చెన్నైకి వేటగాడు  | Rajinikanth Vettaiyan shooting over in Hyderabad: Rajinikanth leaves for Chennai | Sakshi
Sakshi News home page

చెన్నైకి వేటగాడు 

Published Fri, Mar 15 2024 1:47 AM | Last Updated on Fri, Mar 15 2024 1:47 AM

Rajinikanth  Vettaiyan shooting over in Hyderabad: Rajinikanth leaves for Chennai - Sakshi

హైదరాబాద్‌లో పని ముగించుకుని చెన్నైకు వెళ్లాడు వేటగాడు. హీరో రజనీకాంత్‌ టైటిల్‌ రోల్‌లో టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వేట్టయాన్‌’ (వేటగాడు). ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, రానా, ఫాహద్‌ ఫాజిల్, రితికా సింగ్, దుషారా విజయన్, మంజు వారియర్‌ కీలకపాత్రధారులు.

ఇటీవల హైదరాబాద్‌లోప్రారంభమైన ‘వేట్టయాన్‌’ సినిమా షెడ్యూల్‌ ముగిసింది. రజనీకాంత్, అమితాబ్‌ బచ్చన్, రానా, రితికా సింగ్‌ ఈ షెడ్యూల్‌లో పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని తెలిసింది. ఓ యాక్షన్‌ సీక్వెన్స్, ఓపాటను కూడా చిత్రీకరించారని సమాచారం. బూటకపు ఎన్‌కౌంటర్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదలవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement