indias first igloo cafe opens at kashmir - Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో ఇగ్లూ కేఫ్‌.. ఒక్కసారైనా వెళ్లాల్సిందే!

Published Sat, Jan 30 2021 2:27 PM | Last Updated on Sat, Jan 30 2021 4:22 PM

Viral: Indias First Igloo Cafe Opens In Kashmir - Sakshi

క‌రోనా వ‌ల్ల అన్ని రంగాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. చిన్న చితక సంస్థల నుంచి భారీ స్థాయి వ్యాపారాల వరకు అన్నీ ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయాయి. మహమ్మారితో కుదేలైన రంగాల్లో టూరిజం(పర్యాటకం) కూడా ఒకటి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి రావడంతో అన్ని రంగాలు తిరిగి సాధారణ స్థితికి వచ్చేస్తున్నాయి. 9 నెలల పాటు ఇళ్లకే పరిమితమైన జనాలు బయట ప్రపంచానికి అడుగుపెడుతున్నారు. ఆనందం, ఆహ్లాదం కోసం షికార్లు, టూర్‌ల బాట పడుతున్నారు. ఇందుకు అనుగుణంగానే ప్రజలను, పర్యాటకులను ఆకట్టుకోవడానికి అన్ని రకాల సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆఫర్లతో పాటు నూతన ఆలోచనలతో ముందుకు వస్తున్నాయి.ఇ దే క్రమంలో కశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో ఓ హోటల్ వినూత్న ఆలోచన చేసింది. ఏకంగా దేశంలోని తొలి ఇగ్లూ హోటల్‌ను రూపొందించింది. గుర్మార్గ్‌లోని కొలాహోయ్​ స్కీ రిసార్ట్​లో ఈ మంచు కేఫ్‌ను నిర్మించారు. చదవండి: అరుదైన మంచు గుడ్లగూబ ఫొటోలు!

ఇగ్లూ ఆకారంలో నిర్మించిన ఈ కేఫ్‌ పూర్తిగా మంచుతోనే నిర్మితమైంది. గోడల దగ్గరి నుంచి టేబుళ్లు, కుర్చీలు అన్నీ మంచుతో తయారు చేసినవే కావడం విశేషం. చల్లటి ఇగ్లూ హోటల్‌లో పర్యాటకులు కూర్చొని వెచ్చని ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ ఇగ్లూ కేఫ్ మొత్తం 15 అడుగుల ఎత్తు.. 26 అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. అక్కడి స్థానిక నిర్మాణాలను స్ఫూర్తిగా తీసుకొని దీంట్లో డిజైన్లు తయారు చేశారు. నాలుగు టేబుల్స్‌తో దాదాపు 16 మంది ఒకేసారి కూర్చునేందుకు వీలుగా ఈ కేఫ్ ఉంది. అక్కడికి వెళ్లిన టూరిస్టులు కేఫ్ ‌ముందు దీగిన ఫోటోలను తమ సోషల్‌ మీడియా అకౌంట్‌లో పోస్టు చేస్తున్నారు. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కొత్త ఆలోచన కావడంతో ప్రజలు అధికసంఖ్యలో ఇగ్లూ కేఫ్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపే వారి సంఖ్య పెరుగుతోంది. చదవండి: పర్యాటకం పట్టాలెక్కేనా?



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement