
సాక్షి, సిటీబ్యూరో: బిర్యానీ, నాన్‌వెజ్ వంటకాలకు నగరంలో ప్రసిద్ధి చెందిన కేఫ్ బహార్ పంజాగుట్టలో తమ శాఖను ఏర్పాటు చేసింది. అత్యాధునిక శైలిలో ఏర్పాటైన ఈ రెస్టారెంట్‌ను బుధవారం సినీనటి సమంత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్ బిర్యానీ తనకు ఫేవరెట్ వంటకం అన్నారు. వెరైటీ రుచులను ఎంజాయ్ చేయడాన్ని ఇష్టపడతానన్నారు. రెస్టారెంట్లో కొన్ని వంటకాలను ఆమె రుచి చూశారు.
నిర్వాహకులు రఘునాధ్‌రెడ్డి, సుబ్బారెడ్డి, మధుసూధన్‌రెడ్డిలు మాట్లాడుతూ.. పంజాగుట్ట పరిసర ప్రాంతవాసుల అభిరుచులకు తగ్గట్టుగా చవులూరించే వంటకాలతో మెనూను రూపొందించామని వివరించారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు నీలకంఠ తదితరులు పాల్గొన్నారు.