శని, ఆదివారాల్లో ప్రముఖులు, సినీతారలు
స్వచ్ఛమైన నెయ్యితో అల్పాహారం తయారీ
మసాలా టీ, ఫిల్టర్ కాఫీల ఘుమఘుమలు
టెంపుల్ థీమ్‌తో ఆకట్టుకుంటున్న కేఫ్
మాదాపూర్: స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన అల్సాహారాలకు కేరాఫ్ అడ్రస్‌గా మాదాపూర్‌లోని రామేశ్వరం కేఫ్ నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నగరంలోని ఆహార ప్రియులు ఒక్కసారైనా ఈ కేఫ్‌లో నేతితో తయారు చేసిన ఆహారపదార్థాలు రుచిచూడకమానరు. ఇక వారాంతాల్లో అయితే నగరవాసులు టోకెన్ల కోసం కౌంటర్ వద్ద క్యూ కడుతుంటారు. వీరితోపాటు ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం రామేశ్వరం కేఫ్‌ను విజిట్ చేస్తుంటారంటే ఆశ్చర్యం కలగక మానదు.
మాదాపూర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో అల్పాహారానికి ఓ ప్రత్యేకమైన రుచి ఉంది. అందుకే నగరవాసులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మరీ ఇక్కడి టిఫిన్‌లను రుచిచూస్తుంటారు. టెంపుల్ థీమ్‌తో ఏర్పాటు చేసిన ఈ హోటల్ చూడడానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ప్రముఖులు, సినీతారలు సైతం వచ్చి చాయ్‌ను ఆస్వాదిస్తుంటారు. దాదాపు 150 రకాలకుపైగా టిఫిన్స్, స్నాక్స్, భోజనం, మాక్‌టైల్స్, జూసులు అందుబాటులో ఉంటాయి.
ప్రతి రోజు 800వందల నుంచి 1000 మంది టోకెన్‌లు తీసుకుంటుంటారు. ఇక శని, ఆదివారాల్లో 1200 నుంచి 1400 వందల వరకూ టోకెన్స్ తీసుకుంటుంటారు. టెంపుల్ వంటకాలను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. రైస్‌లో టెంపుల్ పులహోర, బిసిబెల్లాబాత్, కర్డ్‌రైస్, గొంగూరరైస్‌లు అందుబాటులో ఉన్నాయి. టిఫీన్స్‌లో స్పైసీ వడ, చక్కెర పొంగలి, నెయ్యి దోశ, నేతి ఇడ్లీ ఇక్కడ ప్రత్యేకంగా నిలుస్తాయి.
రకరకాల దోశెలు...
మల్టీ గ్రెయిన్ దోశ, బటర్ మసాలా దోశ, ఘీ పొడి దోశ, మసాలా దోశ, రవ్వ మసాలా దోశ, ఘీ రాగి దోశ, ఘీ ఆనియన్ దోశ, ఘీ ఆనియన్ ఊతప్పం, గార్లిక్, పుదీనా, మసాలా, ఉప్మా, జైన్ మసాలా దోశలు ప్రత్యేక ఫ్లేవర్‌తో తయారు చేయడంతో వీటి కోసం అల్పాహార ప్రియులు ఎగబడుతుంటారు. వీటితోపాటు సాంబార్ వడ, పెరుగు వడ, క్యారెట్ హల్వా, మిర్చి బజ్జీ, వంటి వెరైటీలూ భలే రుచిగా ఉంటాయని ఆహార ప్రియులు చెబుతుంటారు.
పసందైన పానీయాలు
బ్లాక్‌కాఫీ, బాదంమిల్‌్క, బూస్ట్, కాఫీ, హర్లిక్స్, లెమన్‌టీ, మసాలా బటర్‌మిల్‌్క, వివిధ రకాల పళ్ల రసాల మిల్‌్కõÙక్‌లు అందుబాటులో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment