భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన NIA | NIA raids Hyderabad Coimbatore Foiled Terror Attacks | Sakshi
Sakshi News home page

తమిళనాడు, హైదరాబాద్‌లో సోదాలు.. భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన NIA

Published Sat, Sep 16 2023 3:21 PM | Last Updated on Sat, Sep 16 2023 3:38 PM

NIA raids Hyderabad Coimbatore Foiled Terror Attacks - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/చెన్నై:  జాతీయ దర్యాప్తు సంస్థ NAI ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసింది. దక్షిణాదిలోని 31 చోట్ల సోదాలు నిర్వహించి.. పలువురిని అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలో భారీ ఉగ్రనెట్‌వర్క్‌  బయటపడింది. 

కోయంబత్తూరులో 22 ప్రాంతాల్లో, హైదరాబాద్‌లో ఐదు ప్రాంతాల్లో, మిగతా చోట్ల ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, అరబిక్ భాషలో ఉన్న కొన్ని పేపర్లు, వీటితో పాటు రూ. 60 లక్షలు, 18,200 US డాలర్స్ స్వాధీనం చేసుకుంది ఎన్‌ఐఏ. 

అరబిక్ క్లాసుల పేరుతో యువతను ఆకర్షిస్తున్నారు ఉగ్రవాదులు. రీజనల్ స్టడీ సెంటర్‌ల పేరుతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అలాగే.. సోషల్ మీడియాలో వాట్సాప్‌, టెలిగ్రామ్ గ్రూప్‌ల ద్వారా ప్రత్యేక శిక్షణ తరగతులు. 

భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కిలాఫత్ ఐడియాలజీని వ్యాప్తి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఒక గ్రూపుగా ఏర్పడి స్థానిక యువతను రిక్రూట్‌ చేసుకుంటున్నారు ఉగ్రవాదులు.  కిందటి ఏడాది అక్టోబర్ 23 న కోయంబత్తూర్ లో కారు పేలుడు చర్యకు పాల్పడింది ఈ తరహా శిక్షణ పొందిన ఉగ్రవాదులేనని ఎన్‌ఐఏ గుర్తించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement