వాషింగ్టన్: కరోనా మహమ్మారితో పోరాడుతున్నప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 56 మిలియన్ల మంది ప్రజలు కరోనా సంబంధిత ఆరోగ్య సంరక్షణ శిక్షణా పద్ధతుల వల్ల ప్రయోజనం పొందారని యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్‌ఏఐడీ) పేర్కొంది. ఈ సందర్భంగా అమెరికా శ్వేత సౌధం ప్రతినిధులు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.." భారత ప్రజల ఆరోగ్య సంరక్షణకు భారత ప్రభుత్వానికి సహకరించడంలో యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) విజయవంతమైంది.
ఈ క్రమంలో కరోనా వైరస్ నుంచి భారత్ ప్రజలు సురక్షితంగా బయటపడటానికి కావాల్సిన మెడికల్ ల్యాబోరేటరీలు, ఆక్సిజన్ ప్లాంట్స్, మందులు, మానవతా సాయం తదితర వాటి కోసం సీడీసీ సుమారు 16 మిలియన్ల డాలర్లు కేటాయించింది. ఈ మేరకు సైబర్ సెక్యురిటీపై నిరంతర భాగస్వామ్యం తోపాటు ర్యాన్‌సమ్‌వేర్ వంటి సైబర్ ఎనేబుల్డ్ నేరాలను ఎదుర్కోనేలా సురక్షిత సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి తమ వంతు సహకారం అందజేస్తాం" అని అధికారులు సమావేశంలో వెల్లడించారు.
(చదవండి: ఇదేం వింత.. బాలిక ఎడమ కంటి నుంచి కన్నీళ్లతో పాటు రాళ్లు కూడా..)
అదే విధంగా గత సంవత్సరంలో యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్) భారత్ భాగస్వామ్య సహకారంతో దాదాపు 200 పరిశోధన అవార్డులకు నిధులు సమకూరిందని తెలిపారు. ఈ క్రమంలో భారతదేశంలో ఆరోగ్య పరిశోధన సహకారాల సంఖ్య సుమారు 200 నుంచి దాదాపు 330కి పెరిగిందని, అంతేకాక పరిశోధనలో పాల్గొనే భారతీయ పరిశోధనా సంస్థల సంఖ్య కూడా దాదాపు 100 నుంచి 200కి పెరిగినట్లు వెల్లడించారు.
అక్టోబర్ 28వ తేదీనన యూఎస్, భారత్ ఇండో పసిఫిక్ బిజినెస్ ఫోరమ్‌కి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇది ఇండో పసిఫిక్ ప్రాంతాలలోని ఇరు దేశాల ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని శ్వేత సౌధం అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.
(చదవండి: భారత్ ఆక్రమిత ప్రాంతాల నుంచి పాక్ తక్షణమే వైదొలగాలి)
Comments
Please login to add a commentAdd a comment