రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్-రాధిక మర్చంట్ రెండొవ ప్రీ వెడ్డింగ వేడు క్రూయిజ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అందులోనూ అంబానీల ఇంట జరిగే ఆఖరి పెళ్లి కావడంతో మరింత గ్రాండ్‌గా కన్నుల పండుగగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఈ రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకులు దక్షిణ ఫ్రాన్స్‌లో ఉన్న విల్లాలో దేశ విదేశాలకు చెందిన 800 మంది ముఖ్య అతిథులతో ఇటలీ నుంచి ఫ్రాన్స్‌కు వెళ్లే మార్గంలో విలాసవంతమైన క్రూయిజ్‌లో రెండో ప్రీ-వెడ్డింగ్ జరిగింది.
శనివారం (జూన్ 1, 2024న) ఇటలీలోని సుందరమైన పోర్టోఫినో నగరంతో ముగుసింది. అయితే ఈ వేడుకకు విచ్చేసిన అతిరథ మహారథులకు రామేశ్వరం కేఫ్ విందు అందిచిందట. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రాంలో వెల్లడించి రామేశ్వరం కేఫ్. సెలబ్రిటీ అసెంట్ క్రూయిజ్‌లో బెస్ట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్‌లో పాల్గొన్నందకు సంతోషంగా ఉందని రామేశ్వరం రెస్టారెంట్ పేర్కొంది. అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ వేడుకల్లో సౌత్ ఇండియన్ వంటకాలను అందించే ఏకైక సంస్థ తామేనని కేఫ్ సగర్వంగా పేర్కొంది.
సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది స్వయంగా రామేశ్వరం కేఫ్ కోఫౌండర్ రాఘవేంద్రరావు. అంతేగాదు ప్రపంచంలోని అత్యుత్తమ వివాహ వేడుకలో తాము భాగమయినందుకు ఎంతగానో సంతోషిస్తున్నామని తెలిపారు. కాగా ఈ ఏడాది జామ్నర్లో జరిగిన మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కూడా రామేశ్వరం కేఫ్ భాగమయ్యింది. ఇటీవలే జరిగిన రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కూడా రామేశ్వరమే విందు అందించడం విశేషం. కాగా, ఈ వేడుకల్లో సుమారు 800 మందికి ఆతిథ్యం ఇచ్చింది అంబానీ కుటుంబం. ఈ విందులో జపాన్, మెక్సికోతో సహ వివిధ వంటకాలతో కూడిన అంతర్జాతీయ మెనూని అందించారు. దీంతోపాటు ఈ వేడుకలో ఇంటి రుచిని అందించే వంటకాలను కూడా జోడించడం విశేషం.
(చదవండి: ఈ గ్రామం చాలా స్పెషల్!..కిచెన్ ఒక దేశంలో ఉంటే..బెడ్రూం ఏకంగా..)
Comments
Please login to add a commentAdd a comment