ఘుమఘుమలాడే బిర్యాని సువాసనతో, మైమరిపించే మసాలా ఛాయ్ ఆరోమాతో బ్రిటన్ వాసులను కట్టి పడేస్తున్న ఛాయ్ అదా(Chai Ada) సంచలనం నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌లో క్రిప్టోకరెన్సీ పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేసే తొలి కేఫ్‌గా నిలుస్తోంది ఛాయ్ అదా..!
క్రిప్టోకు అనుకూలంగా..!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకి భారీ ఆదరణ నెలకొంది. పలు కంపెనీలు కూడా క్రిప్టో కరెన్సీలను యాక్సెప్ట్ చేస్తామని ప్రకటించాయి. ప్రపంచ కుబేరుడైన ఎలన్ మస్క్ కూడా క్రిప్టోపై సానూకూలంగా ఉన్నాడు. క్రిప్టో కరెన్సీను ఉపయోగించి టెస్లా కార్లను కొనుగోలు చేయవచ్చునని కూడా వెల్లడించాడు. క్రిప్టోపై ఉన్న ఆదరణను మరిన్నీ కంపెనీలు క్యాష్ చేసుకునేందుకు సిద్దమయ్యాయి.
బ్రిటన్‌లో చాయ్ అదాను స్థాపించిన 26 మెకానికల్ ఇంజనీర్ తయ్యబ్ షఫీక్ క్రిప్టోను ఉపయోగించి కేఫ్‌లో చెల్లింపులను జరపవచ్చునని వెల్లడించాడు. క్రిప్టో పేమెంట్స్ కోసం సపరేటుగా ఒక యాప్‌నే క్రియేట్ చేశాడు. ఈ యాప్ సహాయంతో రిపుల్, లిట్‌కాయిన్, డోజీ కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలతో ఛాయ్ అదాలో చెల్లింపులను జరపవచ్చునని తయ్యబ్ షఫీక్ పేర్కొన్నాడు.
ఛాయ్ అదాలో మెటావర్స్‌తో అతిథ్యం..!
క్రిప్టోతో సమానంగా ఎన్‌ఎఫ్‌టీపై కూడా ప్రజలు ఎక్కువ ఆదరణ చూపుతున్నారని చాయ్ అదా కేఫ్ ఆపరేషన్స్ మేనేజర్ రానా నొక్కిచెప్పారు. క్రిప్టో లావాదేవీలనే కాకుండా మెటావర్స్‌లో కేఫ్ అతిథ్యమిచ్చేలా ప్లాన్స్‌ను కూడా చేస్తున్నట్లు తెలిపారు. 26 ఏళ్ల మెకానికల్ ఇంజనీర్ తయ్యబ్ షఫీక్ బ్రిటన్‌లో చాయ్ అదా పేరుతో కేఫ్‌ను ప్రారంభించాడు. మసాల ఛాయ్, వడ పావ్, బిర్యాని, కాశ్మీరి పింక్ టీ వంటి ఐటమ్స్‌తో బ్రిటన్ వాసులకు మంచి అతిథ్యాన్ని ఇస్తోంది ఛాయ్ అదా.
చదవండి: అమితాబ్ బచ్చన్ టీమ్ వచ్చేది అప్పుడే.. సిద్ధంగా ఉండండి
Comments
Please login to add a commentAdd a comment