రెస్టారెంట్‌లో కస్టమర్‌లను ఆకట్టుకునేలా రెస్టారెంట్స్‌ని రకరకాలుగా అలంకరిస్తారు. అంతేకాదు కస్టమర్‌లకు కావల్సిన అన్నిరకాల సదుపాయాలను అందించేందకు విశేషంగా ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో ఒక రెస్టారెంట్ ఏకంగా ఎక్వేరియంలా చేసి కస్టమర్‌లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది.
(చదవండి: ఒకప్పుడు అది నరకం..ఇప్పుడు నందనవనం!)
అసలు విషయం ఏమిటంటే....ఒక రెస్టారెంట్ సరికొత్త ఆలోచనతో కస్టమర్‌లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా రెస్టారెంట్‌ని మోకాలు లోతు వరకు నీటితో నింపి అందులో రకరకాల చేపలను ఉంచుతుంది. అందలోనే టేబుల్స్ వేసి కస్టమర్‌లను కూర్చోమంటూ ఆహ్వానిస్తుంది. అక్కడ అలా నీళ్లలోని రకరకాల రంగురంగుల చేపలను చూస్తూ అక్కడ వాళ్లు అందించే ఆహార పదార్థాలను ఆస్వాదిస్తూ తినేలా తయారుచేసింది. పైగా ఆ రెస్టారెంట్ గోడపై "స్వీట్ ఫిష్ కేఫ్" అని బోర్డ్ కూడా ఉంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పైగా లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి చూడండి.
(చదవండి: యాహూ! నేను పగలుగొట్టేశాను)
Comments
Please login to add a commentAdd a comment