ఎన్నారై మహిళ కాల్చివేత | Indian-Origin Woman Shot dead, Critical After Attempted Robbery in US | Sakshi
Sakshi News home page

ఎన్నారై మహిళ కాల్చివేత

Published Sun, May 3 2015 1:30 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

ఎన్నారై మహిళ కాల్చివేత - Sakshi

ఎన్నారై మహిళ కాల్చివేత

న్యూయార్క్: భారత సంతతికి చెందిన గుజరాత్ మహిళ ఒకరు అమెరికాలో దుండగుడి చేతిలో కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయింది. ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సహాయజమానిగా, క్లెర్క్ గా పనిచేస్తున్న మృదులాబెన్ పటేల్ అనే మహిళపై దొంగతనానికి పాల్పడిన ఓ సాయుధుడు కాల్పులు జరపడంతో ఆమె ముఖంపై తీవ్ర గాయమై తొలుత పరిస్థితి విషమంగా మారింది. ఫాక్స్ కరోలినాలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఆమెకు ఒక శస్త్ర చికిత్స చేసిన వైద్యులు పరిశీలనలో పెట్టారు. కానీ, ఆమె తీవ్ర గాయంవల్ల ఆదివారం ప్రాణాలు కోల్పోయింది.

కాల్పులు జరిపిన వ్యక్తి ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడో తెలియదని ఆమె స్నేహితుడు ఒకరు చెప్పారు. పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా అనుమానాస్పదంగా అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి సిగరెట్స్ ఇవ్వమని చెప్పి ఆ వెంటనే కాల్పులు జరిపాడు. అనంతరం ఎలాంటి దొంగతనానికి పాల్పడకుండా వెళ్లిపోయాడు. ఉద్దేశ పూర్వకంగానే అగంతకుడు ఈ దారుణానికి పాల్పడి ఉంటాడా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించగా.. ఆమెకు శత్రువులు ఎవరూ లేరని స్నేహితుడు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement