Whitehouse
-
ఎక్స్‌లో లేఆఫ్, కట్ చేస్తే : వైట్‌హౌస్‌లోకి సగర్వంగా ‘ప్రియాంక’
నా ఉద్యోగం పోయింది అని బాధపడుతూ కూర్చోలేదు ఆమె. కొత్త కరియర్‌ను వెతుక్కుంది. పడిలేచిన కెరటంలా ఒక కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించుకొంది. కట్ చేస్తే వైట్ హౌస్‌లో స్పెషల్ గెస్ట్‌గా అవతరించింది.ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన దీపావళి వేడుకలకు ఆహ్వానం అందుకున్న 600 మంది ప్రముఖ భారతీయ అమెరికన్లలో ఒకరిగా నిలిచింది. టెక్కీ-నుంచి ఫుడ్ ఆర్టిస్ట్‌గా పాపులర్ చెఫ్ ప్రియాంక నాయక్ సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం రండి!అమెరికాలోని బోస్టన్ యూనివర్శిటీలో చదువుకున్న భారతీయ సంతతికి చెందిన స్టేటెన్ ద్వీపానికి చెందిన ప్రియాంక నాయక్ ఎక్స్(ట్విటర్)లో పనిచేసింది. లేఆఫ్స్‌లో భాగంగా 2022 లో ఉద్యోగాన్ని కోల్పోయింది. అంతకుముందు దాదాపు పదేళ్ల పాటు వివిధకంపెనీల్లో టెకీగా పని చేసింది. టెక్ ప్రపంచంలోతనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. టెకీగా విజయం సాధించినప్పటికీ, నాయక్ మనసు మాత్రం ఎపుడూ వంటలు చుట్టూ తిరుగుతూ ఉండేది. ఇందలో ఉద్యోగం మీద దెబ్బ పడింది. కానీ ఆమె పట్టుదల మాత్రం చెక్కు చెదరలేదు. వంట చేయడం పట్ల ఆమెకున్న అభిరుచినే పెట్టుబడిగా మల్చుకుంది. సోషల్ మీడియాలో పాకశాస్త్ర బ్లాగ్‌తో ఆమె అవార్డ్ విన్నింగ్ జర్నీ మొదలైంది. ప్రత్యేకమైన తన వంటకాలను నెటిజన్లుతో పంచుకొనేది.సుస్థిరత, పర్యావరణ అనుకూల విధానాలతో శాకాహారి చెఫ్‌గా మంచి ఆదరణను దక్కించుకుంది. క్రిస్సీ టీజెన్ లాంటి టాప్ సెలబ్రిటీలను ఆకర్షించింది. తొలి తరం భారతీయ అమెరికన్‌గా, నాయక్ తన బ్రాండ్‌లో వంట పుస్తక విక్రయాలు, సోషల్ మీడియా స్పాన్సర్షిప్స్, వాషింగ్టన్ పోస్ట్‌లోని ఆమె ప్రత్యేకమైన “ఎకోకిచెన్” కాలమ్ ద్వారా మంచి ఖ్యాతిని సంపాదించింది. అటు ఆర్థికంగా సక్సెస్‌ను అందుకుంది. లక్షల్లో ఆర్జించడంతో పాటు ఇటు పాపులారిటీని కూడా దక్కించుకుంది. (తాతగారి సెన్సేషనల్ విడాకులు : భరణం ఎంతో తెలిస్తే అవాక్కే!)ఈ క్రమంలోనే 2024 అక్టోబర్‌లో నాయక్ వైట్ హౌస్‌లో జరిగిన అతిపెద్ద దీపావళి వేడుకలకు స్పెషల్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న 600 మంది ప్రముఖ భారతీయ అమెరికన్లలో తాను కూడా ఉన్నానంటూ తన స్టోరీ సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక.‘‘జీవితంలో ఎన్నో కష్టాలు, వ్యక్తిగతంగా, వృతిపరంగా ఎన్నో అవమానాలు.. తిరస్కరణలు.. కానీ స్వయంకృషితో రచయిత/టీవీహోస్ట్గాఎదిగాను. ఇపుడు ప్రతిష్టాత్మక వైట్‌హౌస్ దీపావళి వేడుకలకు హాజరు.. ఇది చాలా సంతోషంగానూ,గర్వంగానూ ఉంది’’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ప్రియాంక. View this post on Instagram A post shared by Priyanka Naik | Eco Chef & Travel (@chefpriyanka) -
కరోనా నుంచి 5.6 కోట్ల మంది సురక్షితం: యూఎస్
వాషింగ్టన్: కరోనా మహమ్మారితో పోరాడుతున్నప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 56 మిలియన్ల మంది ప్రజలు కరోనా సంబంధిత ఆరోగ్య సంరక్షణ శిక్షణా పద్ధతుల వల్ల ప్రయోజనం పొందారని యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఏఐడీ) పేర్కొంది. ఈ సందర్భంగా అమెరికా శ్వేత సౌధం ప్రతినిధులు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.." భారత ప్రజల ఆరోగ్య సంరక్షణకు భారత ప్రభుత్వానికి సహకరించడంలో యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) విజయవంతమైంది. ఈ క్రమంలో కరోనా వైరస్ నుంచి భారత్ ప్రజలు సురక్షితంగా బయటపడటానికి కావాల్సిన మెడికల్ ల్యాబోరేటరీలు, ఆక్సిజన్ ప్లాంట్స్, మందులు, మానవతా సాయం తదితర వాటి కోసం సీడీసీ సుమారు 16 మిలియన్ల డాలర్లు కేటాయించింది. ఈ మేరకు సైబర్ సెక్యురిటీపై నిరంతర భాగస్వామ్యం తోపాటు ర్యాన్సమ్వేర్ వంటి సైబర్ ఎనేబుల్డ్ నేరాలను ఎదుర్కోనేలా సురక్షిత సాఫ్ట్వేర్ అభివృద్ధికి తమ వంతు సహకారం అందజేస్తాం" అని అధికారులు సమావేశంలో వెల్లడించారు. (చదవండి: ఇదేం వింత.. బాలిక ఎడమ కంటి నుంచి కన్నీళ్లతో పాటు రాళ్లు కూడా..) అదే విధంగా గత సంవత్సరంలో యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) భారత్ భాగస్వామ్య సహకారంతో దాదాపు 200 పరిశోధన అవార్డులకు నిధులు సమకూరిందని తెలిపారు. ఈ క్రమంలో భారతదేశంలో ఆరోగ్య పరిశోధన సహకారాల సంఖ్య సుమారు 200 నుంచి దాదాపు 330కి పెరిగిందని, అంతేకాక పరిశోధనలో పాల్గొనే భారతీయ పరిశోధనా సంస్థల సంఖ్య కూడా దాదాపు 100 నుంచి 200కి పెరిగినట్లు వెల్లడించారు. అక్టోబర్ 28వ తేదీనన యూఎస్, భారత్ ఇండో పసిఫిక్ బిజినెస్ ఫోరమ్‌కి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇది ఇండో పసిఫిక్ ప్రాంతాలలోని ఇరు దేశాల ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని శ్వేత సౌధం అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. (చదవండి: భారత్ ఆక్రమిత ప్రాంతాల నుంచి పాక్ తక్షణమే వైదొలగాలి) -
అమెరికా: ప్రేమలోకంలో అధ్యక్ష దంపతులు
వాషింగ్టన్: ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆ దేశ ప్రథమ పౌరురాలు జిల్ ప్రేమలోకంలో మునిగారు. ఈ సందర్భంగా అధ్యక్ష భవనం ఆవరణంతా లవ్ సింబల్స్‌తో నింపేశారు. దేశ ప్రజలందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా వాషింగ్టన్‌లోని శ్వేతసౌధం ఆవరణలో మొత్తం హృదయ (హార్ట్) గుర్తులు, ఐక్యత (యూనిటీ), హోప్ (నమ్మకం), ప్రేమ (లవ్) అని రాసి ఉన్న ఎర్రటి హార్ట్ సింబల్స్, పోస్టర్లు అధ్యక్ష భవనం ఆవరణలో అలంకరించారు. బైడెన్, ఆయన భార్య జిల్‌తో పాటు వారు పెంచుకుంటున్నరెండు జర్మన్ శునకాలు ఛాంప్, మేజర్‌తో పాటు ఆ పచ్చిక బయళ్లల్లో కలియ తిరిగారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఒకరినొకరు చూసుకంటూ తమ పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ‘ఈ కరోనా సమయంలో ప్రతి అమెరికా పౌరుడు కొంత నిరాశగా ఉండవచ్చునని, వేలంటైన్ డే ని మునుపటిలా ఉత్సాహంగా జరుపుకోలేకపోవచ్చు’ అని ప్రథమ పౌరురాలు జిల్ తెలిపారు. కొద్దిపాటి జాయ్, లిటిల్ హోప్ ఉండాలని సూచించారు. అయితే ‘ఇది ఫస్ట్ లేడీ ఫేవరేట్ డే’ అని బైడెన్ పేర్కొన్నారు. తాను అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన కార్యాలయంలో హార్ట్ సింబల్స్‌తో ఉన్న పోస్టర్లను జిల్ నింపేదని గుర్తుచేశారు. 43 ఏళ్ల వివాహ అనుబంధాన్ని బైడెన్ దంపతులు నెమరువేసుకున్నారు. I know the last year has been difficult and painful for all of us. I hope Jill’s Valentine’s Day message helped brighten your day. pic.twitter.com/jdEFMSDefm — President Biden (@POTUS) February 13, 2021 -
గాంధీ విగ్రహ ధ్వంసం: అమెరికా తీవ్ర విచారం
వాషింగ్టన్: అమెరికాకు బహుమానంగా ఇచ్చిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం కూల్చివేసిన ఘటనపై అమెరికా స్పందించింది. ఈ ఘటన విచారకరమని పేర్కొంటూ శ్వేతసౌధం క్షమాపణలు కోరింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం డేవిస్ పట్టణంలో ఉన్న సెంట్రల్ పార్క్‌లో జనవరి 27వ తేదీన కొందరు దుండగులు గాంధీ విగ్రహాన్ని కూల్చివేశారు. ఈ ఘటనపై కాలిఫోర్నియా అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి అమెరికా అధ్యక్ష భవనం స్పందించింది. (చదవండి: అమెరికాలో గాంధీ విగ్రహ ధ్వంసంపై భారత్ ఆగ్రహం) ‘‘గాంధీ స్మారక కట్టడాలపై దాడులపై మేం ఆందోళన చెందుతున్నాం. కాలిఫోర్నియా ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దుర్ఘటనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. దుండగులను గుర్తించి శిక్షస్తాం’’ అని శ్వేతసౌధ మీడియా కార్యదర్శి జెన్ సాకీ తెలిపారు. 2016లో ఆరడుగుల ఎత్తు, 4 అంగుళాల వెడల్పు, 294 కిలోల బరువున్న గాంధీ కాంస్య విగ్రహాన్ని భారత్ అమెరికాకు బహుమతిగా ఇచ్చింది. ఈ విగ్రహాన్ని కాలిఫోర్నియా రాష్ట్రం డేవిస్ పట్టణంలోని సెంట్రల్ పార్క్‌లో ప్రతిష్టించారు. అయితే జనవరి 27వ తేదీన కొందరు దుండగులు గాంధీ విగ్రహాన్ని కూల్చివేశారు. ఈ ఘటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భారత రాయబారి కార్యాలయంతో సంప్రదింపులు చేస్తున్నామని వెంటనే చర్యలు తీసుకుంటామని గతంలో డేవిస్ పట్టణ మేయర్ ప్రకటించారు. -
అధ్యక్షుడిగా బైడెన్ తొలి సంతకం.. కీలక నిర్ణయాలు
వాషింగ్టన్: అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్వేతసౌధంలోకి వెళ్లిన జో బైడెన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు జో బైడెన్ అధ్యక్షుడి హోదాలో సంతకం చేశారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయాలపై బైడెన్ ఎన్నికల్లో చెప్పినట్టు వాటిని వెనక్కి తీసుకున్నారు. ఈ విధంగా 15 కీలక కార్యనిర్వాహక ఆదేశాలపై బైడెన్ సంతకాలు చేశారు. బైడెన్ తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైనవి ఇవే.. (చదవండి : చరిత్ర సృష్టించిన జో బైడెన్) బైడెన్ తొలి నిర్ణయం కరోనా నుంచి ప్రజలను బయటపడడమే. అందులో భాగంగా కోవిడ్-19 రెస్పాన్స్ కో ఆర్డినేటర్ పదవిని సృష్టిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు వంద రోజుల పాటు మాస్క్‌లు, భౌతిక దూరం పాటించాలని బైడెన్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి వైదొలగడాన్ని విరమించుకున్నారు. ట్రంప్ హయాంలో అమెరికా డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అమెరికా- పారిస్ వాతావరణ ఒప్పందంలో బైడెన్ నిర్ణయంతో అమెరికా మళ్లీ చేరింది. ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతూ ట్రంప్ నిర్ణయం తీసుకోవడాన్ని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా వ్యతిరేకించింది. మెక్సికో గోడ నిర్మాణంపై బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోడ నిర్మాణానికి నిధుల సమీకరణకు తీసుకొచ్చిన నేషనల్ ఎమర్జెన్సీ డిక్లరేషన్‌ను నిలిపివేశారు. గ్రీన్ కార్డు జారీలో దేశాలకు పరిమితిని బైడెన్ ఎత్తేశారు. ఈ నిర్ణయంతో భారతదేశంతో పాటు ఎన్నో దేశాల వారికి ఉపశమనం కలగనుంది. అమెరికా వీసాల జారీలో ఆంక్షలను క్రమేణ ఎత్తివేసేలా బైడెన్ వ్యూహం ఉంది. అమెరికా అభివృద్ధిలో కీలకంగా ఉన్న వలసదారులకు శాశ్వత పౌరసత్వం, నివాసం కల్పిస్తూ బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. వీటితో జాతి వివక్ష, ముస్లిం దేశాల రాకపోకలపై నిర్ణయాలు ఉన్నాయి. మొత్తానికి బైడెన్ గత అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలన్నింటినీ వెనక్కి తీసుకున్నారు. అమెరికా ప్రజలకు మేలు చేస్తూనే ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు పెంచుకునేలా బైడెన్ తీరు కనిపిస్తోంది. -
అమెరికా అధ్యక్షుల పెంపుడు జంతువులు ఇవే..
వైట్‌హౌస్ అంటే అక్కడి ప్రెసిడెంటు గారిలాగే ఆయన పెంపుడు జంతువులు (పెట్స్) కూడా ఫేమసే.. ఎప్పుడో 1789లో అమెరికా మొదటి అధ్యక్షుడిగా పీఠాన్ని అధిరోహించిన జార్జ్ వాషింగ్టన్ నుంచి మొన్నమొన్నటి బరాక్ ఒబామా దాకా పెంపుడు జంతువులంటే పడి చచ్చేవారే.. ఒక్క మన ట్రంప్ మాత్రమే మినహాయింపు.. ఆయనకు పెంపుడు జంతువులు లేనేలేవు.. అమెరికా అధ్యక్షుల్లో అలా లేకపోవడం ఓ రికార్డు కూడా.. కనీసం కుక్కనైనా పెంచుకోమని సలహా ఇస్తే.. నాకంత టైం లేదని ట్రంప్ కొట్టిపారేశారు. బైడెన్ రాకతో వైట్‌హౌస్‌లో మళ్లీ ఇప్పుడు పెంపుడు జంతువులు ప్రవేశించనున్నాయి. ఆయనకు రెండు కుక్కలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు పెంచుకునే వాటిల్లో కుక్కలు, పిల్లులు, గుర్రాలు, మేకలు, గొర్రెలు, రకరకాల పక్షులు.. అంతేనా.. ఎలుగుబంట్లు, మొసలి కూడా ఉన్నాయి. జార్జ్ వాషింగ్టన్ దగ్గర బోలెడన్ని గుర్రాలు ఉండేవి. వాటితోపాటు మొసలి కూడా ఉండేది. అది ఆయన బాత్రూంలోనే మకాం వేసేదట. విదేశాల నుంచి వచ్చిన అతిథులు సడెన్‌గా దాన్ని చూసి.. హడలి చచ్చిన రోజులున్నాయి. ఇక ఉడ్రో విల్సన్ గారి గొర్రెలు వైట్‌హౌస్ లాన్‌లోనే గడ్డిమేసిన ఉదంతాలెన్నో. ఇలా చెప్పుకుంటే బోలెడు కథలు. కొందరు అధ్యక్షులైతే.. . కొన్ని రకాల పక్షులు, గొర్రెల మందలను పెంచుకునేవారని.. అవి ఎన్ని వందలు ఉండేవో వాటి లెక్కే లేదని ప్రెసిడెన్షియల్ పెట్ మ్యూజియం గణాంకాలు చెబుతున్నాయి. వాటిని లెక్కేయకుండా.. ప్రధానమైన పెంపుడు జంతువుల లెక్కను మాత్రమే ఈ పెట్ మ్యూజియం నిర్వహిస్తోంది. దీని ప్రకారం అందరి కన్నా ఎక్కువగా.. థియేడర్ రూజ్వెల్ట్ వద్ద 48 పెంపుడు జంతువులు ఉండేవి. ఇందులో 6 కుక్కలు, 2 పిల్లులు, 40 ఇతర జంతువులు ఉన్నాయి. అందరి అధ్యక్షుల లిస్టు అంటే చదవడం కష్టం కానీ.. ఓసారి బైడెన్‌తో కలుసుకుని లాస్ట్ 10 మంది అధ్యక్షుల పెంపుడు జంతువుల జాబితా ఓసారి చూసేద్దామా.. -
సొంత ప్రాంతం వీడుతూ జో బైడెన్ భావోద్వేగం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్ బుధవారం వాషింగ్టన్ బయల్దేరారు. అమెరికాలోని డెలావర్ నుంచి వాషింగ్టన్కు పయనమయ్యారు. అంతకుముందు డెలావర్‌లోని విల్మింగ్టన్లో ఆయనకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సభలో జో బైడెన్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. "నా చివరి శ్వాస వరకు డెలావర్ ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటుంది. నేను ఇక్కడ లేకపోవడం నన్ను బాధిస్తున్న.. మీరు నన్ను ఇక్కడి నుంచి అధ్యక్షుడిని చేసి పంపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని తెలిపారు. కరోనాతో మరణించిన వారికి మంగళవారం రాత్రి బైడెన్ దంపతులతో పాటు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారీస్ దంపతులు నివాళులర్పించారు. 4 లక్షల మంది అమెరికా పౌరులను కరోనా వలన కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. బైడెన్ ప్రమాణానికి వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్ భవనం ముస్తాబైంది. అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్ బుధవారం రాత్రి 10.30 గంటలకు(భారత కాలమానం ప్రకారం) బాధ్యతలు స్వీకరించనున్నారు. అమెరికా సుప్రీంకోర్టు సీజే జాన్ రాబర్ట్స్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. అయితే బైడెన్ కంటే ముందు ఉపాధ్యక్షురాలు కమలాదేవి హ్యారిస్ ప్రమాణస్వీకారం చేస్తారు. -
బైడెన్ బృందంలో మరో భారతీయురాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష స్థానాన్ని అధిరోహించనున్న జో బైడెన్ తన టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తన బృందంలో భారత సంతతికి చెందిన వారికి పెద్దపీట వేస్తున్న బైడెన్ ఇప్పుడు మరొకరికి కూడా కీలక బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. శ్వేత భవనంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌కు డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా 32 ఏళ్ల భారత సంతతికి చెందిన సబ్రినా సింగ్‌ను నియమించారు. ఎన్నికల సమయంలో బైడెన్, కమలా హ్యారీస్‌కు మీడియా కార్యదర్శిగా సబ్రినా సింగ్ పని చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అంతకుముందు అమెరికాలో డెమొక్రటిక్ నేషనల్ కమిటీలో కమ్యూనికేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. గతంలో సబ్రినా మైక్ బ్లూంబర్గ్ అధ్యక్ష ప్రచార సీనియర్ ప్రతినిధిగా, కోరీ బుకర్ అధ్యక్ష ప్రచారానికి నేషనల్ ప్రెస్ సెక్రెటరీగా పని చేసింది. అమెరికన్ బ్రిడ్జ్ ట్రంప్ వార్ రూమ్ ప్రతినిధి, హిల్లరీ క్లింటన్ 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రాంతీయ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గానూ సేవలందించారు. ఆమె ఎస్కేడీకే నికర్ బాకర్ కన్సల్టింగ్ సంస్థ, రిపబ్లిక్ జాన్ షాకోవ్స్కీకి కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా, వివిధ డెమొక్రాటిక్ కమిటీల్లోనూ పని చేశారు. ఎంతో గౌరవం: సబ్రినా సింగ్ డిప్యూటీ ప్రెస్ కార్యదర్శిగా నియమితులవడంపై సబ్రినా సింగ్ సంతోషం వ్యక్తం చేసింది. వైట్‌హౌస్ బృదంలో చేరడం ఎంతో గొప్ప విషయమని, గౌరవంగా భావిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. కమలా హ్యారీస్‌కు పని చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు ట్వీట్ చేశారు. -
కీలక వీడియో రిలీజ్ చేసిన ట్రంప్
వాషింగ్టన్: కరోనా బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం విషమిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఓ వీడియో ద్వారా ప్రజల ముందుకొచ్చారు. సంపూర్ణ ఆరోగ్యంతో అతి త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నేను ఆస్పత్రిలో చేరే సమయంలో అనారోగ్యంతో కాస్త ఇబ్బంది పడ్డా. ప్రస్తుతం బాగానే ఉన్నా’నని ట్రంప్ పేర్కొన్నారు. త్వరలోనే కోలుకుంటానని ఆశిస్తున్నానని.. కానీ రానున్న రెండు మూడు రోజులు అత్యంత కీలకం అని ఆయన అన్నారు. (ట్రంప్‌కు కరోనా!) అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే విడిచిపెట్టాల్సి వచ్చిందని.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ప్రచారాన్ని ఉధృతం చేస్తానని ట్రంప్ చెప్పారు. వాషింగ్టన్‌లోని వాల్టర్ రీడ్ మిలటరీ ఆస్పత్రిలో ట్రంప్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆయన ‘వర్క్ ఫ్రమ్ హాస్పిటల్’ చేసేందుకు వీలుగా వైట్ హౌస్‌లోని స్పెషల్ సూట్ రూమ్‌ను ‘అధ్యక్ష కార్యాలయం’గా మార్చేశారు. అధికార నివాసం వైట్ హౌస్‌లోని అధికారులతో ట్రంప్ ఇక్కడి నుంచే నేరుగా మంతనాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రిలోనే ఈ వీడియో రికార్డు చేసినట్టు తెలుస్తున్నప్పటికీ ఎప్పుడు షూట్ చేశారనే విషయమై క్లారిటీ లేదు. ఆస్పత్రిలో చేరిన వెంటనే రికార్డు చేశారా లేక లేటెస్ట్ వీడియోనా అనే విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. ట్రంప్ ఆరోగ్యం ఆందోళనకరంగా మారిందని, రెండు రోజులు గడిస్తేగానే పూర్తి వివరాలు చెప్పలేమంటూ అధికార ప్రకటన వెలువడినట్టు వార్తలొచ్చాయి. -
వైట్‌హౌస్‌లో ఒకరికి పాజిటివ్ : నేను ఓకే!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార నివాసం వైట్‌హౌస్‌లో మరోసారి కరోనా కలకలం రేగింది. వైట్ హౌస్ సిబ్బంది ఒకరికి తాజాగా కోవిడ్-19 పాజిటివ్ నిర్దారణ అయింది. ముగ్గురు ప్రపంచ నాయకులతో కలిసి చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై ట్రంప్ సంతకం చేసిన మరుసటి రోజు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వైట్ హౌస్ బ్రీఫింగ్ సందర్భంగా, అధ్యక్షుడు ట్రంప్ సిబ్బందిలో ఒకరికి కరోనా సోకిందని ధృవీకరించారు. కానీ అతనితో తనకు సంబంధం లేదనీ, సన్నిహితంగా మెలగలేదని ట్రంప్వివరించారు. (డీల్ నచ్చలేదు.. సంతకం చేయను : ట్రంప్ ) మరోవైపు వైట్‌హౌస్ సమావేశానికి కరోనా ప్రభావిత వ్యక్తి చాలా దూరంగా ఉన్నారనీ వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్‌నానీ తెలిపారు. బాధిత వ్యక్తి మీడియాకు దగ్గరిగా లేడనీ, సమావేశాన్ని ప్రభావితం చేయలేదనీ, విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాగా మార్చి నెలలో తొలిసారి వైట్ హౌస్‌లో కరోనా కలకలం రేపింది. ఆ తరువాత డొనాల్డ్ ట్రంప్ భద్రతా సలహాదారుడు రాబర్ట్ ఒబ్రెయిన్‌కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. -
అన్నంత పని చేసిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. అమెరికాలో విదేశీ వృత్తి నిపుణులు ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్–1బీ, హెచ్–2బీ, జే, ఎల్1, ఎల్2 వీసాలపై నిషేధాన్ని ఈ ఏడాది చివరి వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. గ్రీన్‌కార్డుల జారీని కూడా 2020 డిసెంబర్ వరకు నిలిపివేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వులు జూన్ 24 నుంచి డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటాయి. వలస విధానంలో సమూల సంస్కరణల్ని తీసుకువచ్చి ఇకపై ప్రతిభ ఆధారంగా వీసాలు మంజూరు చేయాలని అధికార యంత్రాంగానికి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి ఎన్నిక కావాలని తహతహలాడుతున్న ట్రంప్... తాను తీసుకున్న నిర్ణయం అమెరికన్లకు లాభం చేస్తుందని అంటున్నారు. కరోనా వైరస్ వల్ల అమెరికాలో అంతకంతకూ పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని కట్టడి చేసి, స్థానికులకు ఉద్యోగావకాశాలు పెంచడానికే వలస విధానంలో మార్పులు తెస్తున్నట్లు చెప్పారు. అత్యవసరాలైన ఆహారం, వైద్య రంగాలతోపాటు కరోనా పరిశోధనల్లో పని చేసే వారికి దీని నుంచి మినహాయింపులున్నాయి. గత ఏప్రిల్‌లో 60 రోజులపాటు ఈ వీసాలపై నిషేధం విధించిన ట్రంప్ సర్కార్ ఈ ఏడాది చివరి వరకు దీనిని పొడిగించింది. 5.25 లక్షల ఉద్యోగాలు ఖాళీ వీసాల జారీపై ఈ ఏడాది వరకు నిషేధం పొడిగిస్తూ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత శ్వేతసౌధం అధికారి మీడియాతో మాట్లాడారు. హెచ్–1బీ, ఎల్1 వీసాలపై తాత్కాలిక నిషేధంతో అమెరికాలో 5.25 లక్షల ఉద్యోగాలు ఖాళీ కానున్నాయని అంచనాలున్నట్టుగా చెప్పారు. ఆ ఉద్యోగాలన్నింటినీ అమెరికన్లతో భర్తీ చేసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని ట్రంప్ దృష్టి సారించినట్టు ఆయన వెల్లడించారు. లాటరీ విధానం రద్దుకు సన్నాహాలు ఇన్నాళ్లూ హెచ్1బీ వీసాలను లాటరీ విధానం ద్వారా ఇచ్చేవారని, ఇకపై ఉద్యోగాల్లో తీసుకునే విదేశీ పనివారి నైపుణ్యం, వారికిచ్చే వేతనం ఆధారంగా వీసాలు జారీ చేస్తారని వైట్‌హౌస్ అధికారులు వెల్లడించారు. ‘ప్రతీ ఏడాది హెచ్–1బీ వీసాలు 85 వేల వరకు జారీ చేస్తాం. కానీ దరఖాస్తులు 2 నుంచి 3 లక్షలు వస్తాయి. ఇకపై లాటరీ విధానాన్ని రద్దు చేసి ప్రతిభ ఆధారంగా మంజూరు చేయాలని అధ్యక్షుడు ఆదేశించారు. అంటే అత్యధిక వేతనాలు లభించే 85 వేల మందికి మంజూరు చేస్తాం. దీనివల్ల నైపుణ్యం కలిగిన వారికే పనిచేసే అవకాశం వస్తుంది’అని ఆ అధికారి వివరించారు. ట్రంప్ నిర్ణయంపై అమెరికన్లలో హర్షం ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికన్లలో పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం అవుతోంది. మేరీల్యాండ్‌లో వాషింగ్టన్ పోస్ట్ యూనివర్సిటీ నిర్వహించిన పోల్‌లో 65శాతం ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. కరోనా వైరస్ విసిరిన సవాళ్లతో వలసదారుల నుంచి తమ ఉపాధికి ముప్పు ఉంటుందని 81శాతం అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేసినట్టు ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన సర్వేలో వెల్లడైంది. భారతీయులపై ప్రభావం ఎంత ? అమెరికాలో ఇప్పటికే వివిధ వీసాలతో ఉద్యోగాలు చేస్తున్న వారిపై ఈ నిషేధం ఎలాంటి ప్రభావం చూపించదు. అయితే కొత్తగా అమెరికా వెళ్లాలనుకునే వారిపై దీని ప్రభావం చూపిస్తుంది. ప్రతీ ఏడాది మంజూరు చేసే హెచ్–1బీ వీసాలు 85 వేలకు వీసాలకు గాను 70శాతం మంది భారతీయులే. వారందరూ ఇక ఏడాది పాటు వేచి చూడాలి. అయితే కరోనా వైరస్ ఉధృతి కారణంగా ఇప్పట్లో ఎవరూ విదేశీ ప్రయాణాలు చేయడానికి ఇష్టపడడం లేదు. ఎన్నో టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్తోనే పనులు జరిపించుకుంటున్నాయి. అందువల్ల అందరూ అనుకునేటంత నష్టం ఉండదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. అమెరికా టెక్ కంపెనీల్లో ఆందోళన అమెరికాలో వృత్తి నిపుణులకు భారీగా వేతనాలు చెల్లించాలి. విదేశీయులైతే తక్కువ వేతనాలకు వస్తారన్న కారణంగా ఎన్నో బహుళ జాతీయ కంపెనీలు అమెరికన్లకు బదులుగా విదేశీ వర్కర్లను ఉద్యోగాల్లో నియమిస్తున్నాయి. గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ , అమెజాన్, ఫేస్బుక్ వంటి ఐటీ దిగ్గజాలకు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఎదురు దెబ్బ తగలనుంది. హెచ్–1బీ వీసాలను అత్యధికంగా స్పాన్సర్ చేస్తూ విదేశీ వర్కర్ల సేవల్ని ఎక్కువగా ఈ కంపెనీలు వినియోగించుకుంటున్నాయి. ఇక అమెరికాలో ఉన్న భారతీయ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ వంటి కంపెనీలూ కూడా తక్కువ వేతనాలకే భారతీయ టెక్కీలను ఉద్యోగాల్లోకి తీసుకొని లబ్ధి పొందుతున్నాయి. తాజా ఉత్తర్వులతో టెక్ కంపెనీలు విదేశీ వర్కర్లను పనిలోకి తీసుకోలేవు. ఆ పని చేసే సామర్థ్యం అమెరికన్లకు లేకపోవడం, వారు ఆ ఉద్యోగాల్లోకి రావడానికి ఇష్టపడకపోవడం కూడా కంపెనీ యజమానుల్లో ఆందోళన పెంచుతోంది. సుందర్ పిచాయ్ అసంతృప్తి ట్రంప్ నిర్ణయంపై గూగుల్ సీఈవో, ఇండియన్ అమెరికన్ సుందర్ పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వలసదారుల పక్షానే తాను ఉంటానని అవకాశాలు అందరికీ ఇవ్వాలన్నారు. ‘అమెరికా ఆర్థిక విజయాలకు వలస విధానమే ఎంతో తోడ్పడింది. టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా అమెరికాను నిలిపిందంటే, గూగుల్ ఇప్పుడు ఇలా నిలిచిందింటే ఆ విధానమే కారణం’అని పిచాయ్ ట్వీట్ చేశారు. న్యాయస్థానంలో నిలబడుతుందా? ట్రంప్ కొత్త ఉత్తర్వులపై అమెరికన్ కంపెనీల్లోనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అమెరికా ఫస్ట్ రికవరీ పేరుతో ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలని అధ్యక్షుడు భావిస్తున్నప్పటికీ ఈ వీసాలపై నిషేధం పొడిగించడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టమని అక్కడ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా వలస విధానాలను వ్యతిరేకంగా ఉందని ఇమ్మిగ్రేషన్ నిపుణుల అభిప్రాయంగా ఉంది. న్యూయార్క్‌కి చెందిన ఇమ్మిగ్రేషన్ యాక్ట్ సంస్థ వ్యవస్థాపకుడు సైరస్ మెహతా ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఎవరైనా కోర్టుకెక్కే అవకాశం ఉందన్నారు. ‘ట్రంప్ ప్రకటన ఇమ్మిగ్రేషన్, నేషనాలటీ చట్టాలకు పూర్తిగా వ్యతిరేకం. ఎవరైనా కోర్టుకెళితే దీనిని నిలిపివేస్తారు. ఇలా నిషేధం పొడిగించడం వల్ల అమెరికాలో కొత్త ఉద్యోగాల కల్పన జరగదు. ఈ వీసాలపై ఉద్యోగాలు చేస్తున్న వారంతా అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఎంతో సాయంగా ఉన్నారు’అని వ్యాఖ్యానించారు. -
వీసాలపై ట్రంప్ కీలక నిర్ణయం
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్ 1బీ వీసాను తాత్కాలికంగా రద్దు చేయాలని ఆదేశించారు. ఇక ఈ ఏడాది డిసెంబర్31 వరకూ హెచ్ 1బీ, హెచ్ 2బీ, జే 1, ఎల్ 1 వీసాల జారీని నిలిపివేశారు. హెచ్ 1బీ రెన్యువల్స్‌కు ఢోకా లేదని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. హెచ్ 1బీ వీసాల జారీ విధానంలో సంస్కరణలకు ట్రంప్ పిలుపు ఇచ్చారు. మెరిట్ ఆధారంగానే హెచ్1బీ వీసాల జారీకి మొగ్గుచూపారు. దీంతో ప్రతిభావంతులకే అమెరికాలో ఎంట్రీ లభించనుంది. కాగా అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వలస ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. అమెరికన్ల ఉద్యోగాలను కాపాడేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చేందుకే ట్రంప్ హెచ్ 1బీ వీసాల జారీలో సంస్కరణలకు మొగ్గుచూపారని వైట్‌హౌస్ పేర్కొంది. అమెరికన్ల ఉద్యోగాలు కాపాడేందుకే.. కరోనా మహమ్మారితో అమెరికాలో నిరుద్యోగ రేటు విపరీతంగా పెరిగిన క్రమంలో అమెరికన్ల ఉద్యోగాలను కాపాడే లక్ష్యంతో వలస విధానం, వీసాల జారీ ప్రక్రియలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారని వైట్‌హౌస్ వెల్లడించింది. ఈ సంస్కరణలు అమెరికన్ ఉద్యోగుల వేతనాలను కాపాడతాయని పేర్కొంది. అత్యధిక నైపుణ్యాలతో కూడిన విదేశీ ప్రొఫెషనల్స్‌కే అమెరికాలో ప్రవేశానికి అనుమతి లభిస్తుందని తెలిపింది. అమెరికన్ ఉద్యోగుల స్ధానంలో తక్కువ వేతనాలకే లభించే విదేశీ ఉద్యోగులను యజమానులు నియమించుకుంటున్న క్రమంలో ఆ లోటుపాట్లను సవరించేందుకు ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వైట్‌హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. వలసలతో ముప్పు వీసాల నిలిపివేత ఉత్తర్వుల్లో ట్రంప్ ప్రధానంగా అమెరికన్ల ఉద్యోగాలకు వలసదారులతో ముప్పు ఎదురవుతుందనే అంశాన్ని నొక్కిచెప్పారు. అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో దాదాపు ప్రతి రంగంలో అమెరికన్లు ఉద్యోగాల కోసం విదేశీయులతో పోటీపడాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. తాత్కాలిక పనుల కోసం అమెరికాలోకి వచ్చే లక్షలాది విదేశీయులతో అమెరికన్లు పోటీపడుతున్నారని, వలసదారులతో పాటు వారి కుటుంబసభ్యులతో సైతం అమెరికన్లు ఉద్యోగాల కోసం పోటీపడుతున్నారని ప్రస్తావించారు. సాధారణ పరిస్ధితుల్లో తాత్కాలిక ఉద్యోగుల రాకతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగినా కోవిడ్-19 వ్యాప్తితో నెలకొన్న అసాధారణ పరిస్థితుల్లో తాత్కాలిక ఉద్యోగులు అమెరికన్ ఉద్యోగుల ఉపాథికి పెనుముప్పుగా పరిణమించారని ట్రంప్ పేర్కొన్నారు. మూడు నెలల్లో 2 కోట్ల ఉద్యోగాలు మాయం ఈ ఏడాది ఫిబ్రవరి-ఏప్రిల్‌లో అమెరికాలో పలు పరిశ్రమల్లో కోల్పోయిన 17 లక్షల ఉద్యోగాల భర్తీకి యజమానులు హెచ్2బీ నాన్ఇమిగ్రెంట్ వీసాల ద్వారా నియామకాలకు ప్రయత్నిస్తున్నారని గుర్తుచేశారు. ఇదే సమయంలో కీలక పరిశ్రమల్లో పనిచేసే 2 కోట్ల మందికి పైగా అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోగా, ఈ స్ధానాల భర్తీకి యజమానులు హెచ్1బీ, ఎల్ 1 వర్కర్ల వైపు చూస్తున్నారని ఉత్తర్వుల్లో ట్రంప్ యంత్రాంగం పేర్కొంది. జే1 వీసాదారులతో ఉద్యోగాలకు పోటీపడే అమెరికన్ యువతలో నిరుద్యోగ రేటు అత్యధికంగా 20 శాతం పైగా ఉందని వెల్లడించింది. చదవండి : వెనక్కి రావాల్సిందేనా! -
ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన..
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యూఎస్ సైనిక అకాడమీలో శనివారం ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో కుడిచేతితో మంచినీటి గ్లాస్‌ను అందుకునేందుకు ట్రంప్ ఇబ్బంది పడిన వీడియో వైరల్‌గా మారింది. గ్లాస్‌ను పైకెత్తి నీరు తాగేందుకు తన ఎడమ చేతి సాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఆయనకు ఎదురైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రంప్ ఆరోగ్యంపై మళ్లీ ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ట్రంప్ ఇటీవల ఆర్మీ కాలేజ్‌లో గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి ప్రసంగించి మెట్లు దిగి వచ్చే సందర్భంలోనూ కుదురుగా ఉండలేకపోయారు. రానున్న అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాల పర్యటనలతో ఆయన అలసటకు గురయ్యారని కొందరు చెబుతుండగా మరికొందరు మాత్రం ఆయన ఆరోగ్యం తీవ్రంగా గాడితప్పిందనే సంకేతాలు ఇవని పేర్కొంటున్నారు. ఈ ఏడాది ట్రంప్ ఆరోగ్యంపై వార్షిక నివేదిక వెలువడకపోవడాన్ని వారు ఉదహరిస్తున్నారు. కాగా ట్రంప్‌కు బ్రైన్ స్కాన్ తీయాల్సిన అవసరం ఉందని ఈ లక్షణాలు వెల్లడిస్తున్నాయని ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ బెండీ లీ ట్వీట్ చేశారు. మరోవైపు తాను పూర్తి ఆరోగ్యంతో తన వయసుకు తగిన సౌష్టవంతో ఉన్నానని ట్రంప్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తగా మలేరియా చికిత్సకు వాడే హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ను ఆయన రెండు వారాల పాటు వాడటంతో సైడ్‌ఎఫెక్ట్స్‌ను పసిగట్టేందుకు వైట్‌హౌస్ వైద్య బృందం ఆయనకు ఈసీజీ సహా తరచూ వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. చదవండి : జుకర్ బర్గ్ దంపతుల సంచలనం : ట్రంప్‌కు షాక్ -
ఆటం బాంబులా చెలరేగిన ట్రంప్
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దివాళీ ఆటం బాంబులా చెలరేగారు. భారత సంతతికి చెందిన వారి గౌరవార్ధం వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన దివాళీ వేడుకల్లో రెచ్చిపోయారు. ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) చైర్మన్, ఇండో అమెరికన్ అజిత్ పాయ్ టార్గెట్‌గా తనదైన శైలిలో మండిపడ్డారు. ఈ ఏడాది జులైలో ట్రిబ్యూన్ మీడియాను సిన్‌క్లెయిర్ బ్రాడ్కాస్ట్ గ్రూప్ టేకోవర్ చేయడానికి ఎఫ్‌సీసీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవడాన్ని ట్రంప్ తప్పుపట్టారు. ఎఫ్‌సీసీ నిర్ణయం విచారకరం, అసమంజసమని అప్పట్లోనే అభివర్ణించారు. అయితే ఇదే విషయం మనసులో పెట్టుకున్న ట్రంప్ దివాళీ వేడకలకు హాజరైన అజిత్ పాయ్‌ను ఏకంగా పేరు పెట్టి పిలిచి మరీ ముందుకు పిలిపించుకున్నారు. అజిత్ తీసుకున్న ఓ నిర్ణయం తనకు ఎంతమాత్రం నచ్చలేదని, ఆయన నిర్ణయం అసలు నచ్చకపోయినా ఆయనకు ఆ స్వతంత్రత ఉందని అందరి సమక్షంలో వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడి సూచనల మేరకు అధికారులు నామినేట్ అయినప్పటికీ ఎఫ్‌సీసీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. అజిత్ పాయ్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో నియమితులవగా, ఎఫ్‌సీసీ చీఫ్‌గా ట్రంప్ ఆయనను ప్రమోట్ చేశారు. ఇక ట్రిబ్యూన్‌ను కొనుగోలు చేయడం ద్వారా 70 శాతం అమెరికన్ లోగిళ్లలోకి రీచ్‌ను పెంచుకోవాలని టీవీ దిగ్గజం సిన్‌క్లెయిర్ ప్రణాళికలు రూపొందించుకుంది. సిన్‌క్లెయిర్ ట్రిబ్యూన్ డీల్‌కు ట్రంప్ సానుకూలంగా ఉండగా, ఎఫ్‌సీసీ ఈ ప్రతిపాదనకు చెక్ పెట్టడం దుమారం రేపింది. మరోవైపు ఫేక్‌న్యూస్ ప్రసారం చేసిన టీవీ న్యూస్ ఛానెళ్ల లైసెన్సుల పునరుద్ధరణపై 2017లో అధ్యక్షుడికి వ్యతిరేకంగా పాయ్ పనిచేశారు. ఆయా ఛానెళ్ల లైసెన్సుల పునరుద్ధరణపై ట్రంప్ సూచనలను పాయ్ పెడచెవినపెట్టారు. ఆయా సందర్భాల్లో తన నిర్ణయాన్ని అజిత్ పాయ్ గట్టిగా సమర్ధించుకున్నారు. -
సాక్షాత్తు ట్రంప్‌ను ఆటపట్టించాడు
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్షుడిని కూడా ఆటపట్టించేందుకు అవకాశముంటుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఓ సాధారణ కమెడియన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఓ వ్యక్తి ఆటపట్టించాడు. అదీ ఆయన తన అధికారిక ఎయిర్‌ఫోర్స్ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలోనే. అధ్యక్షుడు ట్రంప్‌నకు బుధవారం రాత్రి న్యూజెర్సీ సెనేటర్ రాబర్ట్ మెనెండెజ్ అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. అతడు వలస విధానం నుంచి జస్టిస్ ఆంటోనీ కెన్నడీ రిటైరైన తర్వాత ఎవరు నియమితులవుతారనే దాకా పలు విషయాలపై ముచ్చటించారు. సెనేటర్ రాబర్ట్‌పై గతంలో అవినీతి ఆరోపణలు రాగా దర్యాప్తు అనంతరం నిర్దోషిగా బయటపడ్డారు. ఈ సందర్భంగానే ట్రంప్ దీనిని ప్రస్తావిస్తూ ‘మీరు చాలా కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. అది మంచి పరిస్థితి అని నేననుకోను’అంటూ వ్యాఖ్యానించారు. ఈ సంభాషణను కమెడియన్ జాన్ మెలెండెజ్ ‘ది స్టట్టరింగ్ జాన్ పాడ్‌కాస్ట్’లో ఉంచారు. సెనేటర్ సహాయకుడి పేరుతో వైట్‌హౌస్‌కు ఫోన్ చేయగా అక్కడి అధికారులే తనకు ట్రంప్‌తో మాట్లాడేందుకు అవకాశమిచ్చారని అందులో పేర్కొన్నారు. ఈ పరిణామంతో దేశ సర్వసైన్యాధ్యక్షుడి ప్రొటోకాల్ వ్యవస్థ నిర్వహణ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, అధ్యక్ష భవనం దీనిపై ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. -
ట్రంప్-కిమ్‌ల భేటికి డేట్ ఫిక్స్
వాషింగ్టన్: ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా- ఉత్తరకొరియా దేశాధినేతలు డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్ భేటికి తేది ఖరారైంది. సింగపూర్‌లో జూన్ 12న ఉదయం 9 గంటలకు ఈ సమావేశం జరగనుందని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి శారా సాండర్స్ వెల్లడించారు. ‘ఈ నెల 12న కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశం నేపథ్యంలో అదనపు భద్రతా దళాలు సింగపూర్ వెళ్లనున్నాయి. జూన్11 రాత్రి 9 నుంచి సమావేశ ప్రాంతాన్ని మా భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంటారు. ఈ సమావేశంలో ఉత్తర కొరియా ప్రతినిధి బృందంతో అమెరికా రాయబారి దౌత్య చర్చలు కొనసాగిస్తారు. ట్రంప్-కిమ్‌ల చర్చలు సానుకూలంగా సాగనున్నాయ’ని శాండర్స్ పేర్కొన్నారు. కాగా, గత వారం ట్రంప్ ఉత్తర కొరియా రాయబారి కిమ్ యోంగ్ చోల్‌తో వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ పంపించిన లేఖను అధికారులు ట్రంప్‌కు అందజేశారు. అధికారులతో చర్చించిన తర్వాత జూన్ 12 కిమ్ తో సమావేశం కానున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఉత్తర కొరియాను అణ్వస్త్ర రహితంగా మార్చడం ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరగనుంది. -
‘మహిళా పైలట్.. మీకు సెల్యూట్..’
వాషింగ్టన్ : సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన మహిళా పైలట్ టామ్ జో షల్ట్స్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారు. గత నెల 17న సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 1380 విమాన ఇంజిన్ పేలిపోవడంతో ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో పైలట్ టామ్ జో షల్ట్స్ చాకచక్యంగా వ్యవహరించి 144 మంది ప్రాణాలను కాపాడారు. ఈ నేపథ్యంలో పైలట్ టామ్‌తోపాటు విమాన సిబ్బందిని అభినందించేందుకు ట్రంప్ వారిని వైట్‌హౌజ్‌కి ఆహ్వానించారు. ఓవల్ ఆఫీస్‌లో వారితో సమావేశమైన ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఎంతోమంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన, ధైర్యవంతులైన హీరోలు వైట్‌హౌజ్‌కి రావడం నాకెంతో గర్వంగా ఉందం’టూ అభినందించారు. ‘మీ ధైర్యం వల్లే ఎంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎంతో మంది ప్రాణాలు నిలిచాయి. మీకు సెల్యూట్ చేస్తున్నానంటూ’ ట్రంప్ టామ్ జో షల్ట్స్‌ను అభినందించారు. ఎవరీ టామ్ జో షల్ట్స్.. అమెరికన్ నేవీలో పనిచేసిన మొదటి మహిళా పైలట్లలో టామ్ జో షల్ట్స్ ఒకరు. సూపర్సోనిక్ ఎఫ్‌జె-18 హార్నెట్స్ వంటి విమానాలు నడిపిన ఘనత ఆమె సొంతం. ఆ అనుభవంతోనే 30 వేల అడుగులో ఇంజన్ పేలిపోయినా ఆమె ధైర్యం కోల్పోకుండా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి.. వందల మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి ధీర వనితగా అందరిచే ప్రశంసలు అందుకుంటున్నారు. -
‘ఒబామా కేర్’పై ట్రంప్‌కు ఎదురుదెబ్బ
సొంత పార్టీలోనే వ్యతిరేకత ⇒ మెజార్టీ సభ్యులు లేక కొత్త వైద్య పాలసీపై చర్చ వాయిదా ⇒ బిల్లుకు మద్దతివ్వాలంటూ రిపబ్లికన్ సభ్యులకు ట్రంప్ అల్టిమేటం వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సొంత పార్టీకి చెందిన రిపబ్లికన్ సభ్యులే షాకిచ్చారు. దీంతో ఒబామాకేర్ వైద్య పాలసీ స్థానంలో కొత్త పాలసీని ప్రవేశపెట్టాలన్న ట్రంప్ ఆశలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అమెరికన్ కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో గురువారం బిల్లుపై చర్చ సందర్భంగా మెజార్టీ సభ్యులు హాజరుకాకపోవడంతో స్పీకర్ చర్చను శుక్రవారానికి వాయిదా వేశారు. బిల్లు ఆమోదానికి తగినంత మంది సభ్యుల మద్దతు కూడగట్టడంలో సర్కారు విఫలమైంది. ట్రంప్ రంగంలోకి దిగి బిల్లుకు మద్దతివ్వాలంటూ రిపబ్లికన్ పార్టీ సభ్యులకు అల్టిమేటం జారీ చేశారు. రిపబ్లికన్ సభ్యులతో భేటీ నిర్వహించి.. బిల్లుకు మద్దతివ్వకపోతే జరిగే పరిణామాల్ని వివరించారు. ఒబామాకేర్తో అధిక వ్యయంతో పాటు తక్కువ సదుపాయాలు అందుతున్నాయని.. ఇది కొనసాగితే పరిస్థితి దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో బిల్లు ఆమోదం పొందకపోతే ఇతర మార్గాల్లో దాన్ని ట్రంప్ అమలు చేస్తారని వైట్‌హౌస్ బడ్జెట్ డైరెక్టర్ మిక్ ముల్వనే హెచ్చరించారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, అందులో భాగమే ఈ కొత్త వైద్య పాలసీ అని వైట్‌హౌస్ పేర్కొంది. అయినప్పటికీ తగినంత మద్దతు లభించకపోవడంతో శుక్రవారం ఒబామా కేర్ స్థానంలో ప్రవేశపెట్టిన హెల్త్ కేర్ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. మనసు మాట వింటా!: ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టైమ్ మ్యాగ్జైన్కు ప్రత్యేక ఇంటర్వూ్య ఇస్తున్న సమయంలో ‘నేనేమీ అంత చెడ్డగా నిర్ణయాలు తీసుకోవడం లేదు.. ఎందుకంటే నేను అమెరికా అధ్యక్షుడిని, నువ్వు కాదు’ అంటూ విలేకరిపై అసహనం వ్యక్తం చేశారు. ‘నేను స్వభావ సిద్ధంగా మనసు చెప్పేది చేసే తరహా వ్యక్తిని. ఆ విధంగా నేను తీసుకున్న నిర్ణయాలు దాదాపు అన్ని సందర్భాల్లోనూ నిజమయ్యాయి’ అని వివరించారు. గతంలో చేసిన వివాదాస్పద ప్రకటనల్ని ఆయన సమర్థించుకున్నారు. ఎన్నికల సమయంలో ఒబామా ప్రభుత్వం తన ఫోన్ కాల్స్‌ని ట్యాప్ చేసిందని, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ట్రంప్ ఆరోపించారు. అలాగే బ్రెగ్జిట్‌కు అనుకూలంగా బ్రిటన్ ప్రజలు ఓటేస్తారని కూడా జోస్యం చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు రుజువవుతాయని, కమిటీ నివేదిక అనంతరం స్పందిస్తానని చెప్పారు. బ్రెగ్జిట్ విషయంలోను తన అంచనాయే నిజమైందన్నారు. -
ట్రంప్‌కు వినిపించలేదేమో...
మెర్కెల్‌కు షేక్‌హ్యాండ్ తిరస్కరణపై వైట్‌హౌస్ ప్రతినిధి వివరణ బెర్లిన్: గతవారం శ్వేతసౌధంలో మీడియా సమావేశం సందర్భంగా జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్‌తో కరచాలనం చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించలేదని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి సీన్ స్పైసర్ తెలిపారు. షేక్‌హ్యాండ్ కోసం మెర్కెల్ చేసిన సూచనను ట్రంప్ వినకపోయి ఉండొచ్చని ఆయన ఆదివారం ఓ జర్మనీ పత్రికతో చెప్పారు. శుక్రవారం మెర్కెల్ అమెరికా పర్యటన సుహృద్భావ వాతావరణంలో ప్రారంభమైంది. శ్వేతసౌధం ప్రవేశం వద్ద ఇద్దరు నేతలు కరచాలనం చేసుకున్నారు. అయితే ఓవల్ కార్యాలయంలో మీడియా ముందు మరోసారి కరచాలనం చేయాలన్న మెర్కెల్ సూచనను ట్రంప్ పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది. దాదాపు 30 నిమిషాలు జరిగిన ఆ మీడియా సమావేశంలో వారిరువురు నాటో, రక్షణ వ్యయం, స్వేచ్ఛా వాణిజ్యం గురించి మాట్లాడినా ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది తక్కువే. వైట్‌హౌస్‌లో మెర్కెల్‌తో చర్చల సందర్భంగా ట్రంప్ ఒక్కసారి కూడా ఆమె కళ్లలోకి చూసి మాట్లడలేదని జర్మన్ పత్రిక బిల్డ్ తెలిపింది. -
గ్రీన్‌కార్డు ఉంటే.. నిషేధం మినహాయింపు
ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికాలోకి ప్రవేశించకుండా అరికట్టేందుకు ఏడు ముస్లిం దేశాలపై మూడు నెలల పాటు విధించిన నిషేధానికి కొంత మినహాయింపు లభించింది. గ్రీన్ కార్డు ఉన్నవాళ్లయితే ఆ దేశాలకు చెందినవాళ్లయినా సరే నిరభ్యంతరంగా అమెరికాకు ప్రయాణం చేయొచ్చని, అందుకు ప్రత్యేక అనుమతులేవీ తీసుకోనవసరం లేదని ట్రంప్ యంత్రాంగం తెలిపింది. గ్రీన్ కార్డు ఉన్నవాళ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమెరికా రావచ్చని, ఇక్కడి నుంచి వెళ్లొచ్చని వైట్‌హౌస్ అధికార ప్రతినిధిన సీన్ స్పైసర్ చెప్పారు. ఏడు ప్రధాన ముస్లిం దేశాలకు చెందిన ప్రజలు మూడు నెలల పాటు అమెరికాకు రాకుండా వారిపై ట్రావెల్ బ్యాన్ విధించాలని కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా కలకలం రేగడంతో స్పైసర్ తాజా ప్రకటన వెలువడింది. ట్రంప్ ఆదేశాలపై అంతర్జాతీయంగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆదేశాలు వెలువడిన వెంటనే గ్రీన్ కార్డులు ఉన్నవారిని కూడా విదేశాలకు వెళ్లే విమానాలు ఎక్కనివ్వలేదు. లేదా విదేశాల నుంచి వచ్చిన వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటినుంచి మాత్రం గ్రీన్‌కార్డు ఉన్నవారికి ఈ బాధలు ఉండవని అధికారులు స్పష్టం చేశారు. ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ దేశాలకు చెందినవారిని మూడు నెలల పాటు అమెరికాకు ప్రయాణాలు చేయకుండా నిషేధించిన విషయం తెలిసిందే. -
ట్రంప్ ప్రమాణం రేపే
వైట్‌హౌస్ నుంచి ఒబామా బయటకు, ట్రంప్ లోపలికి అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రేపు(జనవరి 20న) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికా చట్టసభలకు నెలవైన క్యాపిటల్ భవనం(వాషింగ్టన్ డీసీ) మెట్లపై ప్రమాణం చేసిన రోజే ఆయన అధికార నివాసం వైట్‌హౌస్‌లోకి కుటుంబసమేతంగా అడుగుపెట్టనున్నారు. ఆ రోజు ఉదయం అధ్యక్ష భవనంలోని తన పడకగదిలో నిద్రలేచే అధ్యక్షుడు బరాక్ ఒబామా సాయంత్రానికి భార్యాపిల్లలతో కలసి నగరంలోని మరో భవనంలోకి వెళ్లిపోతారు. శుక్రవారం మధ్యాహ్నం ట్రంప్‌తో 45వ అధ్యక్షునిగా అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయిస్తారు. ట్రంప్‌కు ముందు ఉపాధ్యక్షునిగా మైకేల్ పెన్స్ ప్రమాణం ఉంటుంది. ప్రమాణాల తర్వాత ట్రంప్ తొలి ప్రసంగం చేస్తారు. ఒబామాకు వీడ్కోలు : ఒబామా వీడ్కోలు కార్యక్రమం ముగిశాక, ట్రంప్ తొలిసారి అమెరికా కాంగ్రెస్ మధ్యాహ్న భోజన విందులో పాల్గొంటారు. తర్వాత అధ్యక్ష ప్రారంభోత్సవ పరేడ్‌లో పాల్గొంటారు. వెంటనే ప్రమాణం చేసిన ప్రదేశం క్యాపిటల్ నుంచి ట్రంప్ తన కాన్వాయ్‌తో పెన్సిల్వేనియా అవెన్యూ(క్యాపిటల్, వైట్‌హౌస్‌ను కలిపి మెయిన్‌రోడ్) గుండా శ్వేతసౌధానికి చేరుకుంటారు. 20నే ప్రమాణం ఎందుకు? లీప్ సంవత్సరం నవంబర్‌లో అమెరికా అధ్యక్షునిగాఎన్నికైన అభ్యర్థి జనవరి 20న ప్రమాణం చేసే సంప్రదాయం 1937లో ఆరంభమైంది. దేశ 32వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ రెండోసారి 1936లో ఎన్నికయ్యాక జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు వరకూ మార్చి 4న(అమెరికా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు) కొత్త అధ్యక్షుడు ప్రమాణం చేయడం సంప్రదాయంగా 140 ఏళ్లు కొనసాగింది. సాధారణంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కొత్త అధ్యక్షునితో ప్రమాణం చేయిస్తారు. ఒబామాతో రెండుసార్లూ(2009, 2013) అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. ట్రంప్‌తో ఆయనే ప్రమాణం చేయిస్తారు. ప్రమాణానికి బాలీవుడ్ డ్యాన్సర్లు ముంబై: ప్రముఖ కొరియోగ్రాఫర్ సురేశ్ ముఖుద్ వద్ద శిక్షణ పొందిన దాదాపు 30 మంది భారత డ్యాన్సర్లు ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రదర్శన ఇవ్వనున్నారు. వీరిలో చాలా మంది బాలీవుడ్‌కు చెందిన వారే. కొద్దిరోజుల క్రితమే వాషింగ్టన్లో మకాం వేసిన ముఖుద్ డ్యాన్స్ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. తాను కలలు కన్న అవకాశం ఇప్పుడు తనకు వచ్చిందని పేర్కొన్నారు. కాపిటల్ భవనం 70 ఏళ్ల వయసులో..: అధ్యక్షునిగా తొలిసారి ప్రమాణం చేసినప్పుడు ఎక్కువ వయసు ఉన్న నేతగా ఇప్పటి వరకూ రోనాల్డ్ రీగన్(69 ఏళ్ల 345 రోజులు) రికార్డుల్లో ఉన్నారు. రీగన్ రికార్డును జనవరి 20న ట్రంప్ బద్దలు గొట్టబోతున్నారు. ఆ రోజున ట్రంప్ వయసు 70 సంవత్సరాల, ఏడు నెలల, ఏడు రోజులు. నాకు ట్వీటింగ్ ఇష్టముండదు: ట్రంప్ తనకు ట్వీటింగ్ ఇష్టముండదని, అయితే నిజాయితీ లేని మీడియాపై సోషల్ మీడియాలో పోరాడతానని ట్రంప్ చెప్పారు. ‘నిజాయితీ లేని మీడియా.. ప్రెస్ నా ముందు ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి ట్విటరే నాకున్న ఏకైక మార్గం’ అని ఓ ఇంటర్వూ్యలో అన్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పెరల్ హార్బర్‌కు షింజో
వాషింగ్టన్: జపాన్ ప్రధానమంత్రి షింజో అబే త్వరలో అమెరికాలోని పెరల్ ఓడరేవును సందర్శించనున్నారు. 75 సం॥క్రితం రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఈ ఓడరేవుపై జపాన్ దాడి చేసిన తర్వా త ఇప్పటి వరకు జపాన్ నాయకులెవరూ దీన్ని సందర్శించ లేదు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ఒబామాతో కలసి హార్బర్‌ను సందర్శించనున్న తొలి జపాన్ ప్రధాని షింజో అబేనే కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. డిసెంబర్ 27న హవాయ్‌లోని హొనొలొలులో ఒబామా జపాన్ ప్రధానితో భేటీ అవుతారని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి ఎర్నెస్ట్ తెలిపారు. గత నాలుగేళ్లలో భద్రత, ఆర్థిక, గ్లోబల్ సవాళ్లు తదితర అంశా ల్లో ఇరుదేశాల సహకారంపై వీరిద్దరు చర్చించనున్నారు. -
ఉత్తర కొరియాపై ఒబామా సీరియస్
వాషింగ్టన్: మరోసారి అణ్వాయుధ పరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియాపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉ.కొరియా అణ్వాయుధాల ముప్పును అధ్యక్షుడు ఒబామా సీరియస్‌గా తీసుకున్నారని, అమెరికన్ల భద్రతకుముప్పు వాటిల్లకుండా గట్టి చర్యలు చేపడుతున్నారని వైట్‌హౌస్ పేర్కొంది. దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న ఉ.కొరియాకు వ్యతిరేకంగా చైనా సహా యావత్తు అంతర్జాతీయ సమాజం ఏకమైందని తెలిపింది. భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘిస్తున్న ఉ.కొరియాపై మండలి మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశముందని పేర్కొంది. ముందు జాగ్రత్తగా ముగువామ్ దీవుల్లో యాంటీ బాలిస్టిక్ క్షిపణుల వ్యవస్థ ను మోహరించినట్టు ఎర్నెస్ట్ తెలిపారు. అదే సమయంలో నౌకాదళ బలగాన్నీ పెంచుతున్నట్టు వెల్లడించింది. భారత్‌లో అక్రమ డ్రగ్స్ తయారీ: అమెరికా వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా భారత్‌తోపాటు 21 దేశాలు అక్రమంగా మత్తుమందులను ఉత్పత్తి చేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. అఫ్గనిస్తాన్, బహమాస్, మయన్మార్, బొలీవియా, వెనిజులాతోపాటు పలు ఆఫ్రికా, యూరప్ దేశాల పేర్లను ఒబామా ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే.. దీంతో సంబంధం లేకుండా తమ మిత్ర దేశాలైనా బొలీవియా, మయన్మార్, వెనిజులాలకు అమెరికా సాయం అందుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నార్కోటిక్స్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఏకాభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమెరికన్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీన్ని తీవ్రంగా పరిగణిస్తామన్నారు. -
చైనాలోనూ ‘వైట్‌హౌస్’
అగ్రరాజ్యమైన అమెరికా దేశాధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ వాషింగ్టన్లో ఉంది. అయితే చైనాలోనూ ఒక వైట్‌హౌస్ ఉంది. దీనిని గ్రేట్‌వాల్ ఇంటర్నేషనల్ మూవీ స్టూడియో సంస్థ నిర్మించింది. టెక్నాలజీ విషయంలో ముందున్న చైనా పర్యాటక రంగాన్ని ఆకర్షించేందుకు విదేశాల్లో ఉండే అరుదైన కట్డడాలను నిర్మిస్తోంది. ప్రపంచంలోని ఈఫిల్ టవర్, పీసా టవర్, ఈజిప్ట్ పిరమిడ్, తాజ్‌మహల్, లండన్ బ్రిడ్జి లాంటి ప్రముఖ కట్టడాలను పరిశీలించిన చైనా ఇవన్నీ కలిసిన వింత భవనం వైట్ హౌస్ నిర్మించింది. అంతేకాదు చైనీయులు పూజించే ‘టెంపుల్ ఆఫ్ హెవెన్’ ఆలయాన్ని కలిపిన భవనాన్ని ఈ స్టూడియో నిర్మించింది. - బీజింగ్ -
1 నవంబర్,1800 వైట్‌హౌస్ ప్రవేశం!
ఆ నేడు అమెరికా అధ్యక్షుడు జాన్ ఆడమ్స్ తన నివాసాన్ని తొలిసారిగా వైట్‌హౌస్‌లోకి మార్చారు. అంతకు ముందు వరకు అమెరికా అధ్యక్షుని నివాసం ఫిలడెల్ఫియాలోని మార్కెట్ స్ట్రీట్ మ్యాన్షన్‌లో ఉండేది. అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ , పెన్సిల్వేనియాలో (వాషింగ్టన్) ఎంపిక చేసిన స్థలంలో 1792లో కట్టడం మొదలు పెట్టారు. రెండో అధ్యక్షుడైన జాన్ ఆడమ్స్ హయాం లో పూర్తయింది. దీని నిర్మాణానికి అప్పట్లో సుమారు 13 కోట్ల రూపాయలు ఖర్చయిందని అంచనా. వైట్‌హౌస్‌లో ఉన్న తొలి అధ్యక్షుడు జాన్ ఆడమ్స్. అప్పటినుంచి అమెరికా అధ్యక్షులందరూ ఇందులోనే నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం వైట్‌హౌస్ అని వ్యవహరిస్తున్న ఈ భవనానికి దాన్ని కట్టాక వందేళ్లకి కానీ ఆ పేరు ఏర్పడలేదు. ఒకసారి అది కాలిపోయిన ప్పుడు మరమ్మతుల కోసం తెల్లరంగు వేశారు. దాంతో ప్రజలు దానిని వైట్‌హౌస్ అని పిలిచేవారు. అయితే అధికారికంగా మాత్రం 1901లో థియోడర్ రూజ్వెల్ట్ దీనిని వైట్ హౌస్ అని పిలిచారు. అత్యవసర సమయంలో విధులు నిర్వహించేందుకు వీలుగా దీని భూగర్భంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఓ బంకర్ ఉంది.