కేఫ్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి | Two killed in shooting at cafe, two badly injured | Sakshi
Sakshi News home page

కేఫ్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి

Published Fri, Mar 10 2017 7:51 AM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

కేఫ్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి

కేఫ్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి

జెనీవా: స్విట్జర్లాండ్‌లోని ఓ కేఫ్పై దుండగులు దాడి చేశారు. తుపాకులతో విచక్షణారహితంగ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డాడు.

బాసిల్‌ పట్టణంలోని 'కేఫ్‌ 56'లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి 8:15 గంటల సమయంలో(స్థానిక సమయం) కేఫ్‌లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు వస్తూనే కాల్పులకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. కాల్పుల అనంతరం వారు రైల్వేస్టేషన్ వైపు పారిపోయారని తెలిపారు. అయితే.. ఈ దాడి వెనుకాల ఉగ్రకుట్ర ఉందా అనే విషయాన్ని మాత్రం పోలీసులు నిర్థారించలేదు. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదని, విచారణ జరుగుతుందని బాసెల్‌ ప్రాసిక్యూటర్స్‌ ఆఫీస్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement