
చైనాలోనూ ‘వైట్‌హౌస్’
అగ్రరాజ్యమైన అమెరికా దేశాధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ వాషింగ్టన్‌లో ఉంది. అయితే చైనాలోనూ ఒక వైట్‌హౌస్ ఉంది. దీనిని గ్రేట్‌వాల్ ఇంటర్నేషనల్ మూవీ స్టూడియో సంస్థ నిర్మించింది. టెక్నాలజీ విషయంలో ముందున్న చైనా పర్యాటక రంగాన్ని ఆకర్షించేందుకు విదేశాల్లో ఉండే అరుదైన కట్డడాలను నిర్మిస్తోంది.
ప్రపంచంలోని ఈఫిల్ టవర్, పీసా టవర్, ఈజిప్ట్ పిరమిడ్, తాజ్‌మహల్, లండన్ బ్రిడ్జి లాంటి ప్రముఖ కట్టడాలను పరిశీలించిన చైనా ఇవన్నీ కలిసిన వింత భవనం వైట్ హౌస్ నిర్మించింది. అంతేకాదు చైనీయులు పూజించే ‘టెంపుల్ ఆఫ్ హెవెన్’ ఆలయాన్ని కలిపిన భవనాన్ని ఈ స్టూడియో నిర్మించింది.
- బీజింగ్