నిజామాబాద్ క్రైం: పోలీసులనే బురిడి కొట్టించి తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టి నకిలీ పాస్‌పోర్టు పొం దిన వ్యక్తిని, ఇతనికి సహకరించిన పోలీస్‌శాఖలో పనిచేసే హోంగార్డును గురువారం నాల్గవ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. ఆదిలాబాద్ జిల్లా జన్నారంకు చెందిన యాకుబ్‌కు పాస్‌పోర్టు అవసరం ఉండటంతో అసలు ధృవీకరణ పత్రాలకు బదులు నకిలీ ధృవీకరణ పత్రాలు పెట్టాడు.
పైగా ఇతను జన్నారం చిరునామాతో కాకుండా నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం గౌరరం గ్రామానికి చెందిన వ్యక్తిగా ధర్పల్లి మండల కార్యాలయం నుంచి నివాస ధృవీకరణ ప్రతాలు పొందాడు. వాటితో పాస్‌పోర్టు కోసం గత నెల మొదటి వారంలో స్పెషల్ బ్రాంచ్(ఎస్‌బీ) పోలీసులకు దరఖాస్తు చేసుకున్నాడు. దానిని ఎస్‌బీ హెడ్ కానిస్టేబుల్ అజ్మత్ పరిశీలించవలసి ఉండగా అజ్మత్ ఎన్‌ఓసీ(నో అబ్జక్షన్ సర్టిఫికెట్) ఇవ్వకుండానే పాస్‌పోర్టుకు పెట్టుకున్న దరఖాస్తులు పరిశీలించటం, యాకుబ్‌కు పాస్‌పోర్టు మంజూరు కావటం జరిగింది. తనకు కేటాయించిన ప్రాంతంలోని వ్యక్తికి పాస్‌పోర్టు మంజూరు కావటంపై అజ్మత్ ఆశ్చర్య పోయాడు.
దీంతో వెంటనే విషయాన్ని రేంజ్ డీఐజీ సూర్యనారాయణకు ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి యాకుబ్‌కు పాస్‌పోర్టు మం జూరు చేశారని, దీనిపై విచారణ జరిపించాలని కోరారు. అజ్మత్ ఫిర్యాదు మేరకు డీఐజీ పాస్‌పోర్టు మంజూరుపై విచారణ చేపట్టాలని అప్పటి జిల్లా ఎస్పీ తరుణ్‌జోషిని ఆదేశించారు. ఎస్పీ ఆదేశాలతో ఎస్‌బీ పోలీసులు రంగంలోకి దిగా రు. యాకుబ్ పాస్‌పోర్టు కోసం ఎక్కడి నుంచి తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందుకో సం ఎవరి సహాయాన్ని పొందాడో వివరాలు సేకరించారు.
హోంగార్డు హస్తం..
జన్నారం మండలానికి చెందిన యాకుబ్‌కు పాస్‌పోర్టు ఇప్పించేందుకు పోలీస్‌శాఖలో పనిచేసే హోంగార్డు దేవేందర్ హస్తం ఉందని తేలంటం తో పోలీసులు నివ్వెరపోయారు. దీంతో హోంగార్డును నాల్గవ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చూపారు. యాకుబ్‌కు పాస్‌పోర్టు ఇప్పించేందుకు హోంగార్డు మొదటి నుంచి సహకరిస్తూ వచ్చాడు. పాస్‌పోర్టు పొందటానికి ఎటువంటి పత్రాలు కావాలి, ఎవరి సహకారం తీసుకోవాలి, ఎక్కడ వాటిని ఇవ్వాలో పూర్తిగా సహకరించాడని నాల్గవ టౌన్ రెండవ ఎస్సై రామానాయుడు తెలిపారు. అజ్మత్ డీఐజీకి ఇచ్చిన ఫిర్యాదుతో నకిలీ పాస్‌పోర్టు విషయం వెలుగు చూసిం ది. విచారణ చేపట్టిన ఎస్‌బీ పోలీసులు నకిలీ పాస్‌పోర్టు సూత్రధారి యాకుబ్, అతనికి సహకరించిన హోంగార్డును అరెస్టు చేశారు.
ఎస్‌బీ సిబ్బంది పాత్రపై ఆరా..
తప్పుడు ధృవీకరణ పత్రాలు పొంది పాస్‌పోర్టు కోసం దరఖాస్తు పెట్టుకున్న యాకుబ్‌కు ఎస్‌బీలో ఇంకా ఎవరైన సహకారం అందిచారా అనే విషయంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ వ్యవహరం ఒక్క హోంగార్డుతో సాధ్యం కాద ని, ఎస్‌బీలో పని చేసే సిబ్బందిలో ఎవరినైన ప్ర లోభాలకు పెట్టి నకిలీ పాస్‌పోర్టు మంజూరు చేయించారా అనేది పోలీసులు విచారణ జరుపుతున్నారు.
నకిలీ పాస్‌పోర్టు కేసులో ఇద్దరి అరెస్టు
Published Fri, Oct 10 2014 1:52 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement