Paratha Fest
-
డీజిల్‌తో పరాటా చేయడమా? చివరికి యజమాని..
ఇటీవల కొందరూ సోషల్ మీడియా స్టార్డమ్ కోసం పిచ్చిపనులు మతిపోయేలా ఉంటాయి. అస్సలు అర్థంపర్థం లేని విధంగా రోతగా ఏవేవో రీల్స్ చేసేస్తుంటారు. చూశావాడి కర్మలే అనో లేక ఇలా చేస్తే వ్యూస్ పెరుగతాయన్న భావమో గానీ ఇలాంటి వాటి వల్ల కొందరూ ప్రాణాలు పోగొట్టుకుంటే మరికొందరూ నెగిటివిటీని తెచ్చుకుని చివరికి వివరణ ఇచ్చుకునే పరిస్థితి తెచ్చుకుంటారు. అలాంటి ఘటనే చండీగఢ్‌లో ఒకటి చోటు చేసుకుంది. చండీగఢ్‌లో ఓ ఆహార విక్రేత డీజిల్‌తో చేసిన పరాఠాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద దూమరం రేపింది. ఒక్కసారిగా నెటిజన్లు దీనిపై భారత ఫుడ్ కార్పొరేషన్ తనిఖీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బకు సదరు ఫుడ్ యజమాని చన్నీ సింగ్ దిగొచ్చి తాము డీజిల్ పరాటా వంటవి చేయమని వివరణ ఇచ్చారు. అలాగే వీడియోలో చెప్పినట్లుగా కస్టమర్లకు అలాంటి పరాటాలను అందించమని తెలిపారు.True recipe for cancer (petrol diesel wala paratha)Where r we heading? 🤦#AlluArjun #Pithapuram #MondayVibes #MorningVibes #MadhaviLatha #ViralVideo #ElectionDay pic.twitter.com/GyxC1xhQeb— K.P.Brinda Reddy (@kpbrindareddy) May 13, 2024 కేవలం వినోదం కోసం సరదాగా చేసిన రీల్ అని చెప్పుకొచ్చారు. మా కంటెంట్ మిమ్మల్ని ఎంతగానో బాధించిందనందుకు తనని క్షమించండని వేడుకున్నాడు. అలాగే తాము ఈ ఆలు పరాటాలను శుద్దమైన నెయ్యి, నూనెలతోనే తయారు చేస్తామని చెప్పారు. అలాగే ఆ వీడియోని తీసిన అమన్ ప్రీత్ సింగ్ కూడా ఇన్స్టామ్ వేదికగా క్షమాపణ తెలిపాడు. View this post on Instagram A post shared by Amanpreet Singh (@oyefoodiesinghఈ మేరకు సదరు వ్యక్తులు ఇన్‌స్టామ్‌లో.. చండీగఢ్ పరిపాలనా యంత్రాంగానికి, యావత్తు భారతదేశ ప్రజలకు నా హృదయపూర్వక క్షమాపణలు. తాము తీసిని వీడియో కంటెంట్ మిమ్మల్ని ఎంతో భాదించదనందుకు చింతిస్తున్నాం అని అందుకు మమల్ని క్షమించండని వేడుకున్నారు. సరదా కోసి ఇలా ఏదిపడితే అది చేస్తే జనాలు ఊరుకోరు. స్టార్ డమ్, వ్యూస్ మాట పక్కన ఉంచితే ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించారని ఎవరైనా కేసు పెడితే ఊచలు లెక్కించా ల్సిందే. సరదా అనేది అందరికీ సంతోషమే తెప్పించాలి గానీ ఆగ్రహం తెప్పించేలా ఉండకూడదు.(చదవండి: నాన్‌స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!) -
సగ్గు బియ్యం పరాఠా.. ఈజీగా చేసేస్తారా!
వానలు పడుతుంటే వేడివేడిగా కరకరలాడే పదార్థాలు తినాలనిపిస్తుంది జిహ్వకు.. ఎప్పుడూ నూనెలో వేయించి తినాలంటే కొంచెం ఇబ్బందే.. తక్కువ నూనెతో కరకరలాడే సగ్గు బియ్యం వంటకాలు చేసుకుని... వాన బిందువులను చూస్తూ, తియ్యటి గుండ్రటి సగ్గు బియ్యం బిందువుల వంటకాలు ఆస్వాదిద్దాం.. పరాఠా కావలసినవి: సగ్గు బియ్యం – ఒక కప్పు; పల్లీలు – అర కప్పు; నీళ్లు – ఒక కప్పు; పచ్చి మిర్చి – 2; వెల్లుల్లి రెబ్బలు – 4; ఉడికించిన బంగాళ దుంపలు – 2; కొత్తిమీర – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 2; ఉప్పు – తగినంత; నూనె/నెయ్యి – తగినంత తయారీ: ►ఒక పాత్రలో సగ్గు బియ్యం వేసి రెండుమూడు సార్లు బాగా కడిగి, నీరు వంపేయాలి ►స్టౌ మీద బాణలిలో పల్లీలు వేసి బాగా వేయించి చల్లార్చాలి ►మిక్సీ జార్లో పల్లీలు, పచ్చి మిర్చి, వెల్లుల్లి వేసి బరకగా మిక్సీ పట్టి, సగ్గు బియ్యానికి జత చేయాలి ►ఉడికించిన బంగాళ దుంపలను తురుముతూ జత చేయాలి ►కొత్తిమీర, జీలకర్ర, ఎండు మిర్చి లేదా మిరప కారం, ఉప్పు జత చేసి బాగా కలపాలి ►పాలిథిన్ కవర్ మీద కానీ, బటర్ పేపర్ మీద కానీ కొద్దిగా నూనె పూయాలి ►తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని, గుండ్రంగా రొట్టెలా ఒత్తాలి ►స్టౌ మీద పెనం వేడయ్యాక కొద్దిగా నూనె వేసి తయారుచేసి ఉంచుకున్న పరాఠాను వేసి నాలుగు నిమిషాల పాటు మీడియం మంట మీద కాలాక, రెండో వైపు తిప్పి, అటు వైపు కూడా మూడు నాలుగు నిమిషాలు కాల్చాక, ప్లేట్లోకి తీసుకోవాలి ►పెరుగు చట్నీతో తింటే రుచిగా ఉంటాయి. ఢోక్లా కావలసినవి: సగ్గు బియ్యం – ఒక కప్పు (నానబెట్టాలి); సామలు – ఒక కప్పు; పెరుగు – ఒక కప్పు; నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – 2 రెమ్మలు; మసాలా కారం – ఒక టీ స్పూను; (మిరప కారం, జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాల పొడి కలిపితే మసాలా కారం) తయారీ: ► మిక్సీలో సగ్గు బియ్యం, సామలు, పెరుగు వేసి మెత్తగా చేయాలి ► ఉప్పు జత చేసి దోసెల పిండిలా అయ్యేలా కలపాలి ► స్టౌ మీద కుకర్‌లో నీళ్లు పోసి మరిగించాలి ► ఈ లోగా ఒక స్టీల్ ప్లేట్‌కి నూనె పూసి, మసాలా కారం చిలకరించాలి ► తయారు చేసి ఉంచుకున్న పిండిని సగం వేసి సమానంగా పరిచి, మరుగుతున్న నీళ్ల మీద ఒక ప్లేట్ ఉంచి, ఆ పైన ఈ ప్లేట్ ఉంచి, పైన పల్చటి వస్త్రం కప్పి, ఆ పైన మూత ఉంచాలి ► 20 నిమిషాల తరవాత మంట ఆపి, మూత తీయాలి ∙ఇదే విధంగా మిగతా సగ భాగం కూడా తయారు చేయాలి ► బాగా చల్లారాక ఒక ప్లేట్ లోకి ఆ ప్లేట్‌ను బోర్లించి జాగ్రత్తగా వేరు చేసి, ఆ పైన గ్రీన్ చట్నీ వేసి, ఆ పైన రెండో పొర ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో రెండు స్పూన్ల నూనె వేసి కాగాక, ఆవాలు, పచ్చి మిర్చి తరుగు, ఇంగువ వేసి వేయించి దింపేయాలి ►కరివేపాకు జత చేసి, బాగా కలిపి, ఢోక్లా మీద సమానంగా పోసి, నలు చదరంగా కట్ చేయాలి. (గ్రీన్ చట్నీ: మిక్సీలో పుదీనా, కొత్తిమీర, పచ్చి మిర్చి, ఉప్పు, నల్ల ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా చేసి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►నిమ్మ రసం జత చేసి బాగా కలిపితే గ్రీన్ చట్నీ సిద్ధమవుతుంది) పొంగనాలు కావలసినవి: సగ్గు బియ్యం–ఒక కప్పు; ఉడికించిన బంగాళ దుంపలు – 2; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – తగినంత తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా సగ్గు బియ్యాన్ని రెండు నిమిషాలు ఆపకుండా కలుపుతూ వేయించాలి (తడి పోయి పొడి చేయడానికి వీలుగా ఉంటుంది) ∙ప్లేట్లో పోసి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ►ఒక పాత్రలో సగ్గు బియ్యం పిండికి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, దోసెల పిండి కంటె కొద్దిగా గట్టిగా కలపాలి ►ఒక పాత్రలో బంగాళదుంపలు వేసి మెత్తగా చేయాలి ►సగ్గు బియ్యం పిండి జత చేసి కలపాలి ►కొత్తిమీర తరుగు, పచ్చి మిర్చి తరుగు జత చేసి మరోమారు కలపాలి ►అల్లం తురుము, జీలకర్ర, ఉప్పు జత చేసి మరోమారు బాగా కలపాలి ►కొద్దిగా నీళ్లు జత చేసి దోసెల పిండిలా అయ్యేలా కలిపి మూత ఉంచి, సుమారు అర గంట సేపు నానబెట్టాలి ►స్టౌ మీద పొంగనాల స్టాండ్ ఉంచి, నూనె పూసి, ఒక్కో గుంటలోను తగినంత పిండి వేసి, మూత ఉంచాలి ►మీడియం మంట మీద సుమారు పది నిమిషాలు ఉంచాక, పొంగనాలను తిరగేసి, మరో ఐదు నిమిషాలు ఉంచి తీసేయాలి. -
ఇవే పిల్లలకు బలం: యునిసెఫ్
న్యూఢిల్లీ: పిల్లల్లో స్థూలకాయం, రక్తహీనత తదితర అనారోగ్య సమస్యలను నివారించేందుకు తీసుకోదగిన చౌకైన పౌషకాహారం గురించి ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల నిధి (యునిసెఫ్) తన బుక్‌లెట్‌లో పేర్కొంది. ఊతప్పం నుంచి మొలకెత్తిన గింజలతో చేసిన పరోఠాల దాకా రకరకాల పౌష్టికాహారాన్ని తన బుక్‌లెట్‌లో సూచించింది. యునిసెఫ్ సర్వే ప్రకారం అయిదేళ్ల వయస్సులోపు పిల్లల్లో 35 శాతం మంది ఎదుగుదల లోపంతో, యుక్తవయస్సులోని బాలికల్లో 40 శాతం మంది, బాలల్లో 18 శాతం రక్తహీనత సమస్య ఉంటోందని వెల్లడైంది. పిల్లల్లో తక్కువ బరువు సమస్యను అధిగమించేందుకు ఆలూ పరాఠా, పనీర్ కఠి రోల్, సగ్గుబియ్యం కట్లెట్ వంటివి.. స్థూలకాయ సమస్య నివారణకు మొలకెత్తిన పప్పుగింజలతో పరాఠాలు, పోహా, ఉప్మా మొదలైన ఆహారం అందించవచ్చని సూచించింది. -
పరాటా ఫెస్ట్
బైశాఖి స్పెషల్ పరాటా... ఉత్తరభారతంలో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్! పంజాబీలకు అత్యంత ఇష్టమైన వంటకం. ఇందులో ఆలూ, గోబీ, పనీర్, ఆనియన్, మూలీ, ప్లెయిన్... ఇలా అనేక ర కాలు నగరంలోని అన్ని రెస్టారెంట్స్‌లో ఇవి దొరుకుతున్నా... టేస్టీయెస్ట్ పరాటా కావాలంటే మాత్రం దాబాకు వెళ్లాల్సిందే. అయితే దాబాలు అందుబాటులోలేని హైదరాబాదీలకు ఈ పరాటా రుచులనందిస్తోంది తాజ్దక్కన్. పంటలు చేతికొచ్చే ఈ సమయంలోనే పంజాబీలు నూతన సంవత్సర వేడుకగా ‘బైసాకి’ని ఏప్రిల్ రెండవ వారం చివరిలో జరుపుకొంటారు. ఆ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రకరకాల జొన్నలు, సజ్జలతో కలిపి ఈ పరాటా ఫెస్ట్‌ను... ఈ నెల 19 వరకు కండక్ట్ చేస్తోంది తాజ్. పుట్టగొడుగులు, పనీర్, కొత్తిమీర, ఆలూమేతి, ములక్కాడలు... ఇలా డిఫరెంట్ వెజ్ఐటమ్స్తో చేసిన పరాటాలను స్పెషల్‌గా వడ్డించనుంది. పైనుంచి క్రిస్పీగా కన్పించే ఈ పరాటాలు లోపల చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఓన్లీ వెజ్జా... అని నిరాశపడిపోనక్కర్లేదు. మాంసాహార ప్రియుల కోసం... గుడ్డు, చికెన్, మటన్, బోఠీ, రొయ్యలతో చేసిన పరాటాలు కూడా స్పైసీగా నోరూరించనున్నాయి. పరాటాతోపాటు లస్సీ ఉంటే... ఆ టేస్టే వేరు! అందుకే... దేశీ స్టైల్లో ప్రిపేర్ చేసిన బటర్‌స్కాచ్ లస్సీ, వెనిల్లా లస్సీని ఈ ఫెస్టివల్లో ప్రత్యేకంగా ఆఫర్ చేస్తోంది. ‘సిటీలో ఉన్న నార్త్ఇండియన్స్, ఎస్పెషల్లీ పంజాబీస్, మార్వాడీస్, పరాటా లవర్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ పరాటా ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. కాళీ దాల్, రెడ్ అనియన్స్, గ్రీన్ చిల్లీస్, పికిల్స్, కుకుంబర్ స్లైడ్స్ పరోటాకు మరింత టేస్ట్‌ను ఇస్తాయి. ఇది ఎండాకాలం కావడంతో రాగులు, సజ్జలు, జొన్నలతో చేసే ఈ వంటకాల వల్ల చలువ చేస్తుంది’అని అంటున్నారు ఎగ్జిక్యూటివ్ చెఫ్ సజేష్ నాయర్. - శిరీష చల్లపల్లి