సాక్షి, హైదరాబాద్ : నకిలీ పత్రాలతో పాకిస్తాన్ పౌరుడు మమ్మద్ ఉస్మాన్ ఇక్రాన్ భారతీయ పాస్ పోర్టు పొందాడు. దీనికి కారణమైన ముఠాను శనివారం హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మాన్ ఇక్రాన్ దుబాయ్‌లో పని చేసే సమయంలో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. ఆ మహిళ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి వచ్చింది. అతను అక్కడి నుంచి సరిహద్దులు దాటి నగరానికి వచ్చాడు.
అక్కడ పరిచయమైన మహిళతో అతను సహజీవనం చేస్తున్నాడు. ఆమెకు 12 సంవత్సరాల కూతురు ఉంది. గత కొద్ది రోజులుగా ఉస్మాన్ ఆ బాలికను వేధిస్తున్నాడని సమాచారం. దీంతో ఆమె ఉస్మాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ, ఆ మహిళతో అతను దుబాయ్ పౌరుడినని చెప్పాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులకు ఉస్మాన్ పాకిస్తానీ అని తెలిసింది. ఆరు మాసాలుగా అతను నగరంలో ఉంటూ స్థానికుడికి అవసరమైన పలు ధ్రువీకరణ పత్రాలు సంపాదించాడు.
అంతేకాక ఆ పత్రాలతోనే పాస్ పోర్టు పొందాడు. దీనిపై సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. నకిలీ పత్రాలు తయారు చేస్తున్న కరీంగనర్ జిల్లాకు చెందిన మసూద్ హైమద్ అనుతో పాటు అతని సహకరిస్తున్న కాజా, మరో వ్యక్తిని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో సైబర్ క్రైం పోలీసులు హాజరుపరిచారు. వేలమందికి నకిలీ సర్టిఫికెట్లను ఇచ్చినట్లు విచారణలో మసూద్ ఒప్పుకున్నాడు. నిందితుల నుంచి భారీగా నకిలీ డాక్యుమెంట్లను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment