యాకుత్‌పురా: నకిలీ పాస్‌పోర్టుతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఓ మహిళను భవానీనగర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్టయిన ముంతాజ్ బేగం లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ సభ్యుడు పాకిస్థాన్‌కు చెందిన సిద్ధిఖ్ బిన్ ఉస్మాన్ బంధువు. ఎస్సై కె.ప్రసాద్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్‌కట్టా మురాద్‌మహల్ ప్రాంతానికి చెందిన ముంతాజ్ బేగం (47) భర్త అబేద్ బిన్ ఉస్మాన్ జాబ్రీ మతి చెందడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. కుమారుడు సల్మాన్ (25) సౌదీలో ఉంటున్నాడు. కాగా ముంతాజ్ బేగం భర్త అబేద్ బిన్ ఉస్మాన్ జాబ్రీ గతంలో గాలేభ్ హుస్సేన్ మారు పేరుతో పాస్‌పోర్టు పొంది విదేశాలకు వెళ్లి అక్కడ డ్రై వర్‌గా పని చేస్తూ రోడ్డు ప్రమాదంలో మతి చెందాడు.
కాగా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో పని చేసే పాకిస్థాన్‌కు చెందిన బంధువు సిద్దిఖీ బిన్ ఉస్మాన్ కారణంగా ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా ఉండటంతో మారు పేరుతో పాస్‌పోర్టు పొందేందుకు ముంతాజ్ బేగం సిద్ధమైంది. విదేశాల్లో ఉండే కుమారుడు సల్మాన్ వద్దకు వెళ్లేందుకు ముంతాజ్ బేగం తన భర్త మారు పేరు గాలే భ్ హుస్సేన్ పేరును మొదటి భర్తగా మార్చింది. మొదటి భర్త గాలేభ్ హుస్సేన్‌కు విడాకులు ఇచ్చి ఆబేద్ బిన్ ఉస్మాన్ జాబ్రీని పెళ్లి చేసుకున్నానని పత్రాలను సష్టించింది. అబేద్ బిన్ ఉస్మాన్ జాబ్రీని రెండో భర్తగా చిత్రీకరించి నకిలీ పాస్‌పోర్టును పొందింది. నిబంధనలకు విరుద్ధంగా నకిలీ పాస్‌పోర్టు పొంది విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమైన ముంతాజ్ బేగంను పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
నకిలీ పాస్‌పోర్ట్ తో విదేశాలకు వెళ్తుంటే..
Published Mon, May 30 2016 10:38 PM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM
Advertisement
Advertisement