
ముద్విన్‌లో నీరా రుచి చూస్తున్న శ్రీనివాస్‌గౌడ్, జైపాల్‌యాదవ్ తదితరులు
కడ్తాల్: హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద రూ.10 కోట్లతో ఏర్పాటు చేస్తున్న నీరా కేఫ్‌ను జూన్ 2న దీనిని ప్రారంభిస్తామని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. గురువారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్‌లో నీరా పైలెట్ ప్రాజెక్టు కేంద్రాన్ని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో కలసి ఆయన ప్రారంభించారు.
ఈ కేంద్రంలో తయారు చేస్తున్న నీరా, దాని అనుబంధ ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గీత వృత్తిని పరిరక్షించేందుకు 4 కోట్ల ఈత, తాటి మొక్కలను పెంచేందుకు ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో నీరా కేఫ్‌లను విస్తరిస్తామన్నారు. కల్లు గీత కార్మికులకు మరింత ఉపాధి కల్పించేందుకు రంగారెడ్డి జిల్లా ముద్విన్ సహా యాద్రాద్రి భువనగిరి జిల్లా నందనం, సర్వేలు, సంగారెడ్డి జిల్లా మునిపల్లిలో నీరా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. రియల్ ఎస్టేట్ వెం చర్ల పేరుతో తాటి, ఈత వనాలను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment