సియోల్: పరీక్ష సరిగా రాయలేదని, ప్రేమ విఫలమైందని, ఆర్థిక సమస్యలతో ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు తీసుకుంటున్న జనం వార్తలను మనం చూశాం. కానీ మరమనిషి సైతం ఆత్మహత్య చేసుకుంటాడన్న వార్త వింటానికి కొత్తగా ఉన్నా ఇది నిజంగా జరిగిందని దక్షిణకొరియా వార్తాసంస్థలు కోడై కూస్తున్నాయి. రోబో సేవలను విపరీతంగా వాడే దక్షిణ కొరియాలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. డాక్యుమెంట్ల డెలివరీ వంటి పనుల్లో తెగ బిజీగా ఉండే ఓ రోబో సూసైడ్ చేసుకుందన్న వార్త సంచలనం సృష్టించింది. పని ఒత్తిడి వల్లే రోబోట్ ఆత్మహత్య చేసుకుందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
చక్కర్లు కొట్టి.. మెట్లపై పడి
గత గురువారం సాయంత్రం గుమీ నగర సిటీ కౌన్సిల్ భవనంలో ఈ రోబో ‘సూపర్‌వైజర్’ బాధ్యతల్లో ఉండగా ఉన్నట్టుండి ఆగిపోయి గుండ్రంగా తిరిగి మెట్లపై నుంచి పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం ఏకబిగిన పని చేయాల్సి రావడంతో విపరీత పని ఒత్తిడితోనే అది ఇలా చనిపోయిందని వార్తలొచ్చాయి. అమెరికాకు చెందిన బేర్‌రోబోటిక్స్ సంస్థ ఈ రోబోను తయారు చేసిచి్చంది. గత ఆగస్ట్ నుంచి అది చురుగ్గా పనిచేస్తోందట. ఈ రోబోకు సొంతంగా పౌరసేవల గుర్తింపు కార్డుంది!
అంటే ఒకే ఫ్లోర్‌లోకాకుండా లిఫ్ట్‌లో తిరుగుతూ వేర్వేరు అంతస్తుల్లో పనులు చక్కబెట్టగలదు. ఇలాంటి రోబోట్ పొరపాటున మెట్ల పై నుంచి పడిందా? లేదంటే సాంకేతిక లోపమా? లేదంటే మరేదైనా సమస్యా? అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. రోబో శకలాలను స్వా«దీనంచేసుకుని ల్యాబ్‌కు పంపించారు. అనూహ్య ఘటన తర్వాత ఈ బిల్డింగ్‌లో మరో రోబోను పనిలో పెట్టుకోబోమని గుమీ సిటీ కౌన్సిల్ చెప్పింది. అయితే ద.కొరియాలో రోబోట్ సేవలు అత్యధికం. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ గణాంకాల ప్రకారం ద.కొరియాలో ప్రతి పది మంది ఉద్యోగులకు ఒక పారిశ్రామిక అవసరాల రోబోట్‌ను వినియోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment