Fake passport
-
బెంగళూరులో పాకిస్తానీ కుటుంబం గుట్టురట్టు
బనశంకరి: బెంగళూరు నగర శివార్లలో ఆనేకల్ వద్దనున్న జిగణిలో అక్రమంగా మకాం వేసిన పాకిస్తాన్ పౌరుడు రషీద్ అలీ సిద్దికి (48), అతని భార్య ఆయేషా (38), ఆమె తల్లిదండ్రులు హనీఫ్ మహమ్మద్ (73), రుబీనా (61) అనేవారిని ఆదివారం రాత్రి జిగణి పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి పాకిస్తాన్‌లోని కరాచీ వద్ద లియాకతాబాద్ కాగా, వదిలిపెట్టి బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయి ఢాకాలో స్థిరపడ్డాడు. తరువాత లాహోర్‌కు చెందిన భార్య, అత్తమామలతో 2014లో అక్రమంగా ఢిల్లీకి చేరుకుని అక్కడ స్థానిక వ్యక్తి సాయంతో ఆధార్ కార్డులు, డ్రైవింగ్లైసెన్సు, పాస్‌పోర్టు తయారుచేసుకుని 2018లో జిగణికి చేరుకుని ఇక్కడే నివాసం ఉంటున్నాడు.నిఘా సంస్థలకు సమాచారంఇతడి ఆచూకీ కనిపెట్టిన కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు జిగణి పోలీసులతో కలిసి అదుపులోకి తీసుకున్నారు. తెలివిగా వీరందరూ కూడా ఉత్తరాదికి చెందిన హిందూ పేర్లతో చలామణి అయ్యేవారు. రషీద్ అనేవ్యక్తి శంకర్శర్మగా, అతని భార్య ఆషారాణిగా, ఆమె తల్లిదండ్రులు రాంబాబు శర్మ, రాణి శర్మగా పేర్లు మార్చుకున్నారు. వీరి ఇంట్లో ల్యాప్‌టాప్‌ను పోలీసులు సీజ్‌చేశారు. వీరు పాకిస్తాన్ గూఢచారులా, లేక మరేదైనా? అనేది విచారణ చేపట్టారు. వీరి గుట్టు ఎలా బయటపడిందంటే.. ఇటీవల చైన్నె ఎయిర్‌పోర్టులో ఇద్దరు పాకిస్తానీలు నకిలీ పాస్‌పోర్టులో పట్టుబడ్డారు. వారిని విచారించగా రషీద్ గురించి ఉప్పందించారు. పాకిస్తాన్లో మత పరమైన గొడవల వల్ల తాము దేశం వదిలిపెట్టినట్లు రషీద్ చెబుతున్నాడు. 2018 నుంచి బెంగళూరులో ఉంటున్నట్లు చెప్పాడు.దర్యాప్తు చేస్తున్నాం: హోంమంత్రిభారత్ నకిలీ పాస్పోర్టుతో వీరు గత పదేళ్లుగా భారత్‌లో ఉన్నారని, ఏడాదిక్రితం బెంగళూరుకు చేరుకున్నారని, ఎందుకు వచ్చారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. జిగణిలో ఓ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్నట్లు చెప్పారు. పాక్ కుటుంబం గుట్టు బయటపడడంతో పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని ఆరా తీశారు. జిగణిలో ఇటీవలే గౌతం బోరా అనే అసోం ఉల్ఫా అనుమానిత ఉగ్రవాది పట్టుబడ్డాడు. ఇంతలోనే పాకిస్తాన్ వాసి జాడ తెలిసింది. ఇంకా ఇటువంటివారు ఎంతమంది ఉన్నారనేది సస్పెన్స్‌గా మారింది. -
నకిలీ ఐడీప్రూఫ్‌తో పాస్‌పోర్టులు పొందిన నలుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్
ఖమ్మం: నకిలీ ఐడీ ప్రూఫ్‌లతో పాస్‌పోర్టులు పొందిన నలుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. ఫేక్ ఐడీలతో పాస్‌పోర్టులు పొంది అక్రమంగా భారత్‌లోకి చొరబడి ఖమ్మంలో నలుగురు బంగ్లాదేశీయులు నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. బంగ్లాదేశ్ కు చెందిన మహమ్మద్ నూర్ నబీ, మహమ్మద్ సాగర్లు నకిలీ ఐడీలతో పాస్‌పోర్టు పొందినట్లు తెలిపారు. మరో ఇద్దరు షేక్ జమీర్, మహమ్మద్ అమినూర్ అక్రమంగా భారత్ లో చొరబడి ఖమ్మంలో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. సాగూరి ఖతూన్ అలియాస్ శిల్ప కొన్ని సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ నుండి భారత్ కి వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన బోడ రాములుతో సహజీవనం చేస్తోంది. వీరికి 11 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. సాగూరి ఖతూన్.. బంగ్లాదేశ్‌కు వెళ్లి తన సోదరులను ఖమ్మం తీసుకువచ్చింది. ఖమ్మంలో బాల కార్మికులతో సెంట్రింగ్ పని చేయిస్తుండగా పోలీసులకు వీరి విషయం తెలిసింది. నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి పాస్‌పోర్టులు పొందినట్లు పోలీసులు గుర్తించారు. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదీ చదవండి: పల్లె కడుపున రాచపుండు! -
Fake Passports: నకిలీ పాస్‌పోర్ట్ కేసులో కీలక పరిణామం
-
నకిలీ పాస్ పోర్ట్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది: షిక గోయల్
-
అసలు పేరు చెప్పిన డెత్ సర్టిఫికెట్!
సాక్షి, హైదరాబాద్: ఇక్కడి పోలీసులు అరెస్టు చేసినా... తమ పాస్‌పోర్టు స్వాదీనం చేసుకున్నా...లుక్ఔట్ సర్క్యులర్ జారీ చేసినా... రాకపోకలు, దందాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి నైజీరియన్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. తమ దేశంలోనే అసలు, నకిలీ పేర్లతో రెండు పాస్‌పోర్టులు తీసుకుంటున్నారు. అసలుది దాచేసి, నకిలీ పేరుతో తీసుకున్న దాంతోనే ప్రయాణాలు చేస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసినప్పుడూ ఇందులోని పేరే చెప్తున్నారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ), నారాయణగూడ ఠాణా అధికారులు ఇటీవల అరెస్టు చేసిన వసిగ్వీ చిక్వమేక జేమ్స్ విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇతడి అసలు పేరు, వివరాలు సైతం ఓ డెత్ సర్టిఫికెట్ ద్వారా బయటకు వచ్చాయి. డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్లు అవలంభిస్తున్న కొత్త పంథా ఇదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. గోవాకు వచ్చిపోతూ డ్రగ్స్ దందా... నైజీరియాకు చెందిన వసిగ్వీ జేమ్స్ 2013 నుంచి టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చిపోతున్నాడు. 2016, 2019ల్లోనూ రాకపోకలు సాగించిన ఇతడికి గోవా, బెంగుళూరుల్లో ఉండే డ్రగ్ పెడ్లర్స్‌తో పరిచయాలు ఏర్పడ్డాయి. అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ జాక్స్ సరఫరా చేస్తున్న సింథటిక్ డ్రగ్స్‌కు అక్కడి పెడ్లర్స్‌కు విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడం మొదలెట్టాడు. ఇలాంటి నేరాలు చేస్తూ చిక్కిన వారి నుంచి పోలీసులు పాస్‌పోర్టు స్వాదీనం చేసుకుంటారు. వీళ్లు బెయిల్ పొందినా దేశం దాటి వెళ్లిపోకుండా విమానాశ్రయాలకు లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేస్తారు. తనకు ఇలా జరిగితే స్వదేశానికి వెళ్లడం ఇబ్బందని భావించాడు. దీంతో 2021 నవంబర్ 19న నైజీరియాలోనే అలమాంజో మాసెక్సూ్య పేరుతో మరో పాస్‌పోర్టు తీసుకున్నారు. నకిలీవి వాడుతూ వ్యవహారాలు.. డబ్బు అవసరమైన ప్రతిసారీ భారత్‌కు వచ్చి డ్రగ్స్ దందా చేయడం మొదలెట్టాడు. ఈ నకిలీ పేరుతో తీసుకున్న పాస్‌పోర్టు వాడి 2021–22ల్లో గోవాకు వచ్చాడు. తనకు పరిచయం ఉన్న కస్టమర్లను డ్రగ్స్ అమ్ముతూ ఈ ఏడాది మార్చిలో అక్కడి పోలీసులకు చిక్కాడు. ఆ సందర్భంలో అలమాంజో పేరు చెప్పి, దాంతో ఉన్న పాస్‌పోర్టే చూపించాడు. మూడు వారాలు జైల్లో ఉండి బయటకు వచ్చి మళ్లీ దందా మొదలెట్టాడు. తాజాగా గత వారం నారాయణగూడ పరిధిలోని కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేయడానికి వచ్చి హెచ్–న్యూ పోలీసులకు చిక్కాడు. ప్రాథమిక విచారణలో తన పేరు అలమాంజో అని చెప్తూ ఆధారంగా ఆ పేరుతో ఉన్న పాస్‌పోర్టే చూపించాడు. సాధారణ దర్యాప్తులో భాగంగా అధికారులు అతడి సెల్‌ఫోన్‌ను విశ్లేషించారు. ఆమె డెత్ సర్టిఫికెట్తో గుట్టురట్టు... ఇందులోని ఈ–మెయిల్స్, ఇతర పత్రాల్లో వసిగ్వీ జేమ్స్ అనే పేరు కనిపించింది. దీనిపై ప్రశ్నించగా... అసలు ఆ ఫోనే తనది కాదంటూ తప్పించుకున్నాడు. గోవాలో తనతో సహజీవనం చేసిన ఓ యువతి గతంలోనే అనారోగ్యంతో మరణించిందని, ఆమె మీద ఒట్టేసి చెప్తున్నానంటూ బుకాయించాడు. అయితే అనుమానం నివృత్తి కాని దర్యాప్తు అధికారులు ప్రతి ఈ–మెయిల్‌ను విశ్లేషించారు. ఓ మెయిల్లో సదరు యువతికి సంబంధించిన డెత్ సరి్టఫికెట్ లభించింది. అందులో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఆమె పేరుతో పాటు భర్తగా వసిగ్వీ చిక్వమేక జేమ్స్ పేరు ఉంది. దీని ఆధారంగా పోలీసులు అతగాడిని తమదైన శైలిలో విచారించారు. దీంతో తన అసలు పేరు అదేనని అంగీకరించడంతో పాటు అలా ఎందుకు చేశాడో వివరించాడు. ఇటీవల అనేక మంది నైజీరియన్లు ఇలానే చేస్తున్నట్లు బయటపెట్టడంతో అ«ధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారంపై ఆ దేశ ఎంబసీకి లేఖ రాయాలని నిర్ణయించారు. (చదవండి: మునా‘వార్’... కామెడీ షో కోసం వస్తున్న మునావర్ ఫారూఖీ) -
సిద్ధూ హత్య కేసు: వెలుగులోకి వస్తున్నకీలక విషయాలు
న్యూఢిల్లీ: పంజాబ్ సింగర్ సిద్ధూ హత్య కేసుకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ...పంజాబ్ సింగర్ సిద్ధూని హత్యకు సంబంధించిన కుట్రదారుల్లో ఒక వ్యక్తి హత్యకు నెలరోజుల మందుగానే నకిలీ పాస్పోర్టుతో భారత్ వదిలి పారిపోయాడని చెప్పారు. ఆ వ్యక్తి సచిన్ బిష్ణోయ్ అని, అతను జైల్లో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సన్నిహిత సహచరుడని పేర్కొన్నారు. ఈ హత్యకు ప్లాన్ చేసి తర్వాతే నకీలీ పాస్‌పోర్ట్ సహాయంతో ఇండియా వదిలి పారిపోయాడని చెప్పారు. ఈ విషయాన్ని తాము ముందుగానే గుర్తించి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు సచిన్ బిష్ణోయ్ ఏప్రిల్ 21 వరకు భారత్‌లోనే ఉన్నాడని తెలిపారు. నిందితుడు కెనడాకు చెందిన గోల్డీ బ్రార్‌తో పాటు రాపర్‌ని హత్య చేసిన ఇద్దరు ప్రధాన కుట్రదారులలో ఒకరుగా భావిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలోని సంగమ్ విహార్ చిరునామాతో తిలక్ రాజ్ తోటేజా పేరుతో సచిన్ బిష్ణోయ్ నకిలీ పాస్‌పోర్ట్‌ను పొందినట్లు పోలీసులు గుర్తించారు. సిద్ధూ మూసే వాలేని హత్య చేసింది మే 29న అయితే సచిన్ బిష్ణోయ్ ఏప్రిల్ 21నే భారత్‌ని వదలి దూబాయ్ పారిపోయాడని అక్కడి నుంచి అజర్బైజాన్ వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు సచిన్ బిష్ణోయ్ ఢిల్లీలో ఉన్నప్పుడే మూస్ వాలా హత్యకు సంబంధించిన మొత్తం ప్లాన్‌ని సిద్ధం చేసి, షూటర్లకు షెల్టర్లు, డబ్బు, వాహనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదీగాక సిద్ధూ మూసే వాలేకి ఉన్న 424 భద్రతా సిబ్బంది తొలగించిన తర్వాత ఈ హత్య జరగడం గమనార్హం. (చదవండి: Sidhu Moose Wala Murder Case: మాస్టర్ మైండ్ అతనేనన్న ఢిల్లీ పోలీసులు) -
పాఠకుల మనసులూ దోచుకున్నాడు!
‘దబాంగ్’ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన సోనాక్షి సిన్హాకు ఇష్టమైన పుస్తకం శాంతారామ్. ‘థ్రిల్లింగ్, ఫిలాసఫికల్, రొమాంటిక్, ట్రాజెడీ, ఒక జీవితానికి సంబంధించిన ఎత్తుపల్లాలు చూపించే మల్టీ–ఫేస్డ్ ప్లాట్ ఇది’ అంటోంది సోనాక్షి. ‘శాంతారామ్’ సంక్షిప్త పరిచయం... ఇది జరిగిన కథ కాదు. అలా అని జరగని కథ కాదు. రచయిత స్వీయఅనుభవాలకు కల్పన జోడించి కమర్శియల్ ఫార్మట్‌లో రాసిన నవల ఇది. ‘శాంతారామ్ అనేది ఆటోబయోగ్రఫీ కాదు. పక్కా నవల. ఒకవేళ ఇది ఆటోబయోగ్రఫీ అనే భావన కలిగిస్తే అంతకంటే అదృష్టం ఏముంటుంది!’ అంటాడు రచయిత డేవిడ్ రాబర్ట్స్. ఇక కథలోకి వద్దాం... ఆస్ట్రేలియాలోని పెన్ట్రిడ్జ్ జైలు నుంచి తప్పించుకొని ఇండియాకు పారిపొయి బాంబేలో తేలుతాడు బ్యాంక్ రాబర్ డేవిడ్. బాంబేలో అతనికి మొదట పరిచయమైన వ్యక్తి ప్రభాకర్. మొదట తనకు గైడ్‌గా సహాయపడిన ప్రభాకర్ ఆతరువాత మంచి స్నేహితుడవుతాడు. తనకు ‘లిన్బాబా’ అని పేరు పెడతాడు. ‘లిన్’ అని పిలుచుకుంటాడు. ‘జిలుగువెలుగుల బాంబే కాదు....మరో బాంబే కూడా ఉంది’ అంటూ బాంబే మురికివాడల జీవితాన్ని పరిచయం చేస్తాడు ప్రభాకర్. అంతే కాదు తన స్వగ్రామం ‘సుందర్’కు తీసుకువెళతాడు. ఆ ఊళ్లో బీదరికం తాండవించినా కోట్ల కంటే విలువైన సౌందర్యం ‘లిన్’ను ఆకట్టుకుంటుంది. ప్రభాకర్ తల్లి డేవిడ్‌కు ‘శాంతారామ్’ అని పేరు పెడుతుంది. ఆ పేరు విలువ తెలుసుకొని మురిసిపోతాడు లిన్. బాంబే వచ్చిన తరువాత ఒక బార్లో డబ్బుతో పాటు తన రెక్కలు ‘నకిలీ పాస్‌పోర్ట్’ కూడా పోగొట్టుకుంటాడు. ఇక చచ్చినట్లు బాంబేలో ఉండాల్సిందే! బాంబేలోని స్లమ్ ఏరియాలో చిన్న షెడ్డులో మకాం పెడతాడు. ఒకరోజు ఆ ఏరియాలో అగ్నిప్రమాదం జరుగుతుంది. ఎంతోమందిని రక్షించడమే కాదు వారికి తానే స్వయంగా వైద్యం చేస్తాడు. ఆ తరువాత కూడా తనకు తెలిసిన వైద్యంతో అక్కడి జనాలకు సహాయపడుతూ అనధికార డాక్టర్ అవుతాడు. వచ్చే పోయే పేషెంట్లతో అతడి షెడ్డు చిన్నపాటి ‘క్లీనిక్’ అవుతుంది. వైద్యం కోసమే కాదు రకరకాల విషయాల్లో సలహా కోసం అతని దగ్గరికి వచ్చే జనాల సంఖ్య పెరుగుతుంది. స్లమ్ ఏరియాలో శాంతారామ్ హీరోగా ఎదుగుతున్న విషయం క్రిమినల్ అబ్దుల్ ఖాదర్ ఖాన్‌కు తెలిసి పరిచయం చేసుకుంటాడు. ‘పేద ప్రజలకు నువ్వు చేస్తున్న సహాయం నాకు బాగా నచ్చింది’ అని వేనోళ్ల పొగుడుతాడు. అలా మంచిచేసుకున్న తరువాత మెల్లగా శాంతారామ్ను బ్లాక్‌మార్కెట్ దందాలోకి లాగుతాడు. ప్రత్యర్థి ఒకరు చేసిన కుట్ర వల్ల శాంతారామ్ అరెస్ట్ అవుతాడు. బాంబే జైల్లో చిత్రహింసలు అనుభవిస్తాడు. ఖాదర్ అతడిని జైలు నుంచి విడిపించి బయటికి తీసుకువస్తాడు. ఇక అప్పటి నుండి ప్రొఫెషనల్ కిల్లర్‌గా మారుతాడు. దేశమంతా తిరుగుతాడు. తనకు అత్యంత సన్నిహితుడైన భాస్కర్ చనిపోవడంతో శాంతారామ్ ఒకలాంటి వైరాగ్యస్థితిలోకి వెళ్లిపోతాడు. రామ్‌ను మళ్లీ మామూలు జీవితంలోకి తీసుకువచ్చే బాధ్యతను ఖాదర్ ‘కార్లా’ అనే అమ్మాయికి ఇస్తాడు. బాలీవుడ్ సినిమాల్లో చిన్నాచితకా వేషాలు వేసే కార్లాను బాంబే అండర్ వరల్డ్ రకరకాల క్రిమినల్ ఆపరేషన్స్‌లో పావుగా ఉపయోగించుకుంటారు. ఎట్టకేలకు కార్ల వల్ల మళ్లీ మూమూలు జీవితంలోకి వస్తాడు శాంతారామ్. ఆఫ్గనిస్థాన్‌లో తీవ్రవాదులకు సహకారం అందించడానికి ఖాదర్ శాంతారామ్ను తీసుకువెళతాడు. అక్కడ ఖాదర్ హత్యకు గురవుతాడు. శాంతారామ్ చావు తప్పి కన్ను లొట్ట పోయే పరిస్థితుల్లో ఇండియాకు పారిపోయి వస్తాడు. నేరాల బాట వీడి నిజాయితీగా బతకాలని నిర్ణయించుకుంటాడు. -
జయేష్.. అందుకే కొత్త గెటప్
న్యూఢిల్లీ: జయేష్ పటేల్(32) అనే యువకుడు ఓ వృద్ధుడి వేషంలో అమెరికాకు వెళుతూ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టవడం తెల్సిందే. పోలీసు విచారణలో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన అతడు అమెరికాలో ఉద్యోగం పొందేందుకు జయేష్ పలుమార్లు ప్రయత్నించినా వీసా దొరకలేదు. ఈ విషయం తెలుసుకున్న భరత్ అనే యువకుడు రూ.30 లక్షలు ఖర్చుపెడితే అమెరికాకు వెళ్లొచ్చని చెప్పాడు. ఇందుకు జయేష్ అంగీకరించడంతో కొందరు ఏజెంట్లు అతడిని పటేల్ నగర్‌లోని ఓ సెలూన్‌కు తీసుకెళ్లారు. దాని యజమాని షంషేర్ తన మేకప్ మాయాజాలం ప్రదర్శించి 32 ఏళ్ల జయేష్‌ను 81 సంవత్సరాల వృద్ధుడిగా మార్చేశాడు. తలకు పాగాతో పాటు పాత కళ్లద్దాలను అమర్చాడు. మరోవైపు ఏజెంట్లు అర్మిక్ సింగ్ పేరుతో జయేష్‌కు నకిలీ పాస్‌పోర్టును అందజేశారు. ఈ వేషంలో తొలుత చెకింగ్‌ను సులభంగా దాటేసిన జయేష్, తన స్వరం వయసుకు తగ్గట్లు లేకపోవడం, ఒంటిపై ముడతలుండకపోవడంతో... సీఐఎస్ఎఫ్ అధికారుల కళ్లలోకి సూటిగా చూడకుండా మాట్లాడటంతో దొరికిపోయాడు. షంషేర్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. (చదవండి: నకిలీ ‘బాబు’ అలా బుక్కయ్యాడన్నమాట!) -
నకిలీ ‘బాబు’ అలా బుక్కయ్యాడన్నమాట!
సాక్షి, న్యూఢిల్లీ: వేషం మార్చి నకిలీ పాస్‌పోర్ట్‌తో విదేశాలకు చెక్కేద్దామనుకున్న వ్యక్తికి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ భద్రతా అధికారులు చెక్ పెట్టారు. సినీ ఫక్కీలో జయేశ్ పటేల్ (32) 81 ఏళ్ల వృద్ధుడిలా వేషం మార్చుకున్నాడు. గడ్డం, కళ్ల జోడు, నెత్తికి, గడ్డానికి తెల్ల రంగు, వీల్ చైర్ ఇలా అన్ని హంగులతో సీనియర్ సిటిజన్లా దర్జాగా న్యూయార్క్‌కు పయనమయ్యాడు. కానీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) అతగాడి వాలకాన్ని, ప్రవర్తనను పసిగట్టేయడంతో అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే..గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన జయేశ్ పటేల్ తనను తాను 81 ఏళ్ల అమ్రిక్ సింగ్‌గా మార్చుకున్నాడు. అతని పేరుతో నకిలీ పాస్‌పోర్ట్ సృష్టించాడు. తెల్లని జుట్టు, గడ్డంతో వీల్ చైర్ మీద న్యూయార్క్ వెళ్లేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం చేరుకున్నాడు. అయితే అతని శారీరక రూపానికి, ప్రవర్తనకు సరిపోలకపోవడంతో సిఐఎస్ఎఫ్ ఎస్ఐ రాజ్వీర్ సింగ్ అతగాడిని ప్రశ్నించాడు. నిందితుడు అధికారి కళ్లలోకి సూటిగా చూడకుండా.. బిత్తిరి చూపులు చూడటం మొదలు పెట్టాడు. దీంతో మరింత లోతుగా పరిశీలించగా అసలు గుట్టు రట్టయింది. తదుపరి దర్యాప్తు కోసం జయేష్ పటేల్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులకు అప్పగించామనీ, ఈ చట్టవిరుద్ధమైన చర్యకు ఎందుకు పాల్పడ్డాడనే దానిపై దర్యాప్తు జరుగుతోందని సీనియర్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
మార్చి.. ఏమార్చి
సాక్షి, హైదరాబాద్ : అర్హత, అవకాశం లేకున్నా స్టడీ, విజిట్, బిజినెస్, నివాసం కోసం విదేశాలకు వెళ్లాలని భావించే వారి పాస్‌పోర్టులను ట్యాంపరింగ్ చేసి వీసా ప్రాసెసింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కాన్సులేట్ల వద్ద ఇమ్మిగ్రేషన్ డేటా అందుబాటులో ఉండదనే చిన్న లూప్‌హోల్‌ను క్యాష్ చేసుకున్న ఈ గ్యాంగ్ ఏడాదిలో దాదాపు 450 వీసాలు ప్రాసెసింగ్ చేసి రూ.కోటి వరకు అక్రమార్జన చేసిందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలసి సోమవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ ముఠా కెనడా, అమెరికా, యూఏఈ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ కాన్సులేట్లను మోసం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జైల్లో దొరికిన లింకుతో... హుస్సేనిఆలం ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ రహీముద్దీన్ 2010లో సైదాబాద్‌లోని సన ప్యాలెస్‌లో కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి నకిలీ పాస్‌పోర్టులు, వీసాలు తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టాడు. రెండేళ్ల క్రితం ఇదే నేరంలో లంగర్‌హౌస్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఇదే నగర నేర పరిశోధన విభాగం అధికారులు చెన్నైకి చెందిన ఓ వ్యక్తిని వేరే కేసులో రిమాండ్‌కు తరలించారు. ఇతని ద్వారా రహీముద్దీన్‌కు చెన్నై రాయపురం ప్రాంతానికి చెందిన, పాస్‌పోర్టుల ట్యాంపర్‌లో నిపుణుడైన మహ్మద్ షేక్ ఇలియాస్ పరిచయమయ్యాడు. రహీముద్దీన్ జైలు నుంచి బయటకు వచ్చి ఇలియాస్‌తో కలసి కొత్త దందాకు శ్రీకారం చుట్టాడు. తమ ముఠాలో గోల్కొండకు చెందిన ఖాలిద్ ఖాన్, టప్పాచబుత్రకు చెందిన మహ్మద్ ఒమ్రాన్, ఫలక్‌నుమా వాసి మహ్మద్ జహీరుద్దీన్‌ను కలుపుకున్నారు. ‘సెకండ్ హ్యాండ్ పాస్‌పోర్ట్’ఖరీదు... కాలం చెల్లిన పాస్‌పోర్టులతో పాటు ఇతర దేశాల్లో రిజెక్ట్ స్టాంప్ పడిన వాటిని దళారుల నుంచి ఈ గ్యాంగ్ రూ.5 వేలిచ్చి ఖరీదు చేసేది. పైన ఉండే కవర్, ఇతర సెక్యూరిటీ ఫీచర్స్‌ను వాడుకునేవారు. వీసా ప్రాసెసింగ్ కోసం పాస్‌పోర్టుల్ని ట్యాంపర్ చేసే ఈ గ్యాంగ్ అనుబంధ పత్రాలైన బ్యాంకు స్టేట్మెంట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, ఆఫర్ లెటర్స్, ఐటీ రిటర్న్స్, ప్రాపర్టీ వాల్యూషన్ సర్టిఫికెట్లు లాంటి ఫామ్స్‌ను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వివరాలు తయారు చేసేవారు. చెత్తబజార్‌లో సుప్రీం గ్రాఫిక్స్ నిర్వహించే ఒమ్రాన్ కొంత కమీషన్ తీసుకుని ఈ బాధ్యతలు నిర్వహించేవాడు. వీరికి అవసరమైన స్టాంపుల్ని మహ్మద్ జహీరుద్దీన్ తయారు చేసి అందించేవాడు. పాస్‌పోర్ట్‌ల ట్యాంపర్ ఇలా... జమ్మూకశ్మీర్, గుజరాత్, మరికొన్ని రాష్ట్రాలతో పాటు ఇంకొందరికి అమెరికా, కెనడా తదితర దేశాలతో పాటు యూరప్ దేశాల వీసాలు లభించవు. ఇలాంటి వారు దళారుల ద్వారా రహీముద్దీన్‌ను సంప్రదించేవారు. వారి నుంచి రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేసి పాస్‌పోర్ట్ ట్యాంపరింగ్‌కు శ్రీకారం చుట్టేవాడు. ఇందులో భాగంగా ఆయా పాస్‌పోర్ట్‌లకు చెందిన వ్యక్తి వివరాలు ఉండే మొదటి, చివరి పేజీలను అట్టతో సహా వేరు చేసేవారు. సదరు వ్యక్తులకు ఆయా దేశాల వీసాలు రావాలంటే అక్కడకు గతంలో వెళ్లి వచ్చినట్లో, శాశ్వత నివాసి అయినట్లో ఆధారాలు చూపాలి. దీని కోసం రహీముద్దీన్ గ్యాంగ్ దళారుల నుంచి ఖరీదు చేసిన ‘సెకండ్ హ్యాండ్ పాస్‌పోర్ట్’కు చెందిన మొదటి, ఆఖరి పేజీలను వాడుతోంది. ఆఖరి పేజీలో మాత్రం సదరు పాస్‌పోర్ట్ లండన్, లేదా అమెరికాలో రీ–ఇష్యూ అయినట్లు పొందుపరుస్తున్నారు. సాధారణంగా ఆ దేశంలో పాస్‌పోర్ట్ పోయినా, ఎక్స్‌పైరైనా అక్కడి భారత రాయబార కార్యాలయాలు ఇలా రీ–ఇష్యూ చేస్తాయి. ట్యాంపర్ చేసిన పాస్‌పోర్ట్ లోపల కూడా ‘సెకండ్ హ్యాండ్ పాస్‌పోర్ట్’నుంచి తీసిన పేజీలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిపై ఆయా దేశాల వీసాతో భారత్‌లోకి వచ్చినట్లు బోగస్ ఇమ్మిగ్రేషన్ స్టాంపులు వేస్తున్నారు. ఇలా ట్యాంపర్ చేసిన పాస్‌పోర్ట్ ఆధారంగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టి వీసా కోసం కాన్సులేట్లకు దరఖాస్తు చేస్తున్నారు. వీటి వద్ద పాస్‌పోర్ట్‌ల డేటా ఉంటున్నప్పటికీ ఇమ్మిగ్రేషన్ డేటా ఉండట్లేదు. దీంతో పాస్‌పోర్ట్ నంబర్ ఆధారంగా చెక్ చేస్తే ట్యాంపరింగ్ అయినట్లు గుర్తించలేకపోతున్నారు. ఆయా దేశాలకు వెళ్లిరాలేదని తెలుసుకోలేకపోతున్నారు. దీంతో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న కాన్సులేట్ అధికారులు వీసా జారీ చేస్తున్నారు. పంపే ముందు పాతవి పెట్టేసి... వీసా పొందిన వారు ఆయా దేశాలకు ప్రయాణించాలంటే విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ చెక్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బోగస్ ఎంట్రీ, ఎగ్జిట్ స్టాంపులున్న పాస్‌పోర్ట్‌తో వెళితే ఇమ్మిగ్రేషన్‌కు చిక్కే అవకాశం ఉంటుంది. దీంతో రహీముద్దీన్ గ్యాంగ్ వీసా వచ్చిన వెంటనే ఆ వ్యక్తికి చెందిన ట్యాంపర్ చేసిన పాస్‌పోర్ట్‌లో ముందు తొలగించినవి పెట్టేస్తూ, అదనంగా జోడించిన స్టాంపులతో కూడిన పేజీలను తీసేస్తున్నారు. ఇలా పాస్‌పోర్ట్ మళ్లీ మొదటి స్థితికే వచ్చేస్తోంది. ఈ పని చేసిన తర్వాత రహీముద్దీన్ ఒక్కొక్కరి నుంచి రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేసి ముఠా సభ్యులకు పంచుతున్నాడు. ఈ వీసాలతో ఇతర దేశాలకు వెళ్తున్న వారిలో కొంతమంది దొరికేసి డిపోర్టేషన్‌పై వస్తున్నారు. ఇలా ఏడాదిలో రూ.కోటి సంపాదించిన రహీముద్దీన్ అల్వాల్‌లోని అపార్ట్మెంట్లో ఫ్లాట్, షహీన్‌నగర్‌లో ఇల్లు, షాద్‌నగర్‌లో ప్లాట్ కొనుగోలు చేశాడు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు కేఎస్ రవి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్, జి.రాజశేఖర్‌రెడ్డి వరుస దాడులు చేసి రహీముద్దీన్ సహా ఐదుగురినీ అరెస్టు చేశారు. వీరి నుంచి 150 రబ్బర్ స్టాంపులు, 80 పాస్‌పోర్టులు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. -
బెయిల్‌పై విదేశీ మోడల్ విడుదల
గోరఖ్‌పూర్: ఒరిజినల్ వీసా లేకుండా భారత్‌లో తిరుగుతూ అరెస్టయిన ఉక్రెయిన్‌కు చెందిన మోడల్ డారియా మోల్చా(20) బెయిల్‌పై జైలు నుంచి విడుదల అయ్యారు. గత నెల ఏప్రిల్ 3న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లోని సిటీస్ పార్క్ రోడ్డులోని ఓ హోటల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో ఆమె అక్రమంగా, నకిలీ డాక్యుమెంట్లతో దేశంలో ఉంటున్నట్లు బయటపడింది. ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టి..అనంతరం కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. ఏప్రిల్ 12న ఆమె పెట్టుకున్న బెయిల్ దరఖాస్తును జిల్లా కోర్టు తిరస్కరించింది. వారం తర్వాత మరోసారి డారియా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న కోర్టు వారం రోజుల క్రితం బెయిల్ మంజూరు చేసింది. గురువారం ఆమె ఉంటున్న జైలు నుంచి రిలీజ్ ఆర్డర్ వచ్చింది. ఐపీసీలోని వివిధ సెక్షన్లతో పాటు, ఫారినర్స్ యాక్ట్ కింద డారియా మాల్చాపై కేసు నమోదైనట్లు, శుక్రవారం మధ్యాహ్నాం ఒంటి గంటకు జైలు నుంచి విడుదలైనట్లు జైలు సూపరింటెండెంట్ రామధాని విలేకరులకు తెలిపారు. డారియాను ఢిల్లీలోని ఉక్రెయిన్ ఎంబసీకి తరలించినట్లు గోరఖ్‌పూర్ సీనియర్ ఎస్పీ శలభ్ మాతూర్ తెలిపారు. కోల్కత్తా నుంచి వచ్చిన చందారి రావత్, ఆదర్శ్ అనే ఇద్దరు ఆమె బెయిల్ కోసం సహకరించారని పోలీసు అధికారి తెలిపారు. నేపాల్ నుంచి భారత్‌లోకి అక్రమంగా విదేశీయులు చొరబడుతున్నారన్న సమాచారం స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) అధికారులకు చేరడంతో వారు అప్రమత్తుమై సోదాలు నిర్వహించడం మొదలు పెట్టారు. ఆ సోదాల్లో భాగంగానే పార్క్ రెసిడెన్సీ హోటల్లో డారియా మోల్చా అరెస్ట్ అయింది. మోల్చా రెండు సంవత్సరాల నుంచి తరచూ భారత్‌ను సందర్శిస్తూ వస్తోంది. చివరి సారి డారియా 2017 డిసెంబర్లో ఢిల్లీని సందర్శించింది. డారియా స్నేహితుడు ఇంషాన్ సలహా మేరకు నేపాల్ నుంచి సరిహద్దు ద్వారా భారత్‌లోకి ప్రవేశించినట్లు నిందితురాలు డారియా విచారణలో టాస్క్‌ఫోర్స్ అధికారులకు తెలిపారు. ఆమె నుంచి నకిలీ డ్రైవింగ్ లైసెన్స్, రెండు పాస్‌పోర్టులు, రెండు మొబైల్ ఫోన్లు, ఒక టాబ్లెట్, ఒక ఐపాడ్, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. -
సంచలనం; నగరంలో పాకిస్తానీ కలకలం
సాక్షి, హైదరాబాద్: ఓ వైపు దేశంలోకి జైషే మహమ్మద్ ఉగ్రవాదులు చొరబడ్డారన్న వార్తలు కలకలం సృష్టిస్తుండగా.. భాగ్య నగరంలో వెలుగు చూసిన మరో ఘటన సంచలనం రేపుతోంది. నకిలీ ధ్రువపత్రాలతో పాస్‌పోర్టు పొంది, నగరంలో తలదాచుకుంటున్న ఓ పాకిస్తానీని శుక్రవారం పోలీసులకు పట్టుకున్నారు. పాకిస్తాన్‌కు చెందిన మహమ్మద్ ఉస్మాన్ ఇక్రాన్ అనే వ్యక్తి నకిలీ పత్రాలతో ఇండియన్ పాస్‌పోర్టు పొందాడని హైదారాబాద్ సైబర్ క్రైం పోలీసులు వెల్లడించారు. ఇక్రాన్ భార్య ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన పోలీసులు ఘటనకు సంబంధించి లోతైన విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
మయన్మార్ దేశస్తుడి అరెస్ట్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పరిధిలో నకిలీ పాస్పోర్టుతో నివాసం ఉంటున్నమయన్మార్ దేశీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మయాన్మార్‌కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ పదేళ్ల క్రితం నకిలీ పాస్పోర్టుతో అక్రమంగా భారతదేశంలో ప్రవేశించాడు. మొదట కోల్‌కతా వచ్చి అక్కడ నకిలీ బర్త్ సర్టిఫికెట్ తీసుకొని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లాడు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుని పహాడీ షరీఫ్‌లో స్థిరపడ్డాడు. అక్కడే ఇంతకాలం ఉంటూ నకిలీ పత్రాల సాయంతో ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు తీసుకున్నాడు. వాటిని ఉపయోగించుకుని ఇక్కడి నుంచి పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకోవాలని యత్నిస్తున్నాడు. ఇది తెలుసుకున్న పోలీసులు అతడిని పట్టుకున్నారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన కొందరు తీవ్రవాదం వైపు మళ్లుతున్నారని, ఇలాంటివి జరగకుండా నిఘా ఉంచామని వివరించారు. మహ్మద్ ఇస్మాయిల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. -
చోటా రాజన్‌కు ఏడేళ్ల జైలు
న్యూఢిల్లీ: నకిలీ పాస్‌పోర్టు కేసులో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌కు మంగళవారం శిక్ష ఖరారైంది. రాజన్‌తో పాటు మరో ముగ్గురికి సీబీఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు 15 వేల జరిమానా కూడా విధించింది. రాజన్‌తో పాటు దీనికి సహకరించిన ముగ్గురు రిటైర్డ్ అధికారులు జయశ్రీ దత్తాత్రేయ రహతే, దీప్ నట్వర్ లాల్షా, లలితా లక్ష్మణన్‌ను ప్రత్యేక కోర్టు జడ్జి వీరేందర్ కుమార్ గోయల్ దోషులుగా నిర్ధారిస్తూ పై శిక్షనే ఖరారు చేశారు. రాజన్ తీహార్ జైలులో ఉండగా, బెయిల్ పై బయట ఉన్న మిగతా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. ‘దావూద్‌ను పట్టుకోవడానికి, ఉగ్ర వాదాన్ని అణచివేసేందుకు కృషి చేస్తున్న నిఘా సంస్థలకు సాయం చేశా’ అని రాజన్ కోర్టుకు విన్నవించాడు. రాజన్ చెప్పిన ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పింది. -
నకిలీ పాస్‌పోర్టు ముఠా అరెస్ట్
కేకే.నగర్: నకిలీ పాస్‌పోర్టు, వీసాలను తయారు చేసి దాని ద్వారా శ్రీలంక తమిళులను విదేశాలకు పంపిన శ్రీలంకకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నకిలీ పాస్‌పోర్టులు, దాన్ని తయారు చేసే కంప్యూటర్‌తో సహా కొన్ని పరికరాలను, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కొందరు నకిలీ పాస్‌పోర్టు, వీసాలను తయారు చేస్తున్నారని పోలీసులకు రహస్య సమాచారం అందింది. నిందితులను అరెస్టు చేయాలని పోలీసు కమిషనర్ టి.కె.రాజేంద్రన్, కేంద్ర క్రైం బ్రాంచ్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కేంద్ర నేర విభాగ అదనపు పోలీసు కమిషనర్ అరుణాచలం నేతృత్వంలో ప్రత్యేక బృందం పోలీసులు చెన్నైలోని పలు ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. ఆ సమయంలో తిరుముల్లైవాయల్ సమీపంలోని వైష్ణవి నగర్లో కొందరు తలదాచుకున్నట్లు సమాచారం తెలుసుకున్నారు. దీంతో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని జరిపిన విచారణలో కొళత్తూరుకు చెందిన నాగూర్ మీరాన్ (46) వద్ద తొమ్మిది నకిలీ పాస్‌పోర్టులు పట్టుబడ్డాయి. వాటిని తిరుముల్లైవాయల్‌లోని గుణ నాయకం (64), సౌరిముత్తు (60)కు ఇవ్వడానికి వెళుతున్నట్లు తెలియడంతో వారిద్దరిని గత మే నెలలో పోలీసులు అరెస్టు చేశారు. వారు ఇచ్చిన వివరాల మేరకు ప్రదాన నిందితులైన మూర్తి అలియాస్ కృష్ణమూర్తి (66), మురళీధరన్, రాజన్‌లను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో వీరు నకిలీ పాస్‌పోర్టులను, వీసాలను తయారు చేసి శ్రీలంకకు చెందిన వారిని విదేశాలకు పంపిస్తున్నారని తెలిసింది. కాలం చెల్లిన, నిరుపయోగమైన పాస్‌పోర్టులను మూడువేలకు కొని వాటి లామినేషన్ను తీసేసి పాస్‌పోర్టు కావాలని కోరిన వారి ఫొటోలను అతికించి నకిలీ పాస్‌పోర్టు తయారు చేస్తున్నట్లు తెలిసింది. వీటిని రూ. 30 వేల నుంచి రూ.5 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. గతంలో కూడా వీరిపై కేసు నమోదైనట్లు గుర్తించారు. బుధవారం నిందితుల నుంచి 28 నకిలీ పాస్‌పోర్టులను, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని జైలుకు తరలించారు. -
నకిలీ పాస్‌పోర్ట్ తో విదేశాలకు వెళ్తుంటే..
యాకుత్‌పురా: నకిలీ పాస్పోర్టుతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఓ మహిళను భవానీనగర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్టయిన ముంతాజ్ బేగం లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ సభ్యుడు పాకిస్థాన్‌కు చెందిన సిద్ధిఖ్ బిన్ ఉస్మాన్ బంధువు. ఎస్సై కె.ప్రసాద్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్‌కట్టా మురాద్‌మహల్ ప్రాంతానికి చెందిన ముంతాజ్ బేగం (47) భర్త అబేద్ బిన్ ఉస్మాన్ జాబ్రీ మతి చెందడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. కుమారుడు సల్మాన్ (25) సౌదీలో ఉంటున్నాడు. కాగా ముంతాజ్ బేగం భర్త అబేద్ బిన్ ఉస్మాన్ జాబ్రీ గతంలో గాలేభ్ హుస్సేన్ మారు పేరుతో పాస్‌పోర్టు పొంది విదేశాలకు వెళ్లి అక్కడ డ్రై వర్గా పని చేస్తూ రోడ్డు ప్రమాదంలో మతి చెందాడు. కాగా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో పని చేసే పాకిస్థాన్‌కు చెందిన బంధువు సిద్దిఖీ బిన్ ఉస్మాన్ కారణంగా ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా ఉండటంతో మారు పేరుతో పాస్‌పోర్టు పొందేందుకు ముంతాజ్ బేగం సిద్ధమైంది. విదేశాల్లో ఉండే కుమారుడు సల్మాన్ వద్దకు వెళ్లేందుకు ముంతాజ్ బేగం తన భర్త మారు పేరు గాలే భ్ హుస్సేన్ పేరును మొదటి భర్తగా మార్చింది. మొదటి భర్త గాలేభ్ హుస్సేన్‌కు విడాకులు ఇచ్చి ఆబేద్ బిన్ ఉస్మాన్ జాబ్రీని పెళ్లి చేసుకున్నానని పత్రాలను సష్టించింది. అబేద్ బిన్ ఉస్మాన్ జాబ్రీని రెండో భర్తగా చిత్రీకరించి నకిలీ పాస్‌పోర్టును పొందింది. నిబంధనలకు విరుద్ధంగా నకిలీ పాస్‌పోర్టు పొంది విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమైన ముంతాజ్ బేగంను పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
నకిలీ పాస్‌పోర్టు: వ్యక్తి అరెస్ట్
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి వద్ద నకిలీ పాస్‌పోర్ట్ గుర్తించిన అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నగరానికి చెందిన మహ్మద్ అజహర్ హుస్సేన్ అనే వ్యక్తి గత రెండేళ్లుగా నకిలీ పాస్‌పోర్టు రాకపోకలు సాగిస్తున్నట్టు గుర్తించిన అధికారులు అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. -
ముంబై డాన్‌కు కర్ణాటకలో పాస్‌పోర్టు!
మాఫియా డాన్ ఛోటా రాజన్‌కు మోహన్ కుమార్ అనే పేరుతో నకిలీ పాస్‌పోర్టు ఉండటం వల్లే అతడు పట్టుబడ్డాడు. అయితే ఆ పాస్‌పోర్టులో అతడి చిరునామా, పుట్టిన స్థలం మాత్రం ఎక్కడున్నాయో తెలుసా.. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో! ఇదెలా సాధ్యమయ్యిందో తెలియక పోలీసులు తల పట్టుకుంటున్నారు. ఇండోనేషియాలోని బాలిలో అరెస్టయిన ఛోటా రాజన్.. పి. మోహన్ కుమార్ అనే పేరుతో పాస్‌పోర్టు తీసుకున్నాడు. అందులో అతడి చిరునామా ఓల్డ్ ఎంసీ రోడ్, ఆజాద్ నగర్, మాండ్యా అని ఉంది. పాస్‌పోర్టు నంబరు జి9273860. ఇది 2008లో జారీ అయ్యింది. తాను మాండ్యాలోనే పుట్టినట్లు కూడా అందులో ఉంది. ఈ పాస్‌పోర్టు ఉపయోగించి ఎక్కువగా ఆస్ట్రేలియా, ఆఫ్రికాల మధ్య ఛోటా రాజన్ తిరిగాడు. ఛోటారాజన్ నకిలీ పాస్పోర్టుతో తిరుగుతున్నట్లు అందరూ చెబుతున్నా, మాండ్యా పోలీసులు మాత్రం అబ్బే కాదంటున్నారు. నిజంగానే అక్కడ ఒక పాత ఎంసీ రోడ్డు, ఆజాద్ నగర్ ఉన్నాయి. దాంతో పోలీసులతో కుమ్మక్కు కావడం వల్లే ఈ పాస్‌పోర్టు సంపాదించగలిగాడా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మాండ్యా వెస్ట్ పోలీసు స్టేషన్ పరిధిలోకి రాజన్ ఇచ్చిన చిరునామా వస్తుంది. కానీ అక్కడ మోహన్ కుమార్ అనే పేరుతో ఎవరూ లేరని స్పష్టమైంది. ఈ ఆధారాలతో రాజన్ మీద మొదటి కేసును డీల్ చేయాలని సీబీఐ వర్గాలు భావిస్తున్నాయి. -
చెన్నై విమానాశ్రయంలో ఇద్దరి అరెస్ట్
తిరువొత్తియూరు (చెన్నై): నకిలీ పాస్పోర్టుతో విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం తెల్లవారుజామున దుబాయ్‌కు వెళ్లేందుకు ఓ విమానం సిద్ధంగా ఉంది. అందులో ప్రయాణించుటకు వచ్చిన ప్రయాణికులను పాస్‌పోర్టు తనిఖీ అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో అరందాంగికి చెందిన మహ్మద్ కలింజియం అనే వ్యక్తికి చెందిన పాస్‌పోర్టును తనిఖీ చేయగా అది నకిలీదని తేలింది. దీంతో అతన్ని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. అలాగే ఇక్కడ్నుంచి శనివారం రాత్రి శ్రీలంకకు వెళ్లే విమానంలో ప్రయాణించుటకు వచ్చిన వారిలో చెన్నై ఆలపాక్కంకు చెందిన దేనిష్ (26) అనే యువకుని పాస్‌పోర్టు నకిలీదని తెలిసింది. దీంతో అతన్ని కూడా ఎయిర్‌పోర్టు పోలీసులు అరెస్టు చేశారు. -
నకిలీ పాస్‌పోర్టు కేసులో ఇద్దరి అరెస్టు
నిజామాబాద్ క్రైం: పోలీసులనే బురిడి కొట్టించి తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టి నకిలీ పాస్‌పోర్టు పొం దిన వ్యక్తిని, ఇతనికి సహకరించిన పోలీస్‌శాఖలో పనిచేసే హోంగార్డును గురువారం నాల్గవ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. ఆదిలాబాద్ జిల్లా జన్నారంకు చెందిన యాకుబ్‌కు పాస్‌పోర్టు అవసరం ఉండటంతో అసలు ధృవీకరణ పత్రాలకు బదులు నకిలీ ధృవీకరణ పత్రాలు పెట్టాడు. పైగా ఇతను జన్నారం చిరునామాతో కాకుండా నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం గౌరరం గ్రామానికి చెందిన వ్యక్తిగా ధర్పల్లి మండల కార్యాలయం నుంచి నివాస ధృవీకరణ ప్రతాలు పొందాడు. వాటితో పాస్‌పోర్టు కోసం గత నెల మొదటి వారంలో స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) పోలీసులకు దరఖాస్తు చేసుకున్నాడు. దానిని ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ అజ్మత్ పరిశీలించవలసి ఉండగా అజ్మత్ ఎన్ఓసీ(నో అబ్జక్షన్ సర్టిఫికెట్) ఇవ్వకుండానే పాస్‌పోర్టుకు పెట్టుకున్న దరఖాస్తులు పరిశీలించటం, యాకుబ్‌కు పాస్‌పోర్టు మంజూరు కావటం జరిగింది. తనకు కేటాయించిన ప్రాంతంలోని వ్యక్తికి పాస్‌పోర్టు మంజూరు కావటంపై అజ్మత్ ఆశ్చర్య పోయాడు. దీంతో వెంటనే విషయాన్ని రేంజ్ డీఐజీ సూర్యనారాయణకు ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి యాకుబ్‌కు పాస్‌పోర్టు మం జూరు చేశారని, దీనిపై విచారణ జరిపించాలని కోరారు. అజ్మత్ ఫిర్యాదు మేరకు డీఐజీ పాస్‌పోర్టు మంజూరుపై విచారణ చేపట్టాలని అప్పటి జిల్లా ఎస్పీ తరుణ్జోషిని ఆదేశించారు. ఎస్పీ ఆదేశాలతో ఎస్బీ పోలీసులు రంగంలోకి దిగా రు. యాకుబ్ పాస్‌పోర్టు కోసం ఎక్కడి నుంచి తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందుకో సం ఎవరి సహాయాన్ని పొందాడో వివరాలు సేకరించారు. హోంగార్డు హస్తం.. జన్నారం మండలానికి చెందిన యాకుబ్‌కు పాస్‌పోర్టు ఇప్పించేందుకు పోలీస్‌శాఖలో పనిచేసే హోంగార్డు దేవేందర్ హస్తం ఉందని తేలంటం తో పోలీసులు నివ్వెరపోయారు. దీంతో హోంగార్డును నాల్గవ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చూపారు. యాకుబ్‌కు పాస్‌పోర్టు ఇప్పించేందుకు హోంగార్డు మొదటి నుంచి సహకరిస్తూ వచ్చాడు. పాస్‌పోర్టు పొందటానికి ఎటువంటి పత్రాలు కావాలి, ఎవరి సహకారం తీసుకోవాలి, ఎక్కడ వాటిని ఇవ్వాలో పూర్తిగా సహకరించాడని నాల్గవ టౌన్ రెండవ ఎస్సై రామానాయుడు తెలిపారు. అజ్మత్ డీఐజీకి ఇచ్చిన ఫిర్యాదుతో నకిలీ పాస్‌పోర్టు విషయం వెలుగు చూసిం ది. విచారణ చేపట్టిన ఎస్బీ పోలీసులు నకిలీ పాస్‌పోర్టు సూత్రధారి యాకుబ్, అతనికి సహకరించిన హోంగార్డును అరెస్టు చేశారు. ఎస్బీ సిబ్బంది పాత్రపై ఆరా.. తప్పుడు ధృవీకరణ పత్రాలు పొంది పాస్‌పోర్టు కోసం దరఖాస్తు పెట్టుకున్న యాకుబ్‌కు ఎస్బీలో ఇంకా ఎవరైన సహకారం అందిచారా అనే విషయంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ వ్యవహరం ఒక్క హోంగార్డుతో సాధ్యం కాద ని, ఎస్బీలో పని చేసే సిబ్బందిలో ఎవరినైన ప్ర లోభాలకు పెట్టి నకిలీ పాస్‌పోర్టు మంజూరు చేయించారా అనేది పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
నైజీరియా దేశస్తుడికి ఎనిమిది నెలల జైలు
గాజువాక, న్యూస్‌లైన్ : లాటరీలో కోట్ల రూపాయలు వచ్చాయని యువతిని నమ్మించి డబ్బులు వసూలు చేసిన నైజీరియా దేశస్తుడికి ఎనిమిది నెలల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.500 అపరాధ రుసుం విధిస్తూ మూడో అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పి.దత్తాత్రేయులు సోమవారం తీర్పు చెప్పారు. మిలియన్ పౌండ్లు లాటరీలో వచ్చాయని 47వ వార్డు ములగాడ హౌసింగ్‌కాలనీకి చెందిన ఎమ్మెస్సీ విద్యార్థిని లండా రమాదేవికి నైజీరియాకు చెందిన ఫ్రిడో అంబ్రోస్ గత ఏడాది మేలో సెల్‌ఫోన్ ద్వారా సమాచారం పంపించాడు. ఆమె వారిని ఫోన్లో సంప్రదించగా ఆ డబ్బును విడుదల చేయడం కోసం రూ.21 వేలు అవసరమని అకౌంట్ నంబర్ ద్వారా వసూలు చేశాడు. లాటరీ డబ్బు అధిక మొత్తంలో ఉందని దాన్ని ఇండియన్ కరెన్సీకి మార్చడం కోసం అదనంగా రూ.2.10 లక్షలు చెల్లించాలని మరో అకౌంట్ నంబర్ ఇచ్చాడు. ఆమె అదే రోజు రూ.50 వేలు, మరుసటిరోజు రూ.1.60 లక్షలు వేరొక అకౌంట్ నంబర్‌కు పంపింది. మళ్లీ రూ.9 లక్షలు చెల్లించాలని యువతికి ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు. విసుగెత్తిన యువతి తనకు లాటరీ సొమ్ము వద్దని, తాను చెల్లించిన సొమ్మును తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలంటే కొంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుందని తేల్చి చెప్పాడు. తాను బ్యాంకుకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నానని, ఇంటికి వస్తే డబ్బు ఇస్తానని చెప్పడంతో అతడు జూన్ 12న ఇంటికి వచ్చాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న కుటుంబ సభ్యులు అతడిని బంధించి గాజువాక పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. కేసును సైబర్ క్రైమ్ సీఐ వెంకటేశ్వరరావు విచారించగా, నకిలీ పాస్‌పోర్టుపై అతడు భారత్‌కు వచ్చినట్టు నిర్ధారించారు. ప్రాసిక్యూషన్ వాదనలు అనంతరం నిందితునికి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మైలపల్లి ఆదినారాయణ కేసు వాదించారు. -
నకిలీ పాస్పోర్టుతో కేరళవాసి అరెస్టు
శంషాబాద్: నకిలీ పాస్పోర్టుతో మస్కట్ నుంచి వచ్చిన ఓ కేరళవాసిని ఆర్జీఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కేరళ రాష్ట్రానికి చెందిన ఇషాక్ మహమూద్(27) కొన్నేళ్ల కిందట ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ యజమాని పాస్‌పోర్టు తీసుకోవడంతో నకిలీపాస్ పోర్టుతో మస్కట్ వెళ్లాడు. గురువారం సాయంత్రం మణికంఠ పేరుతో ఉన్న నకిలీ పాస్పోర్టుతో హైదరాబాద్ వచ్చిన అతడిని ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించి ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అలర్ట్
సాక్షి, చెన్నై:రాష్ట్ర రాజధాని నగరం చెన్నై తీవ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్న దృష్ట్యా, పోలీసు యంత్రాంగం అప్రమత్తంగానే వ్యవహరిస్తూ వస్తోంది. కేంద్రం నుంచి, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చే సమాచారంతో ఎప్పటికప్పుడు నిఘాను అప్రమత్తం చేస్తున్నారు. అయితే, ఇటీవల రాష్ట్రంలో వెలుగు చూస్తున్న పరిణామాలు భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. బెంగళూరు బాంబు పేలుళ్ల కేసు రాష్ట్రం చుట్టూ తిరగడం, అజ్ఞాత తీవ్రవాదులు పట్టుబడడంతో చాప కింద నీరులా సంఘ విద్రోహ శక్తులు కార్యకలాపాలు సాగిస్తున్నాయూ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నయి. మరో తీవ్రవాది అబుబక్కర్ సిద్ధిక్ జాడ ఇంత వరకు కానరాలేదు. విదేశాల నుంచి నకిలీ వీసాలతో, నకిలీ పాస్ పోర్టులతో చెన్నైకు వచ్చి పట్టుబడుతున్న వారి సంఖ్య, బ్లాక్ మనీ, బంగారం స్మగ్లింగ్ పెరుగుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవల నేపాల్‌లో పట్టుబడిన ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్ర వాది యాసిన్ భత్కల్ చెన్నైలో రెక్కీ నిర్వహించినట్టుగా గతంలో ప్రచారం సాగింది. ఈ పరిస్థితుల్లో తాజాగా అదే తీవ్రవాది విడుదలకు డిమాండ్ చేస్తూ విమానాల హైజాక్‌కు ముష్కరులు కుట్ర చేసినట్టుగా ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తూ కేంద్రం ఆదేశించింది. నిఘా నీడలో: రాష్ట్రంలోని చెన్నై మీనంబాక్కం విమానాశ్రయం అతి పెద్దది. ఇటీవలే సరికొత్త హంగులతో ఈ విమానాశ్రయం రూపు రేఖల్ని మార్చారు. జాతీయ, అంతర్జాతీయ విమానాలకు వేదికగా ఉన్న ఇక్కడ భద్రత ఎప్పుడూ కట్టుదిట్టంగానే ఉంటుంది. అయితే, కేంద్రం నుంచి ఏదేని హెచ్చరికలు వచ్చిన పక్షంలో మాత్రం నిఘాను మరింత పెంచుతుంటారు. ఆ దిశగా విమానాశ్రయం పరిసరాల్ని నిఘా నీడలోకి తెచ్చారు. అక్కడి నిఘా నేత్రాల ద్వారా కంట్రోల్ రూంల నుంచి ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తూ వస్తున్నారు. కేంద్ర ఆయుధ బలగాలు, రాష్ట్ర పోలీసులు తనిఖీల్లో నిమగ్నం అయ్యాయి. ప్రతి విమానాన్ని, ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. విమానాశ్రయంలోకి వచ్చే వాహనాలకు ఆంక్షలు విధించారు. తనిఖీల అనంతరం లోనికి అనుమతిస్తున్నారు. సందర్శకుల అనుమతికి ఈనెలాఖరు వరకు బ్రేక్ వేశారు. చెన్నై మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటుగా, మదురై, తిరుచ్చి, కోయంబత్తూర్, తూత్తుకుడి, సేలం విమానాశ్రయాల్లోను భద్రతను కట్టుదిట్టం చేశారు.