
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ఓ వైపు దేశంలోకి జైషే మహమ్మద్ ఉగ్రవాదులు చొరబడ్డారన్న వార్తలు కలకలం సృష్టిస్తుండగా.. భాగ్య నగరంలో వెలుగు చూసిన మరో ఘటన సంచలనం రేపుతోంది. నకిలీ ధ్రువపత్రాలతో పాస్‌పోర్టు పొంది, నగరంలో తలదాచుకుంటున్న ఓ పాకిస్తానీని శుక్రవారం పోలీసులకు పట్టుకున్నారు.
పాకిస్తాన్‌కు చెందిన మహమ్మద్ ఉస్మాన్ ఇక్రాన్ అనే వ్యక్తి నకిలీ పత్రాలతో ఇండియన్ పాస్‌పోర్టు పొందాడని హైదారాబాద్ సైబర్ క్రైం పోలీసులు వెల్లడించారు. ఇక్రాన్ భార్య ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన పోలీసులు ఘటనకు సంబంధించి లోతైన విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.