మయన్మార్ దేశస్తుడి అరెస్ట్
Published Tue, Sep 12 2017 4:38 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పరిధిలో నకిలీ పాస్‌పోర్టుతో నివాసం ఉంటున్నమయన్మార్ దేశీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మయాన్మార్‌కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ పదేళ్ల క్రితం నకిలీ పాస్‌పోర్టుతో అక్రమంగా భారతదేశంలో ప్రవేశించాడు. మొదట కోల్‌కతా వచ్చి అక్కడ నకిలీ బర్త్ సర్టిఫికెట్ తీసుకొని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లాడు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుని పహాడీ షరీఫ్‌లో స్థిరపడ్డాడు. అక్కడే ఇంతకాలం ఉంటూ నకిలీ పత్రాల సాయంతో ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు తీసుకున్నాడు.
వాటిని ఉపయోగించుకుని ఇక్కడి నుంచి పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకోవాలని యత్నిస్తున్నాడు. ఇది తెలుసుకున్న పోలీసులు అతడిని పట్టుకున్నారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన కొందరు తీవ్రవాదం వైపు మళ్లుతున్నారని, ఇలాంటివి జరగకుండా నిఘా ఉంచామని వివరించారు. మహ్మద్ ఇస్మాయిల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు.
Advertisement