వాట్‌ ఏ ఆఫర్‌: డ్యాన్స్‌ చెయ్యి..కాఫీ తాగు..! | US Cafe Serves Free Coffee To Anyone Who Enters While Dancing | Sakshi
Sakshi News home page

వాట్‌ ఏ ఆఫర్‌: డ్యాన్స్‌ చెయ్యి..కాఫీ తాగు..!

Published Fri, Nov 22 2024 12:43 PM | Last Updated on Fri, Nov 22 2024 1:04 PM

US Cafe Serves Free Coffee To Anyone Who Enters While Dancing

కొన్ని కేఫ్‌లు ప్రజలను సంతోష పెట్టేలా మంచి ఆఫర్లు అందిస్తాయి. అవి వినడానికి చూడటానికి చాలా వింతగా ఉంటాయి. కానీ ఈ కేఫ్‌ ఇచ్చిన ఆఫర్‌ మాత్రం సంతోషం తోపాటు మంచి రుచిని కూడా ఆస్వాదించేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ ఆఫర్‌ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. 

యూఎస్‌లోని కేఫ్‌లోకి డ్యాన్స్‌ చేస్తూ.. ఎంటర్‌ అయ్యితే చాలు మంచి రుచికరమైన ఓ కప్పు కాఫీని సిప్‌ చెయ్యొచ్చు అంటూ కస్టమర్లకు మంచి ఆఫర్‌ ఇచ్చింది. అంతే జనాలంతా తమ టాలెంట్‌ని వెలికి తీసి మరీ మంచి మంచి స్టెప్పులతో అలరించారు. 

వృద్ధులు సైతం ఈ ఆఫర్‌ కోసం ఎగబడ్డారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. నెలకోసారైనా..ఈ ఫన్‌ ఇనిషియేటివ్‌ని అందివ్వాలని కేఫ్‌ ఓనర్‌ ప్లాన్‌ చేస్తున్నారట. ఇలా ఉదారంగా ఆలోచించే కేఫ్‌లు దొరకడం అత్యంత అరుదు. 

 

(చదవండి: నాడు బెదిరింపులు, నిషేధానికి గురైన అమ్మాయి..నేడు ప్రపంచమే..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement