![Four Bangladeshis Arrested For Having Fake Passports In Khammam - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/5/FakePassPort.jpg.webp?itok=_0Bb1yYn)
ఖమ్మం: నకిలీ ఐడీ ప్రూఫ్‌లతో పాస్‌పోర్టులు పొందిన నలుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. ఫేక్ ఐడీలతో పాస్‌పోర్టులు పొంది అక్రమంగా భారత్‌లోకి చొరబడి ఖమ్మంలో నలుగురు బంగ్లాదేశీయులు నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. బంగ్లాదేశ్ కు చెందిన మహమ్మద్ నూర్ నబీ, మహమ్మద్ సాగర్‌లు నకిలీ ఐడీలతో పాస్‌పోర్టు పొందినట్లు తెలిపారు. మరో ఇద్దరు షేక్ జమీర్, మహమ్మద్ అమినూర్ అక్రమంగా భారత్ లో చొరబడి ఖమ్మంలో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు.
సాగూరి ఖతూన్ అలియాస్ శిల్ప కొన్ని సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ నుండి భారత్ కి వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన బోడ రాములుతో సహజీవనం చేస్తోంది. వీరికి 11 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. సాగూరి ఖతూన్.. బంగ్లాదేశ్‌కు వెళ్లి తన సోదరులను ఖమ్మం తీసుకువచ్చింది. ఖమ్మంలో బాల కార్మికులతో సెంట్రింగ్ పని చేయిస్తుండగా పోలీసులకు వీరి విషయం తెలిసింది. నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి పాస్‌పోర్టులు పొందినట్లు పోలీసులు గుర్తించారు. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: పల్లె కడుపున రాచపుండు!
Comments
Please login to add a commentAdd a comment