‘మిట్టి’ అంటే మట్టి.ఈ మట్టి మీద పుట్టిన అందరికీ ఈ మట్టి మీద ఉన్న అన్ని ఉపాధుల్లో హక్కు ఉంది. కాని దివ్యాంగులకు చాలా చోట్లడోర్లు క్లోజ్ అయి ఉంటాయి.అందుకే 24 ఏళ్ల అలినా ఆలమ్ దివ్యాంగుల కోసమే నడిచే, వారే యజమానులుగా మారే కేప్‌లను‘మిట్టి కేఫ్’ పేరుతో స్థాపించింది.ఇప్పటికి 4000 మంది దివ్యాంగులు ఉపాధి ΄పోందారు.సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జీనే ఈ ప్రయత్నాన్ని మెచ్చుకునిసుప్రింకోర్టుప్రాంగణంలో మిట్టి కేఫ్‌కు చోటు ఇచ్చారు.
అలినా ఆలమ్ తన టీనేజ్‌లో కోల్‌కటాలోని నానమ్మ దగ్గర పెరిగింది. నానమ్మకు వెన్ను సమస్య వచ్చినప్పటి నుంచి ఆమెకు కదలడం, సొంత పనులు చేసుకోవడం చాలా కష్టమవడం గమనించింది. అది అలినా ఆలమ్ మనసులో ముద్ర పడింది. బెంగళూరుకు చదువుకోవడానికి వచ్చాక చదువులు, ర్యాంకులు అన్నీ అవయవాలు సక్రమంగా ఉన్నవారిని అందలం ఎక్కించేలా ఉన్నాయి కాని ఏ ఉ΄ాధి రంగమూ దివ్యాంగులకు మేము పని ఇస్తాం అనడం కనిపించలేదు. దివ్యాంగులు ఆత్మాభిమానంతో జీవించాలంటే వారికి సానుభూతి కంటే ఉపాధి కల్పించడమే చాలా ముఖ్యం అనుకుంది. ‘నేనే దివ్యాంగులకు పని ఇస్తాను’ అని నిశ్చయించుకుంది. ‘నీ దగ్గర ఏముందని వారికి పని ఇస్తావు?’ అని ఫ్రెండ్స్ అడిగారు. ‘సంకల్పం ఉంది’ అని చెప్పింది అలినా.
2017లో మొదటి కేఫ్
దివ్యాంగులకు పని ఇవ్వడమే కాదు... ఆ పని నలుగురి కంటా పడేలా చేయాలి... వారితో నలుగురూ మాట్లాడేలా ఉండాలి... ఈ ప్రయత్నాన్ని చూసి నలుగురూ తమ తమ రంగాల్లో అలాంటి వారికి పని ఇచ్చేలా ఉండాలి అనేది అలినా ఆలోచన. ఇందుకు ‘కేఫ్’ తెరవడం సరైనదనిపించింది. అప్పటికి చదువుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న అలినా ఇలాంటి ప్రయత్నానికి అండగా నిలిచే సేవాసంస్థ దేశ్‌పాండే ఫౌండేషన్‌ను కలిసి ఆలోచన చెప్పింది. నిధులు తీసుకుని ఉత్తర కర్నాటకలోని హుబ్లీలో తొలి ‘మిట్టి కేఫ్’ తెరిచింది. అందుకు ఊరిలో ప్రతి వీధి తిరిగి దివ్యాంగులకు ఉద్యోగం, ఉ΄ాధి అని చెప్పింది. కొందరు సందేహంగా చూశారు. కొందరు అపనమ్మకంతోనే వచ్చారు. నడక వీలుకాని వారు, బధిరులు, అంధులు, మరుగుజ్జులు, గూని బాధితులు... వీరు వచ్చి ఉత్సాహంగా పనిలో జాయిన్ అయ్యారు. మిట్టి కేఫ్‌లో టీ, కాఫీ, శాండ్ విచ్, సాదా సీదా భోజనం దొరికేలా మెనూ తయారు చేసింది అలినా. ఆ మెల్లగా అయినా సరిగ్గా చేయడం నేర్చుకున్నారు. వారికే మొత్తం నిర్వహణ, ఆదాయ పంపకం అప్పజెప్పి మరో మిట్టి కేఫ్ కోసం సాగి΄ోయింది అలినా.
ఆహ్వానించే ప్రయత్నం
ఒక పని సఫలం కావాలంటే సరిగ్గా వివరించే ప్రయత్నం చెయ్యాలి... ఉద్దేశం పరిశుభ్రంగా ఉండాలి. అలినా ఆలోచన, ఆచరణలో చిత్తశుద్ధి ఉన్నాయి. అందుకే కార్పొరెట్ సంస్థలు, ఎయిర్΄ోర్ట్‌ల యాజమాన్యాలు అందరూ ఆమెను ఆహ్వానించారు. బెంగళూరు ఎయిర్΄ోర్ట్, ముంబై ఎయిర్‌పోర్ట్‌లతో ΄ాటు పెద్ద పెద్ద ఆస్పత్రులలో కూడా మిట్టి కేఫ్‌లు ఏర్పాటయ్యాయి.
‘ఇప్పటికి దేశంలో 41 చోట్ల మిట్టి కేఫ్‌లు ఉన్నాయి. ఇవి ఇంకా పెరుగుతాయి. సుప్రీంకోర్టు ప్రాగణంలో కూడా మాకు చోటు దక్కడం గొప్ప విషయం’ అంటుంది అలినా. ఈ కేఫ్‌ల ద్వారా ఇప్పటికి 4000 మంది దివ్యాంగుల ముఖాల్లో చిరునవ్వు వచ్చింది.
ఆత్మాభిమానం తొణికిసలాడింది.
వెతికి, శిక్షణ ఇచ్చి‘కేఫ్ పని అయినా శిక్షణ అవసరం.
అందుకే నేను దేశంలోని కొన్ని ఎన్‌జిఓలను కాంటాక్ట్ చేసి ఆయా ్ర΄ాంతాల్లోని దివ్యాంగులను గుర్తించేలా చేశాను. అంతే కాదు ఇళ్ల నుంచి తరిమేస్తే రోడ్ల మీద భిక్షాటన చేస్తున్న దివ్యాంగులను కూడా గుర్తించాను. ఒక పట్టణంలో ఒక సమూహం సిద్ధంగా ఉంది అని అర్థమయ్యాక వారికి అక్కడి వ్యక్తుల చేత రెండు నెలల ΄ాటు ట్రయినింగ్ ఇప్పించి మిట్టి కేఫ్‌లు స్థాపిస్తున్నాను. అందుకు దాతలు ముందుకొస్తున్నారు. ఒకసారి కేఫ్ స్థాపించాక దాని మీద అధికారం ఆ దివ్యాంగులదే’ అంటుంది అలినా.
‘మా మిట్టి కేఫ్ స్టాఫ్ మిగిలిన రెస్టరెంట్ల స్టాఫ్ అంత వేగంగా పని చేయక΄ోవచ్చు. చెప్పింది మెల్లగా అర్థం చేసుకోవచ్చు. కాని వారు పని గొప్పగా చేస్తారు. మీరు మెచ్చుకునేలా చేస్తారు’ అంటుంది అలినా. వీరు అమ్మే ‘కుల్హాద్ చాయ్’కి మంచి డిమాండ్ ఉంది. అన్నట్టు ఇక్కడ మెనూ బ్రెయిలీలో కూడా ఉంటుంది. ఇలాంటి కేఫ్‌ను ప్రతి ఊరికి ఆహ్వానించండి.
Comments
Please login to add a commentAdd a comment