రష్యా కేఫ్‌లో అగ్నికీలలు | Peoples Killed in Russia Cafe Blaze After Flare Gun Discharged | Sakshi
Sakshi News home page

రష్యా కేఫ్‌లో అగ్నికీలలు

Published Sun, Nov 6 2022 6:26 AM | Last Updated on Sun, Nov 6 2022 6:26 AM

Peoples Killed in Russia Cafe Blaze After Flare Gun Discharged - Sakshi

మాస్కో: రష్యాలోని కోస్ట్రోమా పట్టణంలో శనివారం ఓ కేఫ్‌లో ఇరు వర్గాల మధ్య గొడవలో ఫ్లేర్‌ గన్‌ను పేల్చడంతో చెలరేగిన మంటలకు 13 మంది బలయ్యారు. ఏకంగా 37,000 చదరపు అడుగుల మేర విస్తరించిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది చెమటోడ్చారు.

సమీప భవనాల వారిని ఖాళీ చేయించారు. అనుమానితున్ని అరెస్టు చేశారు. 2009లోనూ పెర్మ్‌ నగరంలో నైట్‌క్లబ్‌లో బాణసంచా పేల్చడంతో మంటలంటుకుని 150 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement