
రోబోలను పలు రంగాల్లో తీసుకొచ్చి పనిచేయించడాన్ని చూశాం. వాటిని మాల్స్, ఆస్పత్రి, పోలీస్, తదితర శాఖల్లో ప్రవేశ పెట్టి చూపించారు. అలాగే ఇటీవల బెంగుళూరు, నోయిడా, చెన్నె కోయింబత్తూర్ రోబోట్ నేఫథ్య రెస్టారెంట్‌లను ప్రారంభించి కస్టమర్లను ఆకర్షించింది. పైగా ఇవి అత్యంత ప్రజాధరణ పొందాయి కూడా. ఇప్పుడూ ఏకంగా స్ట్రీట్ కేఫ్ సెంటర్‌ల్లోకి కూడా ఆ సాంకేతికత వచ్చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
ఆ వీడియోలో అహ్మదాబాద్‌లోని స్ట్రీట్ కేఫ్ పాప్ అప్ ట్రక్ వినియోగదారులకు రోబోట్ వెయిటర్ ఐస్ గోలాను సర్వ్ చేస్తూ కనిపిస్తుంది. ఇది వినియోగదారులకు రుచిగల ఐస్ గోలాలను చక్కగా సర్వ్ చేస్తుంది. ఈ రోబో పేరు ఐషా, ధర రూ. 1,35,000/-. అందుకు సంబంధించిన వీడియోని ఫుడ్ బ్లాగర్ కార్తీక్ మహేశ్వరి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
ఈ సాంకేతిక ఆవిష్కరణను చూసి నెటిజన్లు వాహ్! అంటూ ప్రశంసిస్తూ పోస్టలు పెట్టారు. కాగా, నిజం చెప్పాలంటే ఈ రోబోటిక్ సాంకేతికతపై మహమ్మారి సమయంలో చైనా ఎక్కువగా ఆధారపడింది. అఖరికి భద్రతా ప్రోటోకాల్‌లను నిర్వహించడానికి కూడా రోబోట్‌లతోనే మోహరించింది.
(చదవండి: ఆస్కార్ వేడుకల్లో హైలెట్‌గా మెస్సీ డాగ్! ఏం చేసిందంటే..!)
Comments
Please login to add a commentAdd a comment