పరాటా ఫెస్ట్ | Paratha Fest | Sakshi
Sakshi News home page

పరాటా ఫెస్ట్

Published Tue, Apr 14 2015 10:03 PM | Last Updated on Sun, Sep 3 2017 12:18 AM

పరాటా ఫెస్ట్

పరాటా ఫెస్ట్

బైశాఖి స్పెషల్
పరాటా... ఉత్తరభారతంలో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్! పంజాబీలకు అత్యంత ఇష్టమైన వంటకం. ఇందులో ఆలూ, గోబీ, పనీర్, ఆనియన్, మూలీ, ప్లెయిన్... ఇలా అనేక ర కాలు నగరంలోని అన్ని రెస్టారెంట్స్‌లో ఇవి దొరుకుతున్నా... టేస్టీయెస్ట్ పరాటా కావాలంటే మాత్రం దాబాకు వెళ్లాల్సిందే. అయితే దాబాలు అందుబాటులోలేని హైదరాబాదీలకు ఈ పరాటా రుచులనందిస్తోంది తాజ్‌దక్కన్. పంటలు చేతికొచ్చే ఈ సమయంలోనే పంజాబీలు నూతన సంవత్సర వేడుకగా ‘బైసాకి’ని ఏప్రిల్ రెండవ వారం చివరిలో జరుపుకొంటారు.

ఆ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రకరకాల జొన్నలు, సజ్జలతో కలిపి ఈ పరాటా ఫెస్ట్‌ను... ఈ నెల 19 వరకు కండక్ట్ చేస్తోంది తాజ్. పుట్టగొడుగులు, పనీర్, కొత్తిమీర, ఆలూమేతి, ములక్కాడలు... ఇలా డిఫరెంట్ వెజ్‌ఐటమ్స్‌తో చేసిన పరాటాలను స్పెషల్‌గా వడ్డించనుంది. పైనుంచి క్రిస్పీగా కన్పించే ఈ పరాటాలు లోపల చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఓన్లీ వెజ్జా... అని నిరాశపడిపోనక్కర్లేదు.

మాంసాహార ప్రియుల కోసం... గుడ్డు, చికెన్, మటన్, బోఠీ, రొయ్యలతో చేసిన పరాటాలు కూడా స్పైసీగా నోరూరించనున్నాయి. పరాటాతోపాటు లస్సీ ఉంటే... ఆ టేస్టే వేరు! అందుకే... దేశీ స్టైల్‌లో ప్రిపేర్ చేసిన బటర్‌స్కాచ్ లస్సీ, వెనిల్లా లస్సీని ఈ ఫెస్టివల్‌లో ప్రత్యేకంగా ఆఫర్ చేస్తోంది. ‘సిటీలో ఉన్న నార్త్‌ఇండియన్స్, ఎస్పెషల్లీ పంజాబీస్, మార్వాడీస్, పరాటా లవర్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ పరాటా ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. కాళీ దాల్, రెడ్ అనియన్స్, గ్రీన్ చిల్లీస్, పికిల్స్, కుకుంబర్ స్లైడ్స్ పరోటాకు మరింత టేస్ట్‌ను ఇస్తాయి. ఇది ఎండాకాలం కావడంతో రాగులు, సజ్జలు, జొన్నలతో చేసే ఈ వంటకాల వల్ల చలువ చేస్తుంది’అని అంటున్నారు ఎగ్జిక్యూటివ్ చెఫ్ సజేష్ నాయర్.
- శిరీష చల్లపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement