
ప్రీతి పాటిల్‌కు కేబినెట్ హోదా
లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి కామెరాన్ కేబినెట్‌లో మంత్రిగా ప్రవాస భారతీయురాలు ప్రీతి పాటిల్(43) నియమితులయ్యారు. గత మే 7న జరిగిన ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ ఘనవిజయం సాధించి కామెరాన్ మళ్లీ ప్రధాని పగ్గాలు చేపట్టిన విషయం విదితమే. ఇదే ఎన్నికల్లో పలువురు ప్రవాస భారతీయులు విజయం సాధించారు. వీరిలో ఒకరైన ప్రీతి పాటిల్ ఉపాధి కల్పనా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సహాయ మంత్రి అయిన ఈమెకు కేబినెట్ హోదా కల్పించారు. గత కేబినెట్‌లో ఇదే శాఖను నిర్వహించిన ఎస్తేర్ ఈ ఎన్నికల్లో ఓడిపోయింది.
ఎస్సెక్స్‌లోని విథం నుంచి ప్రీతి భారీ మెజారిటీతో రెండోసారి విజయం సాధించింది. తన నియామకం విషయాన్ని ఆమె ట్విటర్‌లో పోస్టు చేశారు.