భారత సంతతికి చెందిన ఓ మహిళ అత్యంత సాహసం చేసింది. మంటల్లో చిక్కుకున్న తల్లిదండ్రులను తన ప్రాణాలు పణంగా పెట్టి కాపాడుకుంది. సెంట్రల్ ట్రినిడాడ్లోని కునుపియాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత సంతతికి చెందిన ఓ మహిళ అత్యంత సాహసం చేసింది. మంటల్లో చిక్కుకున్న తల్లిదండ్రులను తన ప్రాణాలు పణంగా పెట్టి కాపాడుకుంది. సెంట్రల్ ట్రినిడాడ్లోని కునుపియాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
రియా (24) తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ఇంట్లో మంగళవారం ఉదయం సుమారు ఐదు గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇల్లంతా చుట్టుముట్టి, అగ్నికీలలు భారీ ఎత్తున ఎగిసి పడుతుండగా తన తల్లిదండ్రులను కాపాడుకునేందుకు సాహసం చేసింది. ఈ క్రమంలో తాను ఆ మంటలకు ఆహుతైపోయింది.
ఫ్రీ లాన్స్ వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్న ఆమె తండ్రి రామ్దేవ్ కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. తన కూతుర్ని కాపాడుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు. చివరికి ఆమె మృతదేహాన్ని వంటింట్లో కనుగొన్నారు. ట్రినిటాడ్ అండ్ టుబాగో గార్డియన్ పత్రిక ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది. రియాను హీరోగా అభివర్ణించింది.