షకీబ్ అల్ హసన్.. ఈ పేరు గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ క్రికెట్ సమకాలీన క్రికెట్లో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌లలో ఒకడిగా కొనసాగతున్న షకీబ్.. నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంటాడు. ఈ బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ మరోసారి తన దురుసు ప్రవర్తన కారణంగా వార్తల్లో నిలిచాడు.
జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు దూరంగా ఉంటున్న షకీబ్.. ప్రస్తుతం దేశవాళీ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో మ్యాచ్ ఆరంభానికి ముందు షకీబ్ మైదానంలో ఉండగా.. గ్రౌండ్ స్టాప్ ఒకరు అతడి దగ్గరకు వచ్చి సెల్పీ అడిగాడు.
దానికే చిరెత్తుకుపోయిన షకీబ్ అతడిని కొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆ గ్రౌండ్స్‌మన్ బాధపడుతూ పక్కకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది చూసిన నెటిజన్లు షకీబ్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరి అంత పొగరు పనికిరాదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతుకుముందు చాలా సందర్భాల్లో అభిమానులపై షకీబ్ చేయిచేసుకున్నాడు కూడా.
Shakib… when a groundsman tried tontake a selfie with him 🤨 pic.twitter.com/BWbDX4LAsK
— Nibraz Ramzan (@nibraz88cricket) May 7, 2024
Comments
Please login to add a commentAdd a comment