పెరల్ హార్బర్‌కు షింజో
వాషింగ్టన్: జపాన్ ప్రధానమంత్రి షింజో అబే త్వరలో అమెరికాలోని పెరల్ ఓడరేవును సందర్శించనున్నారు. 75 సం॥క్రితం రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఈ ఓడరేవుపై జపాన్ దాడి చేసిన తర్వా త ఇప్పటి వరకు జపాన్ నాయకులెవరూ దీన్ని సందర్శించ లేదు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ఒబామాతో కలసి హార్బర్‌ను సందర్శించనున్న తొలి జపాన్ ప్రధాని షింజో అబేనే కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
డిసెంబర్ 27న హవాయ్‌లోని హొనొలొలులో ఒబామా జపాన్ ప్రధానితో భేటీ అవుతారని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి ఎర్నెస్ట్ తెలిపారు. గత నాలుగేళ్లలో భద్రత, ఆర్థిక, గ్లోబల్ సవాళ్లు తదితర అంశా ల్లో ఇరుదేశాల సహకారంపై వీరిద్దరు చర్చించనున్నారు.