సాక్షి, హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కుషినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరాగిపట్టిలో ఉన్న మసీదులో జరిగిన బాంబు పేలుడు కేసులో హైదరాబాద్‌లో ఉంటున్న ఓ ఆర్మీ మాజీ వైద్యుడు అను మానితుడిగా మారాడు. తన భార్యతో కలసి టోలి చౌకిలో నివసిస్తున్న అష్వఖ్‌ను యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ప్రత్యేక బృందం గురు వారం నగరంలో అదుపులోకి తీసుకుంది. తదు పరి విచారణ నిమిత్తం అక్కడకు తరలించింది. సోమవారం జరిగిన ఈ పేలుడు ఘటనలో ఇప్పటికే అష్వఖ్ బంధువు అరెస్టు అయ్యాడు.
వివాహానికి వెళ్లి..
అష్వఖ్ సమీప బంధువైన హాజీ ఖుద్భుద్దీఉత్తన్ బైరాగిపట్టిలోని ఓ మసీదులో పని చేస్తున్నాడు. ఓ స్నేహితుడి వివాహానికి హాజరుకావడానికి అష్వఖ్ ఈ నెల 8న బైరాగిపట్టికి చేరుకున్నాడు. పదో తేదీన ఫంక్షన్ పూర్తి చేసుకుని 12న తిరిగి హైదరాబాద్ రావడానికి రిజర్వేషన్ చేయించుకున్నాడు. ఈ క్రమంలో బైరాగిపట్టి మసీదు సమీపంలోని ఖుద్భుద్దీన్ నివాసానికి అష్వఖ్ వెళ్లాడు. సోమవారం మధ్యాహ్నం ఈ మసీదులో చిన్నస్థాయి పేలుడు సంభవించింది. ఎలాంటి ప్రాణనష్టం లేకపోయినప్పటికీ మసీదు తలుపులు, కిటికీలు ధ్వంస మయ్యాయి. దీనికి సంబంధించి ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేపట్టిన కుషినగర్ పోలీసులు సదరు మసీదులో ఇమామ్‌గా పనిచేస్తున్న మౌలానా అజ్ముద్దీన్, ఖుద్భుద్దీన్ సహా మొత్తం ఏడుగురిని నిందితులుగా చేర్చారు. దర్యాప్తు చేపట్టిన ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ అధికారులు పేలుడు జరిగిన రెండ్రోజుల్లోనే అజ్ముద్దీన్‌తోపాటు ఇజార్, జావేద్‌లను నిందితులుగా పేర్కొంటూ అదుపులో కి తీసుకున్నారు. అజ్ముద్దీన్ పాత్రపై ఆధారాలు లేక పోవడంతో అతడిని విడిచిపెట్టి, ఇజార్, జావేద్ సహా నలుగురిని అరెస్టు చేశారు.
అనుమానితుడే..
ఖుద్భుద్దీన్ ఇచ్చిన సమాచారంతో గోరఖ్‌పూర్ ఏటీఎస్ పోలీసులు, అక్కడి లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్ సంయుక్త బృందం అష్వఖ్ కోసం రంగంలోకి దిగింది. హుటాహుటిన విమానంలో నగరానికి వచ్చిన బృందం మెహిదీపట్నంలో అష్వ ఖ్‌ను అదుపులోకి తీసుకుని గురువారమే అక్కడకు తరలించింది. ఈ కేసులో అష్వఖ్ అనుమానితుడు మాత్రమే అని, వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నామని యూపీ పోలీసులు చెబుతున్నారు. అష్వఖ్ బంధువులు మాత్రం పోలీసుల ఆరోపణలను ఖండిస్తున్నారు. పేలుడు జరిగిన వెంటనే అతడే స్థానిక ఎస్పీకి ఫోన్ చేసి విషయం చెప్పాడని తెలిపారు. ముందుగా రిజర్వేషన్ చేయించుకున్న నేపథ్యంలో కుషినగర్ పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వా తే అతడు హైదరాబాద్ వచ్చాడని స్పష్టం చేస్తున్నా రు. అష్వఖ్ కెప్టెన్ హోదాలో ఆర్మీలో డాక్టర్‌గా పనిచేసి ఉండటం, ప్రస్తుతం అతడి భార్య ఆ విభాగంలోనే పనిచేస్తుండటంతో మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఎవరీ అష్వఖ్..
ఉత్తరప్రదేశ్ బైరాగిపట్టికి చెందిన అష్వఖ్ అక్కడి అలీఘర్ వర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. కెప్టెన్ హోదాలో ఇండియన్ ఆర్మీలో చేరి కొన్నేళ్ల పాటు సేవలు అందించాడు. రెండేళ్ల క్రితం వీఆర్‌ఎస్ తీసుకున్న అష్వఖ్ అక్కడ పనిచేస్తుండగానే జగిత్యాలకు చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment