డీజిల్‌తో పరాటా చేయడమా? చివరికి యజమాని.. | Parathas Being Made In Diesel At Chandigarh Restaurant Video Goes Viral, Know What Owner Said About This | Sakshi
Sakshi News home page

Diesel Paratha Viral Video: డీజిల్‌తో పరాటా చేయడమా? చివరికి యజమాని..

Published Wed, May 15 2024 4:01 PM | Last Updated on Wed, May 15 2024 6:09 PM

Parathas Being Made In Diesel At Chandigarh Restaurant

ఇటీవల కొందరూ సోషల్‌ మీడియా స్టార్‌డమ్‌ కోసం పిచ్చిపనులు మతిపోయేలా ఉంటాయి. అస్సలు అర్థంపర్థం లేని విధంగా రోతగా ఏవేవో రీల్స్‌ చేసేస్తుంటారు. చూశావాడి కర్మలే అనో లేక ఇలా చేస్తే వ్యూస్‌ పెరుగతాయన్న భావమో గానీ ఇలాంటి వాటి వల్ల కొందరూ ప్రాణాలు పోగొట్టుకుంటే మరికొందరూ నెగిటివిటీని తెచ్చుకుని చివరికి వివరణ ఇచ్చుకునే పరిస్థితి తెచ్చుకుంటారు. అలాంటి ఘటనే చండీగఢ్‌లో ఒకటి చోటు చేసుకుంది. 

చండీగఢ్‌లో ఓ ఆహార విక్రేత డీజిల్‌తో చేసిన పరాఠాలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో పెద్ద దూమరం రేపింది. ఒక్కసారిగా నెటిజన్లు దీనిపై భారత ఫుడ్‌ కార్పొరేషన్‌ తనిఖీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బకు సదరు ఫుడ్‌ యజమాని చన్నీ సింగ్‌ దిగొచ్చి తాము డీజిల్‌ పరాటా వంటవి చేయమని వివరణ ఇచ్చారు. అలాగే వీడియోలో చెప్పినట్లుగా కస్టమర్లకు అలాంటి పరాటాలను అందించమని తెలిపారు.

 కేవలం వినోదం కోసం సరదాగా చేసిన రీల్‌ అని చెప్పుకొచ్చారు. మా కంటెంట్‌ మిమ్మల్ని ఎంతగానో బాధించిందనందుకు తనని క్షమించండని వేడుకున్నాడు. అలాగే తాము ఈ ఆలు పరాటాలను శుద్దమైన నెయ్యి, నూనెలతోనే తయారు చేస్తామని చెప్పారు. అలాగే ఆ వీడియోని తీసిన అమన్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా ఇన్‌స్టామ్‌ వేదికగా  క్షమాపణ తెలిపాడు. 

ఈ మేరకు సదరు వ్యక్తులు ఇన్‌స్టామ్‌లో.. చండీగఢ్‌ పరిపాలనా యంత్రాంగానికి, యావత్తు భారతదేశ ప్రజలకు నా హృదయపూర్వక క్షమాపణలు. తాము తీసిని వీడియో కంటెంట్‌ మిమ్మల్ని ఎంతో భాదించదనందుకు చింతిస్తున్నాం అని అందుకు మమల్ని క్షమించండని వేడుకున్నారు. సరదా కోసి ఇలా ఏదిపడితే అది చేస్తే జనాలు ఊరుకోరు. స్టార్‌ డమ్‌, వ్యూస్‌ మాట పక్కన ఉంచితే ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించారని ఎవరైనా కేసు పెడితే ఊచలు లెక్కించా ల్సిందే. సరదా అనేది అందరికీ సంతోషమే తెప్పించాలి గానీ ఆగ్రహం తెప్పించేలా ఉండకూడదు.

(చదవండి: నాన్‌స్టిక్‌ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement