పాఠ్యాంశాల్లో మార్పునకు ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్ణయం
ఢాకా: బంగ్లాదేశ్‌లోని యూనుస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. ఆమె తండ్రి, బంగబంధు ముజిబుర్ రహా్మన్‌కు ప్రాధాన్యం తగ్గిస్తూ పాఠ్యాంశాలను మార్చాలని నిర్ణయించింది. పాఠ్యాంశాల్లో చారిత్రక ఘటనలను అతిగా చూపడం, కొందరు వ్యక్తులను అనవసరంగా కీర్తించడం వంటి వాటిని పూర్తిగా తొలగించనుంది.
వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఒకటి నుంచి పదో తరగతి వరకు కొత్త సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించనుంది. దీని ప్రకారం.. 1971లో బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రాన్ని ప్రకటించింది బంగబంధుగా పిలిచే షేక్ ముజిబుర్ రహా్మన్ కాదు..జియా ఉర్ రహా్మన్ అని ఉంటుంది. ఆ సమయంలో బంగ్లాదేశ్ మిలటరీ అధికారిగా జియా పనిచేస్తున్నారు. అనంతర కాలంలో బంగ్లా ఆరో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
బంగ్లాదేశ్ విముక్తిని ప్రకటించింది ముజీబుర్ రహా్మన్ కాగా, ఆయన ఆదేశాల మేరకు జియా ఉర్ రహా్మన్ ఆ ప్రకటనను చదివారనేది అవామీ లీగ్ మద్దతుదారుల వాదన. అయితే, జియా ఉర్ రహా్మనే స్వయంగా స్వతంత్ర ప్రకటనను తయారు చేసి, ప్రకటించారన్నది బీఎన్‌పీ వాదన. బీఎన్‌పీ చీఫ్‌గా మాజీ ప్రధాని ఖలేదా జియా ఉన్నారు. పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా ముజీబ్ కుమార్తె కాగా ఖలేదా జియా కుమార్తె.
👉చదవండి : చిన్మయ్ కృష్ణదాస్‌కు నో బెయిల్
Comments
Please login to add a commentAdd a comment