లక్షల్లో ఉద్యోగం వదిలేశాడు.. 200కెఫెలు.. రూ. 100 కోట్ల టర్నోవర్‌! | Success Story of Nitin Saluja IIT Graduate Chaayos Founder - Sakshi
Sakshi News home page

లక్షల్లో ఉద్యోగం వదిలేశాడు.. 200కెఫెలు.. రూ. 100 కోట్ల టర్నోవర్‌!

Published Sun, Aug 27 2023 8:18 AM | Last Updated on Sun, Aug 27 2023 11:09 AM

Success Story of Nitin Saluja IIT Graduate Chaayos Founder - Sakshi

నితిన్ సలూజా.. టీ కేఫ్ చైన్ ‘చాయోస్’ వ్యవస్థాపకుడు. నితిన్‌ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పూర్వ విద్యార్థి. చదువు పూర్తయ్యాక అమెరికా చేరుకున్నాడు. ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగిగా చేరాడు. లక్షల్లో ప్యాకేజీ అందుకున్నాడు. అయినా నితిన్‌ సంతృప్తి చెందలేదు. సొంతంగా ఏదైనా చేయాలని భావించి, ఇండియా వచ్చాడు. నితిన్ తన ఆలోచనలను అమలు చేసే పనిలో పడ్డాడు. అనతికాలంలోనే అతని కంపెనీ కోట్లకు పడగలెత్తింది. నితిన్ సలూజా ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

గట్టి పట్టుదల, సంకల్పబలంతో..
నితిన్‌ తన స్టార్టప్ బిజినెస్‌లో మొదట్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. గట్టి పట్టుదల, సంకల్పబలంతో తన సంస్థను విజయ శిఖరాలకు తీసుకెళ్లాడు. స్టార్‌బక్స్, కేఫ్ కాఫీ డే, కేఫ్ మోచా, బరిస్టా లాంటి కాఫీ షాపుల ఆధిపత్యం ఉన్న మనదేశంలో ‘కెయోస్’ తనకంటూ ఒక పేరు తెచ్చుకునేలా నితిన్‌ నిరంతర కృషి చేశాడు. ఇది భారతదేశంలోని ప్రముఖ టీ కేఫ్ కంపెనీగా అవతరించింది. నితిన్ సలుజా స్థాపించిన ‘కెయోస్’ అనతికాలంలోనే రూ. 100 కోట్ల టర్నోవర్‌ కలిగిన కంపెనీగా నిలిచింది.

ఉద్యోగం వదిలేసి ఇండియాకు..  
నితిన్ సలూజా ఐఐటీ బాంబేలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. చదువు పూర్తయ్యాక ఆయన ఒక అమెరికన్ కంపెనీకి కార్పొరేట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. అమెరికా కంపెనీలో నితిన్ జీతం లక్షల్లో ఉండేది. నితిన్, అతని భార్యకు అమెరికాలో టీ అమ్మే వారెవరూ కనిపించలేదు. దీంతో నితిన్ కేఫ్‌ను తెరవాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగం వదిలేసి ఇండియా వచ్చాడు. సొంతంగా టీ వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనతో పని చేయడం మొదలుపెట్టాడు.

గురుగ్రామ్‌లో మొదటి కేఫ్‌
భారతదేశంలో కాఫీ అందించే అనేక కేఫ్‌లు ఉన్నాయని, అయితే అవి టీ అందించడం లేదని అతను భావించాడు. భారతదేశంలో టీ తాగే ప్రత్యేక సంస్కృతి ఉంది. ప్రజలు అనేక రకాల టీలను ఆస్వాదిస్తుంటారు. దీనిని ఆధారంగా చేసుకున్న నితిన్ భారతదేశంలోని టీ తాగేవారి అవసరాలను తీర్చగల టీ కేఫ్‌ను ప్రారంభించాలని అనుకున్నాడు. 2012లో నితిన్, అతని స్నేహితుడు రాఘవ్ సంయుక్తంగా ‘చాయోస్‌’ని స్థాపించారు.  వారు గురుగ్రామ్‌లో మొదటి కేఫ్‌ని ఏర్పాటు చేశారు. కస్టమర్లకు 'మేరీ వాలీ చాయ్' అందించడం ప్రారంభించారు. నితిన్ మొదట్లో తానే స్వయంగా ఆర్డర్లు తీసుకుని, టీ తయారుచేసి అందించేవాడు.

200కు మించిన ‘చాయోస్’ కేఫ్‌లు
కోవిడ్ సమయంలో ‘చాయోస్’ అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. 2020లో తిరిగి ట్రాక్‌లో పడింది. నితిన్ కష్టానికి సరైన ఫలితం దక్కింది. 2020లో కంపెనీ 100 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ముంబై, బెంగళూరు, చండీగఢ్, పూణేలలో నితిన్‌ చాయోస్ స్టోర్లు నెలకొల్పారు. నేడు భారతదేశం అంతటా 200కు మించిన చాయోస్ కేఫ్‌లు ఉన్నాయి. చాయోస్ మన దేశంలో ప్రీమియం టీని అందించే కేఫ్. ఇది భారతీయులు తాము కోరుకునే అన్ని రుచుల టీలను అందిస్తుంది. 
ఇది కూడా చదవండి: అంతరిక్షంలోకి వెళితే వయసు పెరగదా? ‘నాసా’ పరిశోధనలో ఏమి తేలింది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement