నా ఉద్యోగం పోయింది అని బాధపడుతూ కూర్చోలేదు ఆమె. కొత్త కరియర్‌ను వెతుక్కుంది. పడిలేచిన కెరటంలా ఒక కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించుకొంది. కట్ చేస్తే వైట్ హౌస్‌లో స్పెషల్ గెస్ట్‌గా అవతరించింది.ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన దీపావళి వేడుకలకు ఆహ్వానం అందుకున్న 600 మంది ప్రముఖ భారతీయ అమెరికన్లలో ఒకరిగా నిలిచింది. టెక్కీ-నుంచి ఫుడ్ ఆర్టిస్ట్‌గా పాపులర్ చెఫ్ ప్రియాంక నాయక్ సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం రండి!
అమెరికాలోని బోస్టన్ యూనివర్శిటీలో చదువుకున్న భారతీయ సంతతికి చెందిన స్టేటెన్ ద్వీపానికి చెందిన ప్రియాంక నాయక్ ఎక్స్(ట్విటర్)లో పనిచేసింది. లేఆఫ్స్‌లో భాగంగా 2022 లో ఉద్యోగాన్ని కోల్పోయింది. అంతకుముందు దాదాపు పదేళ్ల పాటు వివిధకంపెనీల్లో టెకీగా పని చేసింది. టెక్ ప్రపంచంలోతనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. టెకీగా విజయం సాధించినప్పటికీ, నాయక్ మనసు మాత్రం ఎపుడూ వంటలు చుట్టూ తిరుగుతూ ఉండేది. ఇందలో ఉద్యోగం మీద దెబ్బ పడింది. కానీ ఆమె పట్టుదల మాత్రం చెక్కు చెదరలేదు. వంట చేయడం పట్ల ఆమెకున్న అభిరుచినే పెట్టుబడిగా మల్చుకుంది. సోషల్ మీడియాలో పాకశాస్త్ర బ్లాగ్‌తో ఆమె అవార్డ్ విన్నింగ్ జర్నీ మొదలైంది. ప్రత్యేకమైన తన వంటకాలను నెటిజన్లుతో పంచుకొనేది.సుస్థిరత, పర్యావరణ అనుకూల విధానాలతో శాకాహారి చెఫ్‌గా మంచి ఆదరణను దక్కించుకుంది. క్రిస్సీ టీజెన్ లాంటి టాప్ సెలబ్రిటీలను ఆకర్షించింది.
తొలి తరం భారతీయ అమెరికన్‌గా, నాయక్ తన బ్రాండ్‌లో వంట పుస్తక విక్రయాలు, సోషల్ మీడియా స్పాన్సర్‌షిప్స్, వాషింగ్టన్ పోస్ట్‌లోని ఆమె ప్రత్యేకమైన “ఎకోకిచెన్” కాలమ్ ద్వారా మంచి ఖ్యాతిని సంపాదించింది. అటు ఆర్థికంగా సక్సెస్‌ను అందుకుంది. లక్షల్లో ఆర్జించడంతో పాటు ఇటు పాపులారిటీని కూడా దక్కించుకుంది. (తాతగారి సెన్సేషనల్ విడాకులు : భరణం ఎంతో తెలిస్తే అవాక్కే!)
ఈ క్రమంలోనే 2024 అక్టోబర్లో నాయక్ వైట్ హౌస్‌లో జరిగిన అతిపెద్ద దీపావళి వేడుకలకు స్పెషల్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న 600 మంది ప్రముఖ భారతీయ అమెరికన్లలో తాను కూడా ఉన్నానంటూ తన స్టోరీ సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక.
‘‘జీవితంలో ఎన్నో కష్టాలు, వ్యక్తిగతంగా, వృతిపరంగా ఎన్నో అవమానాలు.. తిరస్కరణలు.. కానీ స్వయంకృషితో రచయిత/టీవీహోస్ట్‌గాఎదిగాను. ఇపుడు ప్రతిష్టాత్మక వైట్‌హౌస్ దీపావళి వేడుకలకు హాజరు.. ఇది చాలా సంతోషంగానూ,గర్వంగానూ ఉంది’’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ప్రియాంక.
Comments
Please login to add a commentAdd a comment