పబ్జీ ఆడుతూ సచిన్ ప్రేమలో పడిన సీమా ఎప్పుడైతే పాక్ నుంచి భారత్ వచ్చేసిందో అప్పటి నుంచి ఈ ఉదంతం దావానలంలా పాకుతోంది. సోషల్ మీడియాలో వీరి ప్రేమ వైరల్ అవుతోంది. నేషనల్ మీడియాలోనూ ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు మనం సీమా, సచిన్‌ల లవ్ స్టోరీని తలపించే ఇక్రా, ములాయంల ప్రేమ కథ గురించి తెలుసుకుందాం.
లూడోతో మొదలైన్ లవ్ స్టోరీ!
సీమా హైదర్ మాదిరిగానే ఇక్రా కూడా ఆన్‌లైన్ గేమింగ్ మాధ్యమంలో ములాయం సింగ్‌ను ప్రేమించింది. అయితే వీరి ప్రేమ పబ్జీతో కాకుండా లూడోతో మొదలయ్యింది. ఇక్రా పాకిస్తాన్‌లో ఉంటుంది. ఆన్‌లైన్‌లో లూడో ఆడే నేపధ్యంలో ఆమెకు ములాయంతో పరిచయం అయ్యింది. 19 ఏళ్ల ఇక్రా.. ములాయం ప్రేమలో పడి, పాకిస్తాన్ నుంచి భారత్ వచ్చేసింది.
స్కూలు నుంచి నేరుగా..
2022 సెప్టెంబరు 19న ఇక్రా స్కూలుకు వెళ్లింది. అయితే ఇంటికి తిరిగిరాలేదు. ఇంటిలో నుంచి, స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకుని దుబాయ్ వెళ్లిపోయింది. అక్కడి నుంచి నేపాల్ చేరుకుంది. ఇదేవిధంగా ములాయం కూడా నేపాల్ చేరుకున్నాడు. అక్కడ వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అక్కడి నుంచి భారత్‌లోని బెంగళూరు చేరుకుని, కలసి కాపురం చేయడం మొదలుపెట్టారు.
పోలీసుల రంగప్రవేశంతో..
కొంతకాలం ఈ విషయం ఇక్రా, ములాయం కుటుంబాలకు తెలియలేదు. అయితే ఒక రోజు ఇక్రా నమాజ్ చేస్తుండగా పొరుగునున్నవారు దీనిని గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్రా ఇరుగుపొరుగువారితో తన పేరు రవాసింగ్ అని చెప్పింది. అందుకే వారికి ఆమె నమాజ్ చేయడంతో అనుమానం తలెత్తింది. పోలీసుల రంగప్రవేశంతో ఇక్రా, ములాయంల ప్రేమకథ బహిర్గతమయ్యింది. దీంతో పోలీసులు వీరిద్దరినీ అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో విచారణ కొనసాగింది. కొద్దిరోజుల తరువాత ఇక్రాను పాకిస్తాన్ పంపించారు. ములాయం సింగ్‌పై కేసు కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: ప్రియుడిని పిలిచి.. గ్రామానికి కరెంట్ తీసేసి..
Iqra And Mulayam Singh Love Story: సీమా, సచిన్‌ల స్టోరీని తలపించే ఇక్రా, ములాయం లవ్ స్టోరీ.. చివరికి?
Published Mon, Jul 24 2023 7:28 AM | Last Updated on Mon, Jul 24 2023 8:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment