ్స్ అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం మూడు పెద్ద ఎల్‌ఈడీలు ఏర్పాటు చేశారు. ఇక్కడకు వచ్చేవారు సోఫాలపై కూర్చుని, హెడ్‌ఫోన్ పెట్టుకుని వీడియో గేమ్‌లను ఆడవచ్చు. టెంపుల్ రన్, బైక్ రేసింగ్, కార్ రేసింగ్ ఇలాంటి ఏ గేమ్ అయినా ఇక్కడ ఆడుకోవచ్చు.
ఈ పార్కులోకి ప్రవేశించేందుకు పిల్లలకు రూ.5, పెద్దలకు రూ.10 టిక్కెట్టుగా నిర్ణయించారు. డిజిటల్ కేఫ్, మోషన్ థియేటర్‌లకు ఎంట్రీ ఫీజుగా రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పార్క్ ఉదయం 9:00 నుండి రాత్రి 9:00 వరకు తెరిచి ఉంటుంది. ఈ పార్కును ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ పర్యవేక్షిస్తున్నది.
Comments
Please login to add a commentAdd a comment